Jump to content

కామాఖ్య దేవాలయం

అక్షాంశ రేఖాంశాలు: 26°09′59″N 91°42′21″E / 26.1662763°N 91.7057776°E / 26.1662763; 91.7057776
వికీపీడియా నుండి
(కామాఖ్య దేవాలయము నుండి దారిమార్పు చెందింది)

26°09′59″N 91°42′21″E / 26.1662763°N 91.7057776°E / 26.1662763; 91.7057776

కామాఖ్య దేవాలయం
కామాఖ్య దేవాలయం, గౌహతి
కామాఖ్య దేవాలయం is located in Assam
కామాఖ్య దేవాలయం
కామాఖ్య దేవాలయం
Location within Assam
పేరు
స్థానిక పేరు:కామాఖ్య దేవాలయం
స్థానం
ప్రదేశం:నీలాచల్ కొండ, గౌహతి సమీపంలో, అసోం
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:కామాఖ్యదేవి
చరిత్ర
కట్టిన తేదీ:
(ప్రస్తుత నిర్మాణం)
1565
నిర్మాత:చిలారాయ్

కామాఖ్య దేవాలయం (కాంరూప్-కామాఖ్య) [1] కామాఖ్యాదేవి కొలువైన ఆలయం.[2] ఇది 51 శక్తి పీఠాలలో ప్రాచీనమైంది[3] ఇది భారతదేశంలోని అస్సాం లోని గౌహతి నగర పశ్చిమ భాగంలోని నీలాచల్ కొండల యందు గల ఒక శక్తి ఆలయం. ఇది అనేక ప్రత్యేక దేవాలయాలు కలిగిన ప్రధాన ఆలయం. ఈ ఆలయంలో ఉన్న పది దేవాలయాలు పది మహావిద్యలకు అంకితం చేయబడ్డాయి; కాళీ, తార, శోదషి, భువనేశ్వరి, బైరవి, చిన్నమస్తా, ధుమవతి, బగలముఖి, మాతంగి, కమల [4] వీటిలో త్రిపుర సుందరి, మాతంగి, కమల దేవాలయాలు ప్రక్కప్రక్కన ప్రధాన దేవాలయంలో ఉన్నాయి. మిగిలిన ఏడు దేవాలయాలు ప్రత్యేకంగా ఉన్నాయి.[5] సాధారణ హిందువులకు, తాంత్రిక భక్తులకు ఇది ఒక ముఖ్యమైన యాత్రాస్థలము.2015 జూలైలో భారత సుప్రీం కోర్టు ఈ దేవస్థాన యజమాన్యాన్ని కామాఖ్య దేబుట్టెర్ బోర్డు నుండి బోర్దేవ్రి సమాజ్ కు బదిలీ చేసింది.[6]

వర్ణన

[మార్చు]
కామాఖ్య దేవాలయం ప్రణాళిక. నాలుగు గదులలో పైన గలవి; గర్భగృహ, కలంట, పంచరత్న, నిత్య మండపం.

ప్రస్తుతం ఉన్న ఈ ఆలయ నిర్మాణం 8 నుండి 17 వ శతాబ్దం మధ్యకాలంలో అనేక సార్లు నిర్మించుట, ఆధునీకరించుట జరిగింది. ఈ దేవాలయ నిర్మాణ శైలిని సాధారణంగా నీలాచల్ రకం అని పిలుస్తారు. ఈ నిర్మాణంలో ఒక శిలువ ఆకార ఆధారంపై అర్థ గోళాకార గోపురం ఉంటుంది.[7] ఈ దేవాలయంలో నాలుగు గదులు ఉంటాయి. అవి గర్భగృహం, మూడు మండపాలు. ఈ మండపాలను స్థానికంగా తూర్పు నుండి పశ్చిమానికి వరుసగా కలంట, పంచరత్న, నతమందిర అని పిలుస్తారు.

