కాశి ( 2018 సినిమా)
కాశి | |
---|---|
దర్శకత్వం | కృతిక ఉదయనిధి |
రచన | కృతిక ఉదయనిధి |
నిర్మాత | ఫాతిమా విజయ్ ఆంటోని, ఉదయ్ హర్ష వడ్డెల, గణేష్ పెనుబోతు, ప్రధ్యుమ్న చంద్రపతి |
తారాగణం | విజయ్ ఆంటోని, అంజలి, సునయన, యోగి బాబు |
ఛాయాగ్రహణం | రిచర్డ్ ఎం.నాథన్ |
కూర్పు | లారెన్స్ కిశోరె |
సంగీతం | విజయ్ ఆంటోని |
నిర్మాణ సంస్థ | విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ |
విడుదల తేదీ | మే 18, 2018 |
సినిమా నిడివి | 133 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కాశి 2018 లో విడుదలైన తెలుగు సినిమా. లెజెండ్ సినిమా, ఆంటోని ఫిలిం కార్పోరేషన్ బ్యానర్ ఫాతిమా విజయ్ ఆంటోని, ఉదయ్ హర్ష వడ్డెల, గణేష్ పెనుబోతు, ప్రధ్యుమ్న చంద్రపతి నిర్మించిన ఈ సినిమాకు కృతిక ఉదయనిధి దర్శకత్వం వహించింది. విజయ్ ఆంటోని, అంజలి, సునైనా, యోగి బాబు, జయప్రకాష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తమిళంలో కాళీ పేరుతో, తెలుగులో కాశి పేరుతో మే 18, 2018న విడుదలైంది.[1]
కథ
[మార్చు]న్యూయార్క్‌లో డాక్టర్ భరత్ (విజయ్ ఆంటోనీ) మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎం.డి గా గొప్ప జీవితాన్ని అనుభవించే డాక్టర్ భరత్ ఓ చిన్న బాబును ఎద్దు పొడిచినట్టుగా చిన్నతనం నుంచి ఓ కల వస్తుంటుంది. అయితే ఆ కల నిజామా..లేదా..అనే భ్రమలో ఉన్న భరత్ కి అమెరికాలో తనతో పాటు ఉన్న తల్లిదండ్రులు తన సొంత తల్లిదండ్రులు కారనే నిజం తెలుస్తుంది. తనను కన్న తల్లిదండ్రులను వెతుక్కుంటూ ఇండియాకు వస్తాడు. అలా కంచర్లపాలెం చేరుకున్న భరత్ కి ఆ ఊళ్ళో కొన్ని అనుకోని కథలు ఎదురవుతాయి. ఇంతకీ భరత్ తల్లిదండ్రులు ఎవరు ? అసలు భరత్ వారికి ఎలా దూరమయ్యాడు ? చివరికి భరత్ వాళ్ళ గురించి ఎలా తెలుసుకున్నాడు అనేది మిగతా సినిమా కథ.[2][3]
నటీనటులు
[మార్చు]- విజయ్ ఆంటోని
- అంజలి
- సునయన
- నాజర్
- యోగి బాబు
- జయప్రకాష్
- ఆర్.కె. సురేష్
- అమృత అయ్యర్
- శిల్పా మంజునాథ్
- రాకేష్ పృధ్వీ
- గాల్విన్
- వేలా రామమూర్తి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: లెజెండ్ సినిమా, ఆంటోని ఫిలిం కార్పోరేషన్ [4]
- నిర్మాతలు: ఫాతిమా విజయ్ ఆంటోని, ఉదయ్ హర్ష వడ్డెల, గణేష్ పెనుబోతు, ప్రధ్యుమ్న చంద్రపతి [5]
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కృతిగ ఉదయనిధి
- సంగీతం: విజయ్ ఆంటోనీ
- సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం.నాథన్
- ఎడిటర్: లారెన్స్ కిషోర్
- మాటలు: భాష్య శ్రీ
మూలాలు
[మార్చు]- ↑ The Times of India. "Vijay Antony's 'Kasi' to release on May 18 - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 1 సెప్టెంబరు 2021. Retrieved 1 September 2021.
- ↑ Sakshi (18 May 2018). "'కాశి' మూవీ రివ్యూ". Archived from the original on 1 సెప్టెంబరు 2021. Retrieved 1 September 2021.
- ↑ The Hans India (18 May 2018). "Vijay Antony's Kaasi Movie Review {1.75/5}" (in ఇంగ్లీష్). Archived from the original on 1 September 2021. Retrieved 1 September 2021.
- ↑ India Glitz (10 May 2018). "Legend Cinema to present Vijay Antony Kaasi". Archived from the original on 1 సెప్టెంబరు 2021. Retrieved 1 September 2021.
- ↑ Sakshi (12 May 2018). "కాశీ ఏం చేశాడు?". Archived from the original on 1 సెప్టెంబరు 2021. Retrieved 1 September 2021.