కార్ల్ థియోడర్ డ్రేయర్
కార్ల్ థియోడర్ డ్రేయర్ | |
---|---|
జననం | కోపెన్హాగన్, డెన్మార్క్ | 1889 ఫిబ్రవరి 3
మరణం | 1968 మార్చి 20 కోపెన్హాగన్, డెన్మార్క్ | (వయసు 79)
వృత్తి | సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 1919–1968 |
జీవిత భాగస్వామి | ఎబ్బా లార్సెన్ (m. 1911) |
పిల్లలు | 2 |
పురస్కారాలు | 1955 వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ది వర్డ్ సినిమాకు గోల్డెన్ లయన్ |
కార్ల్ థియోడర్ డ్రేయర్ (1889, ఫిబ్రవరి 3 - 1968 మార్చి 20)[1] డానిష్ సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. గొప్ప దర్శకులలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న ఇతని సినిమాలు భావోద్వేగంతో, విధి-మరణాల ఇతివృత్తాలతో కూడి ఉంటాయి.[2][3][4][5][6]
జననం
[మార్చు]కార్ల్ డ్రైయర్ 1889, ఫిబ్రవరి 3న డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో జన్మించాడు.
సినిమారంగం
[మార్చు]కార్ల్ 1928తో తీసిన ది ప్యాషన్ ఆఫ్ జోన్ ఆఫ్ ఆర్క్ అనే సినిమా గొప్ప సినిమాలలో ఒకటిగా పరిగణించబడుతోంది. ఇందులో సినిమాటోగ్రఫీ, క్లోజప్ ఫాట్ లు ఎక్కువగా ఉపయోగించారు. 2012లో నిర్వహించిన ఒక సర్వేలో సినీ విమర్శకులచే తొమ్మిదవ-ఉత్తమ చిత్రంగా, సినిమా దర్శకులచే 37వ స్థానంలో నిలిచింది.
మైఖేల్ (1924), వాంపిర్ (1932), డే ఆఫ్ వ్రాత్ (1943), ఆర్డెట్ ( ది వర్డ్ ) (1955), గెర్ట్రుడ్ (1964) మొదలైన సినిమాలు తీశాడు. 1955లో ది వర్డ్ సినిమాకు వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో గోల్డెన్ లయన్ అవార్డు అందుకున్నాడు.
సినిమాలు
[మార్చు]సంవత్సరం | పేరు | దేశం |
---|---|---|
1919 | ది ప్రెసిడెంట్ | డెన్మార్క్ |
1920 | పార్సన్స్ విడో | స్వీడన్ |
1921 | లీవ్స్ ఫ్రంసాతాన్స్ బుక్ | డెన్మార్క్ |
1922 | లవ్ వన్ అనదర్ | జర్మనీ |
1922 | ఒన్స్ అపాన్ ఏ టైమ్ | డెన్మార్క్ |
1924 | మైఖేల్ | జర్మనీ |
1925 | మాస్టర్ ఆఫ్ హౌజ్ | డెన్మార్క్ |
1926 | ది బ్రైడ్ ఆఫ్ గ్లోమ్డాల్ | నార్వే |
1928 | ది ప్యాషన్ ఆఫ్ జోన్ ఆఫ్ ఆర్క్ | ఫ్రాన్స్ |
1932 | వాంపైర్ | ఫ్రాన్స్/జర్మనీ |
1943 | డే ఆఫ్ వ్రత్ | డెన్మార్క్ |
1945 | టు పీపుల్ | స్వీడన్ |
1955 | ది వర్డ్ | డెన్మార్క్ |
1964 | గెర్ట్రుడ్ | డెన్మార్క్ |
షార్ట్ ఫిల్మ్స్
[మార్చు]- గుడ్ మదర్స్ (మాడ్రెహ్జాల్పెన్, 12 నిమి, 1942)
- వాటర్ ఫ్రం ది లాండ్ (వాండెట్ పా లాండెట్, 1946)
- ది స్ట్రగుల్ ఎగైనెస్ట్ క్యాన్సర్ (కంపెన్ మోడ్ క్రాఫ్టన్, 15 నిమి, 1947)
- డానిష్ విలేజ్ చర్చి (లాండ్స్బైకిర్కెన్, 14 నిమి, 1947)
- దే క్యాచ్ ది ఫెర్రీ (డి నెడ్ ఫెర్గెన్, 11 నిమి, 1948)
- థోర్వాల్డ్‌సెన్ (10 నిమి, 1949)
- ది స్టోర్స్ట్రోమ్ బ్రిడ్జ్ (స్టోర్స్ట్రోమ్స్బ్రోయెన్, 7 నిమి, 1950)
- కోటలోని కోట (ఎట్ స్లాట్ ఐ ఎట్ స్లాట్, 1955)
మరణం
[మార్చు]కార్ల్ డ్రైయర్ తన 79 సంవత్సరాల వయస్సులో 1968, మార్చి 20న న్యుమోనియాతో కోపెన్‌హాగన్‌లో మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ The Carl Th. Dreyer website Retrieved 12 March 2013
- ↑ "The 1,000 Greatest Films (Top 250 Directors)". They Shoot Pictures, Don't They. Archived from the original on 2 December 2016. Retrieved 2023-05-29.
- ↑ [1]Bright Lights Film Journal review of Day of Wrath, Order and Gertrud
- ↑ "kamera.co.uk - feature item - Carl Dreyer - Antonio Pasolini". www.kamera.co.uk. Retrieved 2023-05-29.
- ↑ "Carl Theodor Dreyer | Biography, Movie Highlights and Photos | AllMovie". AllMovie. Retrieved 2023-05-29.
- ↑ The Passion of Joan of Arc review Archived 2013-02-06 at the Wayback Machine by Roger Ebert