కారంపూడి,పల్నాడు జిల్లా, కారంపూడి మండలం లోని గ్రామం.ఇది అదే పేరుతో ఉన్నమండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన పిడుగురాళ్ళ నుండి 17 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3492 ఇళ్లతో, 14385 జనాభాతో 1726 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 7651, ఆడవారి సంఖ్య 6734. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1844 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1657. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589870[3].పిన్ కోడ్: 522614, ఎస్.టి.డి.కోడ్ = 08649.
కొమెర అంకారావు, కారెంపూడికొమెర అంకారావు: ఇతను కారెంపూడి గ్రామంలో 1983లో రాములు, ఏడుకొండలు దంపతులకు జన్మించాడు. ఇతను ప్రకృతిని ఆస్వాదిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, అడవులు సంరక్షణ, పెంపకం, వృద్ధి కోసం నడుముకట్టి, గత రెండు దశాబ్దాలుగా పైగా అలుపెరుగనిపోరాటం చేస్తూ, నల్లమల అడవులలో ప్లాస్టిక్ నిర్మూలన చేస్తూ, సమాజాన్ని చైతన్య పరుస్తూ సరికొత్త హరిత అడవులు సృష్టిస్తున్న, భారతీయ పర్యావరణ యోధుడు, పర్యావరణ వేత్త, నల్లమల అడవితల్లి బిడ్డగా గుర్తింపు పొందాడు.[4]