కాశీ ఖండం
కాశీ ఖండం అనే కావ్యాన్ని కవిసార్వభౌముడైన శ్రీనాథుడు రచించారు. కాశీఖండము శ్రీనాథుడు రచించిన తెలుగు కావ్యము. ఇది క్రీస్తుశకం 1440 కాలంనాటి రచన.[1] స్కాంద పురాణంలో సులభగ్రాహ్యంగా ఉన్న ఈ కథా భాగాన్ని శ్రీనాథ మహాకవి కాశీఖండముగా రూపుదిద్దారు. ఇందులో వారణాశిగా ప్రసిద్ధిచెందిన కాశీ క్షేత్ర మహత్యం, దాని వైశిష్ట్యం, కాశీ యాత్రా విశేషాలు, శివునికి కాశీకి గల అనుబంధం, అనేక కథలు, ఉపకథలు, కాశీకి సంబంధించిన ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ గ్రంథాన్ని ముద్రించేందుకు ఉత్పల నరసింహాచార్యులు పరిష్కరించగా, వ్రాతప్రతులను సమకూర్చడంలో వేటూరి ప్రభాకరశాస్త్రి సహకరించారు.
కాశీఖండం అవతారికలో శ్రీనాథుడు చెప్పుకున్న "చిన్నారి పొన్నారి చిఱుత కూకటినాడు రచియించితి మరుత్త రాట్చరిత్ర..." పద్యం ప్రకారం శ్రీనాథుడు పుట్టుకవి అనిపిస్తాడు.
ఈ క్షోణిన్నినుఁ బోలు సత్కవులు లేరీ నేటి కాలంబునన్
ద్రాక్షారామ చళుక్య భీమవర గంధర్వాప్సరో భామినీ
వక్షోజద్వయ గంధసార ఘుసృణ ద్వైరాజ్య భారంబు న
ద్యక్షీంచున్ గవి సార్వభౌమ! భవదీయ ప్రౌఢసాహిత్యముల్
కాశీఖండము కృతి స్వీకరించిన వీరభద్రారెడ్డి శ్రీనాథుని గుఱించి ఇలా అన్నాడని శ్రీనాథుడు అవతారికలో వ్రాసుకున్నాడు. ఓ శ్రీనాథ కవి సార్వభౌమా, నీది ప్రౌఢసాహిత్యం. ఈ భూమి మీద ఈ కాలంలో నీతో సరివచ్చే సత్కవులు లేరు. ద్రాక్షారామం, భీమవరం లోని గంధర్వస్త్రీలు శ్రీనాథుని సౌందర్యానికి వశులైపోయారట. గంధసారము - చందనం. ఘుసృణము - కుంకుమపువ్వు. శ్రీనాథుడు శృంగారపురుషుడని ప్రతీతి కదా!
కొన్ని పద్యాలు
[మార్చు]ప్రాణ సందేహమైనట్టి పట్టు నందు
ననృతములు పల్కి యైనను నౌర్వ సేయ!
యన్యు రక్షింప దలచుటత్యంతమైన
పరమ ధర్మంబు కాశికా పట్టణమున!
చిన్నారి పొన్నారి చిఱుత కూకటి నాడు
రచియించితి మరుత్తరాట్చరిత్ర
నూనూగు మీసాల నూత్న యౌవనమున
శాలివాహన సప్తశతినొడివితి
సంతరించితి నిండు జవ్వనంబున యందు
హర్షనైషధ కావ్య మాంధ్ర భాష
బ్రౌఢ నిర్భర వయః పరిపాకమునఁ గొని
యాడితి భీమనాయకుని మహిమఁ
బ్రాయ మింతకు మిగులఁ గై వ్రాలకుండఁ
గాశికాఖండ మను మహా గ్రంథమేను
దెనుఁగుఁ జేసెదఁ గర్ణాట దేశ కటక
పద్మవనహేళి శ్రీనాథ భట్ట సుకవి
మూలాలు, బయటి లింకులు
[మార్చు]- https://archive.org/details/in.ernet.dli.2015.329251
- https://sites.google.com/site/houstonsahitilokam/telugu-velugulu/-prabhanda-kavyalu/kasi-khandam Archived 2023-04-26 at the Wayback Machine
- https://srivaddipartipadmakar.org/sri-kashi-khandam-2015/
- https://srivaddipartipadmakar.org/sri-kashi-khandam-2015/
- https://sarasabharati-vuyyuru.com/tag/%E0%B0%95%E0%B0%BE%E0%B0%B6%E0%B1%80-%E0%B0%96%E0%B0%82%E0%B0%A1%E0%B0%82/
- http://www.bhaktibooks.in/2018/06/KashiKhandam.html