కింజరాపు రామ్మోహన నాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కింజరాపు రామ్మోహన నాయుడు
కింజరాపు రామ్మోహన నాయుడు


కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి[1]
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
9 జూన్ 2024

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2017
(నారా లోకేష్‌తో

కలిసి పనిచేస్తున్నారు)

ముందు స్థానం స్థాపించబడింది

లోక్‌సభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
16 మే 2014
ముందు కిల్లి కృపారాణి
నియోజకవర్గం శ్రీకాకుళం

వ్యక్తిగత వివరాలు

జననం (1987-12-18) 1987 డిసెంబరు 18 (వయసు 36)
నిమ్మాడ, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు కింజరాపు ఎర్రన్నాయుడు, విజయలక్ష్మి
జీవిత భాగస్వామి బండారు శ్రావ్య
బంధువులు కింజరాపు అచ్చెన్నాయుడు (బాబాయ్)
ఆదిరెడ్డి భవాని (అక్క)
బండారు సత్యనారాయణ మూర్తి (మామా)
ఆదిరెడ్డి శ్రీనివాస్ (బావ)
నివాసం శ్రీకాకుళం
పూర్వ విద్యార్థి పర్డ్యూ విశ్వవిద్యాలయం (బ్యాచులర్ ఆఫ్ సైన్సు)
లాంగ్ ఐలాండ్ విశ్వవిద్యాలయం ఎం.బి.ఎ

కింజరాపు రామ్మోహననాయుడు (జననం 1987 డిసెంబరు 18) భారతదేశ వరుసగా 16వ 17వ 18వ లోక్‌సభ సభ్యుడు. ఈయన శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కేంద్రమంత్రి వర్గ సభ్యులు(2024) .[2] ఆయన ప్రముఖ తెలుగుదేశం నాయకుడు కింజరాపు ఎర్రంనాయుడు యొక్క కుమారుడు. ఇంజనీరింగ్లో పట్టభద్రులైనాడు. తన 26 సంవత్సరాల ప్రాయం నుండి రాజకీయ జీవితంలోనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రులు అయిన ప్రతిభాభారతి, గుండ అప్పలసూర్యనారాయణ, ఆయన పినతండ్రి కింజరాపు అచ్చంనాయుడు సమక్షంలో ప్రవేశించారు. యాదృచ్ఛికంగా ఎర్రన్నాయుడు, అతని సోదరుడు అచ్చన్నాయుడు కూడా 26 సంవత్సరాల వయస్సునుండే తమ రాజకీయ జీవితం ప్రారంభించారు. ఎర్రన్నాయుడు గారి గృహంలో ప్రజలతో కలవడానికి, ప్రెస్ కాన్ఫరెన్సుల కొరకు ఆయన "ప్రజా సదన్"ను ప్రవేశపెట్టారు.[3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆయన శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ గ్రామంలో డిసెంబరు 18 1987 న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు విజయలక్ష్మి , ఎర్రన్నాయుడు.[4] రామ్మోహన్ నాయుడు ఒక అక్క ఉంది. ఒకటి నుంచి మూడో తరగతి దాకా శ్రీకాకుళంలోని గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీ హాస్టల్ లో ఉండి చదువుకున్నారరు. 1994 లో తండ్రి ఎర్రన్నాయుడు చీఫ్ విప్ అయ్యాడు. అప్పుడు పిల్లలను చదువుకోసం శ్రీకాకుళం నుంచి హైదరాబాదుకు తరలించాడు. అక్కడ భారతీయ విద్యాభవన్ లో నాలుగు, ఐదు తరగతులు చదివాడు. 1996 లో ఎర్రన్నాయుడు ఎం. పి గా ఎన్నికై కేంద్ర ప్రభుత్వ మంత్రి దక్కడంతో రామ్మోహన్ ఆరో తరగతిలో ఉండగా వీరి కుటుంబం ఢిల్లీకి మారింది.[5] ఢిల్లీలో ఆర్. కె. పురం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు.

చిన్నప్పుడు ఇంజనీరింగ్ పై ఆసక్తి ఉండేది. ఇంటర్ పూర్తి కాగానే అమెరికాలో బి. ఎస్ చదవడం కోసం పరీక్ష రాశాడు. అందులో ఎంపికై పర్డ్యూ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో చేరాడు. తర్వాత అక్కడే లాంగ్ ఐలాండ్ విశ్వవిద్యాలయం నుంచి ఎం. బి. ఎ పూర్తి చేశాడు. తర్వాత ఢిల్లీకి తిరిగివచ్చి ఒక ఇంటీరియర్ డెవెలప్మెంట్ కంపెనీ మార్కెటింగ్ వ్యవహారాలు చూసుకునేవాడు. అప్పుడే తండ్రి మరణం గురించి తెలిసింది.