ప్రస్తుత దేవాలయ రూపం 1565లో కోచ్ రాజవంశానికి చెందిన చిలరాయ్ చే మధ్యయుగ దేవాలయాల తరహాలో నిర్మించబడింది.[8] అంతకుముందు గల నిర్మాణము కాలా పహార్ అనే అజ్ఞాత వ్యక్తిచే నాశనము చేయబడింది. ప్రస్తుత నిర్మాణము తేనెపట్టులాంటి శిఖరముతో అద్భుతమైన శిల్ప శ్రేణులు, వెలుపలివైపు వినాయకుడు, హిందూ దేవుళ్ళు, దేవతల చిత్రాలను కలిగి ఉంది.[9] ఈ దేవాలయము మూడు పెద్ద మండపాలను కలిగి ఉంది. పశ్చిమ మండపం చాలా పెద్దది, దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది, సాధారణ యాత్రికులు తమ పూజ కొరకు దీనిని ఉపయోగించరు. మధ్య మండపం చతురస్రాకారంలో ఉండి, తరువాతి కాలంలో ప్రతిష్ఠించబడిన అమ్మవారి చిన్న ప్రతిమను కలిగి ఉంది. ఈ మండప గోడలపై నరనారాయణుని చిత్రములు, దానికి సంబంధిత గాథలు, ఇతర దేవుళ్ళ చిత్రాలు చెక్కబడి ఉన్నాయి.[10] మధ్య మండపము గుహ రూపంలో ఉన్న దేవాలయము యొక్క పవిత్ర స్థలము నకు దారి తీస్తుంది. అక్కడ ఏవిధమైన రూపము ఉండదు. కానీ సహజంగా భూగర్భంలో ఏర్పడిన నీటి బుగ్గలోని నీరు యోని ఆకారం గల గండశిల పగులులోంచి ప్రవహిస్తూ ఉంటుంది. ప్రతి వేసవిలో అంబువాసి పండుగ సందర్భంగా కామాఖ్య దేవత యొక్క రసజ్వల ఉత్సవాలు నిర్వహింపబడతాయి. ఈ సమయంలో గర్భగుడి నుండి ప్రవహించే నీరు ఎర్రగా ఐరన్ ఆక్సైడ్ వలె రుతుస్రావము వలె కనబడుతుంది. ఇది పురాతన ఖాసి బలి ఇచ్చే స్థలం వలె ఉండేది, ఇక్కడ పూజలు ఇంకా బలులను కూడా కలిగి ఉన్నాయి. ఉపాసకులు ప్రతి ఉదయము అమ్మవారికి అర్పించటానికి మేకలను వెంటపెట్టుకొని వస్తారు.[11]

ప్రాచీన సంస్కృత సాహిత్యానికి చెందిన కాళికా పురాణం కామాఖ్య దేవిని కోరికలను తీర్చే దానిగా, శివుని చిన్న భార్యగా, ముక్తిని ప్రసాదించే దానిగా వర్ణించింది. శక్తియే కామాఖ్యగా పిలవబడుతోంది.

అస్సాం లోని ఆర్యుల అనార్యుల "నమ్మకాలు ఆచారాల దాడికి" చిహ్నముగా అస్సాం లోని కామాఖ్య ఆలయము నిలుస్తుంది.[12] ఈ దేవతకు సంబంధించిన వివిధ రకాల పేర్లలో స్థానిక ఆర్యుల, అనార్యుల దేవతల పేర్లు ఉన్నాయి (కాకతి 1989, పేజి38).[13] యోగిని తంత్రం చెప్పిన ప్రకారం యోగిని తండ్రి మతం కిరాత జాతి మూలాలను కలిగి ఉంది.[14] బణికాంత కాకతి ప్రకారము, అక్కడ నరనారాయణ చేత ఏర్పాటు చేయబడిన పూజారులయిన గారోలు ఒక మాట్రిలినియాల్ ప్రజలలో కామాఖ్య ఆలయ స్థలంలో పందులను బలి ఇచ్చే పూజా సంప్రదాయం కలదు (కాకతి 1989, p37).[15]

అక్కడ దేవతను వామాచారం (ఎడమ చేతి వాటం) దానితో పాటు దక్షిణాచారం (కుడి చేతి వాటం) అనే రెండు పూజా పద్ధతులలో పూజలను నిర్వహిస్తారు (కాకతి, 1989 p45). సాధారణంగా దేవతలను పుష్పాలతో అర్చిస్తారు, కానీ ఇక్కడ జంతుబలులు కూడా కలిగి ఉన్నాయి. సాధారణంగా ఆడ జంతువులను బలుల నుండి మినహాయిస్తారు, ఈ నియమం సామూహిక బలుల సందర్భంలో సడలించబడింది (కాకతి 1989, p65).[16]

