కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం
స్వరూపం
కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం | |
---|---|
IUCN category IV (habitat/species management area) | |
Location | తెలంగాణ, భారతదేశం |
Nearest city | భద్రాచలం |
Coordinates | 17°46′30″N 80°33′32″E / 17.775°N 80.559°E[1] |
Area | 635.40 కి.మీ2 (157,010 ఎకరం) |
Governing body | తెలంగాణ అటవీశాఖ |
కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని నదికి సమీపంలో ఉన్న వన్యప్రాణుల అభయారణ్యం. ఇది పాల్వంచ పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది.
చరిత్ర
[మార్చు]పాపికొండల నుండి జయశంకర్ జిల్లాలోని అటవీ ప్రాంతం వరకు విస్తరించివున్న కిన్నెరసాని అభయారణ్యం 1977లో 635.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించబడింది. టేకు, మద్ది, వెదురు వంటి వృక్షాలు పెరుగుతున్న ఈ అభయారణ్యంలో చిరుత, ఎలుగుబంట్లు, మనుబోతులు, మచ్చలజింక, సింహాలు, కృష్ణ జింకలు, అడవి పందులు, నక్కలు, హైనాలు, సరీసృపాలు, తుట్టె పురుగులు, గుర్రాలు, కొంగలు, కింగ్‌ఫిషర్, గిజిగాడు మొదలైన పక్షులు నివసిస్తున్నాయి.[2]
ఇతర వివరాలు
[మార్చు]- 2000 సంవత్సరంలో తొమ్మిది పులులు ఉండగా, 2012లో మూడు, 2016లో ఆ సంఖ్య రెండుకు చేరింది. ఇరవైతొమ్మిది చిరుత పులులు ఉండగా, 2012లో పదహారు, 2016 పన్నెండు చిరుతలు మిగిలాయి. కృష్ణజింకలు, నెమళ్లు కూడా కనిపించకుండా పోయాయి. ఇక్కడి మొసళ్ళు హైదరాబాదులోని నెహ్రూ జంతుప్రదర్శనశాలకు తరలించబడ్డాయి. ప్రస్తుతం ఈ జలాశయంలో వేల సంఖ్యల్లో మొసళ్లున్నాయి. 4,278 దుప్పులు, 658 కొండ గొర్రెలు, 1,892 అడవి గేదెలు, 412 ఎలుగుబంట్లు, 508 కనుజులు ఈ అభయారణ్యంలో సంచరిస్తున్నాయి.[3]
- పర్యాటకులను ఆకర్షించడంకోసం 2017లో మూడు లక్షల రూపాలతో రెండు నల్లరంగు హంసలను తీసుకొచ్చారు.[4]
చిత్రమాలిక
[మార్చు]-
ముష్టికాయ
-
రీసస్ మాకాక్ జాతికి చెందిన కోతి
-
ఇక్సోరా బ్రాచియా పై వాలిన కాటోప్సిలియా పోమోనా
-
జింకల పార్కు
-
నదిలోని ద్వీపం
మూలాలు
[మార్చు]- ↑ "Kinnerasani Sanctuary". protectedplanet.net.[permanent dead link]
- ↑ నమస్తే తెలంగాణ, జిందగీ వార్తలు (27 July 2018). "పచ్చని చేలా.. పావడ గట్టిన కిన్నెరసాని". మధుకర్ వైద్యుల. Archived from the original on 15 జూన్ 2019. Retrieved 15 June 2019.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలంగాణ (23 December 2017). "కళ తప్పుతున్న 'కిన్నెర'". Archived from the original on 15 June 2019. Retrieved 15 June 2019.
- ↑ The Hindu, Telangana (30 August 2017). "New attraction at Kinnerasani wildlife sanctuary". P. Sridhar. Retrieved 15 June 2019.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)
ఇతర లంకెలు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.