రాజకీయ జీవితం

[మార్చు]

ఆయన భారత పార్లమెంటు సభ్యులలో ఉన్న యువకులలో ఒకడు. ఆయన 16వ 17వ 18వ లోకసభ కు వరుసగా ఎన్నికైనారు. ఆయన లోక్‌సభలో హోమ్‌ అఫైర్స్ స్టాండింగ్ కమిటీ, కన్సల్టేటివ్ కమిటీ, పర్యాటక , సంస్కృతి మంత్రిత్వ సాఖ, అధికార భాష , వెనుకబడినతరగతుల సంక్షేమం కమిటీలలో సభ్యులుగా ఉన్నారు.[4]జూన్ 9 వ తేదీ 2024 న కేంద్ర మంత్రి వర్గం లో కేంద్ర మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసి, రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత చిన్న వయసులో కేంద్ర మంత్రి పదవి పొందిన వ్యక్తి గా రికార్డు సృష్టించారు.[6] 18వ కేంద్ర మంత్రివర్గంలో గౌరవనీయులైన కింజరాపు రామ్మోహన నాయుడుకు పౌర విమానయాన శాఖను కేటాయించారు.రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖ [7]

ఎన్నికలలో పోటీ

[మార్చు]
ఎన్నికల ఫలితాలు
సంవత్సరం కార్యాలయం నియోజకవర్గం పార్టీ ఓట్లు % ప్రత్యర్థి పార్టీ ఓట్లు % ఫలితం మెజారిటీ మూ
2014 లోక్ సభ సభ్యుడు శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ 556,163 52.90 రెడ్డి శాంతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 428,591 40.76 గెలుపు 127572
2019 534,544 46.19 దువ్వాడ శ్రీనివాస్ 527,891 45.61 గెలుపు 6953
2024 754,328 61.05 తిలక్ పేరడ 426,427 34.51 గెలుపు 327901[8]

2024 భారత సార్వత్రిక ఎన్నికలలో 18 వ లోకసభ లో కేంద్రమంత్రి మండలి లో సభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన అతిపిన్నవయస్కులు 2024[9][10][11][12]

మూలాలు

[మార్చు]
  1. EENADU (10 June 2024). "రామ్మోహన్‌నాయుడికి పౌరవిమానయానం.. మంత్రులకు కేటాయించిన శాఖలివే." Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  2. "Constituencywise-All Candidates". Retrieved 17 May 2014.[permanent dead link]
  3. "Rammohan Naidu named successor of Yerran Naidu". The Hindu (in Indian English). 2012-11-24. ISSN 0971-751X. Retrieved 2016-03-04.
  4. 4.0 4.1 "Members : Lok Sabha". 164.100.47.192. Archived from the original on 2016-03-06. Retrieved 2016-03-04.
  5. చల్లా, విజయభాస్కర్. "హిందీకి భయపడి దిల్లీకి వద్దన్నాం!". eenadu.net. ఈనాడు. Archived from the original on 1 ఆగస్టు 2018. Retrieved 1 August 2018.
  6. Andhrajyothy (9 June 2024). "Modi 3.0 Cabinet: మోదీ కేబినెట్‌లో అత్యంత పిన్న వయస్కుడు.. ఏపీకి దక్కిన అరుదైన అవకాశం". Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.
  7.  :https://way2.co/MTM0MTYyNjQ=/83_lng1
  8. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Srikakulam". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  9. EENADU (10 June 2024). "తెలుగు రాష్ట్రాల కేంద్ర మంత్రుల ప్రస్థానమిది". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  10. Andhrajyothy (10 June 2024). "ఎర్రన్న వారసుడిగా!". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  11. Sakshi (10 June 2024). "కేంద్ర మంత్రిగా ఎర్రన్న తనయుడు". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  12. TV9 Telugu (9 June 2024). "వారెవ్వా.. పిన్న వయస్కుడైన కేబినెట్ మంత్రిగా రామ్మోహన్ నాయుడు రికార్డు". Retrieved 10 June 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]