పురాణాలు

[మార్చు]

కాళికా పురాణం ప్రకారం, ఈ ఆలయం శివుని కోసం సతీదేవి తన సొగసును అర్పించిన రహస్య ఏకాంత ప్రదేశాన్ని సూచిస్తుంది,, ఈ స్థలం, శివుడు సతీదేవి శవంతో నృత్యం చేస్తున్నప్పుడు, ఆమె యోని పడిపోయిన స్థలం కూడా.[17] 108 స్థలాలలో సతీదేవి శరీరానికి అనుబంధం ఉందని పేర్కొన్న దేవీ భాగవతం దీనిని ధ్రువపరచుట లేదు, ఐతే కామాఖ్య ఆలయం అనుబంధ జాబితాలో పేర్కొనబడింది.[18] తరువాతి కథనం యోగిని తంత్రం, కాళికా పురాణం లోని కామాఖ్య మూలాలను పట్టించుకోలేదు, కామాఖ్య దేవిని కాళికా అమ్మవారితో పోల్చింది,, యోని భాగాన్ని సృజనాత్మక చిహ్నంగా నొక్కి చెప్పింది.[19]

అహోం శకంలో కామాఖ్య

[మార్చు]

ఒక పురాణం ప్రకారం కోచ్ బీహార్ రాజ కుటుంబాన్ని దేవి తనకు తాను ఆలయంలో పూజలు చేయకుండా నిషేధించింది. ఈ శాప భయంచేత ఈ వంశస్థులు ఈ రోజుకి కూడా ఆ దారివెంట వెళుతూ ఉన్నప్పుడైనా కనీసం కామాఖ్య పర్వతాన్ని చూడడానికి కుడా ధైర్యం చేయరు.

కోచ్ రాజ కుటుంబం మద్దతు లేకపోవడంతో ఆలయం చాల కష్టాలు ఎదుర్కొంది. 1658 చివరి నాటికి అహోంలు జయధ్వజ సింహ రాజు నేతృత్వంలో అస్సాం క్రింది భాగాన్ని జయించారు,, ఆలయంపై వారికి అభిరుచి పెరిగింది. దశాబ్దాల పాటు అహోం రాజులు శైవితి లేదా శాక్తల ఉపాసకులుగా ఉంటూ, ఆలయ పునర్నిర్మాణము, నూతన నిర్మాణములు చేసి ఆలయానికి మద్దతును కొనసాగించారు.

రుద్ర సింహుడు (కాలము 1696 నుండి 1714) ఒక హిందూ మత ఉపాసకుడు. అతను ముసలివాడైన తరువాత ఆచారం ప్రకారం హిందూ మతాన్ని స్వీకరించి, సనాతన హిందువుగా మారి, గురువును ఆశ్రయించాడు. అతను రాజుకు మంత్రాలను నేర్పి రాజుకు ఆధ్యాత్మిక మార్గదర్శి అయ్యాడు. కానీ, తన పాలనలో ఉన్న ఒక బ్రాహ్మణుని యందు అణుకువ కలిగి ఉండటం అనే ఆలోచనను భరించలేకపోయాడు. అందుచేత అతను రాయబారులను బెంగాల్కు పంపి, నాడియా జిల్లాలోని శాంతిపూర్ దగ్గరగల మలిపోతలో నివసించుచున్న శక్త శాఖకు చెందిన ప్రముఖ మహంత్ అయిన కృష్ణారామ్ భట్టాచార్యను రమ్మని ఆజ్ఞాపించాడు. మహంత్ రావటానికి ఇష్టపడలేదు కానీ, కామాఖ్య ఆలయ రక్షక బాధ్యతలు ఇస్తామని హామీ ఇవ్వటంతో ఒప్పుకున్నాడు. రాజు తను శరణు కోరనప్పటికీ, తన కుమారులను తన సహచర వర్గంలోని బ్రాహ్మణులను అతనిని ఆధ్యాత్మిక గురువుగా అంగీకరించమని ఆజ్ఞాపించుట ద్వారా మహంత్ ను సంతృప్తిపరచాడు.

రుద్ర సింహుని మరణాంతరం అతని పెద్ద కొడుకు శిబ సింహుడు (కాలం 1714 నుండి 1744), రాజు అయిన తరువాత కామాఖ్య ఆలయ నిర్వహణను, దానికి గల ఎన్నో ఎకరాల భూమిని (దైవదత్త భూమి) మహంత్ కృష్ణారామ్ భట్టాచార్యకు అప్పగించాడు. మహంత్, అతని వారసులు నీలాచల కొండలపైన నివసించుచున్నందున, పర్వతీయ గోసైనులుగా పిలవబడ్డారు. చాలామంది కామాఖ్య పూజారులు, అస్సాంకు చెందిన ఆధునిక శక్తలు, పర్వతీయ గోసైనుల శిష్యులు లేదా వంశస్థులు లేదా నాతి, నా గోసైనులై ఉన్నారు.[20]

పండుగలు

[మార్చు]

తాంత్రిక పూజలకు కేంద్రమైన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరము నిర్వహించే అంబుబాచి మేళ పండుగ, వేలమంది తాంత్రిక ఉపాసకులను ఆకర్షించుచున్నది. మరొక వార్షికోత్సవం, మానస పూజ . అంబుబాచి అనే పదం అంబు, బాచి అనే రెండు పదాలతో కూడి ఉంది, ఇక్కడ అంబు అంటే నీరు,, బాచి అంటే ఎఫ్లోరోసెన్స్. అంబుబాచి మేళా దేశవ్యాప్తంగా ముఖ్యమైన పండుగలలో ఒకటి, కామాఖ్యా ఆలయ పవిత్ర పండుగలలో ఒకటి. ఆకురాలుకాలంలో వచ్చే నవరాత్రి సమయంలో దుర్గా పూజను కామాఖ్య ఆలయంలో వార్షికంగా నిర్వహిస్తుంటారు. ఈ ఐదురోజుల పండుగ వేలకొలది సందర్శకులను ఆకర్షిస్తోంది.[21]

గమనికలు

[మార్చు]
  1. Suresh Kant Sharma, Usha Sharma,Discovery of North-East India,2005
  2. "About Kamakhya Temple". Archived from the original on 19 జూన్ 2015. Retrieved 19 June 2015.
  3. (Urban 2008, p. 500)
  4. "About Kamakhya Temple". Archived from the original on 2014-05-24. Retrieved 2016-10-11.
  5. (Shin 2010, p. 4)
  6. Kashyap, Samudra Gupta, As SC directs the return of old order at Kamakhya, looking back, and ahead
  7. (Sarma 1988:124)
  8. సర్కార్ 1992 p16. విశ్వ సింహ కామాఖ్య ఆలయంలో పూజలను పునః ప్రారంభించాడు అని చెప్పబడుచున్నది. విశ్వసింహ కుమారుడు చిలరాయ్ కోచ్ బీహార్ రాజు నరనారాయణ కాలంలో ఆలయాన్ని 1565లో నిర్మించాడు.
  9. "Kamakhya temple". Archived from the original on 2006-03-18. Retrieved 2020-01-07.
  10. "Kamakhya". Archived from the original on 2006-08-28. Retrieved 2006-09-12.
  11. "Kamakhya temple". Archived from the original on 2006-11-09. Retrieved 2006-09-12.
  12. పబ్లిషర్స్ సూచన లో సతీష్ భట్టాచార్య, కాకతి 1989.
  13. కాకతి suspects that of కామాఖ్య యొక్క కామా ఆర్యన్ సంతతికి చెందని వాడని కాకతి అనుమానించాడు, , నైవేద్యరూపములకు సంబంధించి వివరణలు ఇచ్చాడు: కమోయి , కమోయిట్ , కామిన్ , కామత్ మొదలైనవి.
  14. కాకతి 1989, p9: యోగిని తంత్ర (2/9/13) సిద్దేసి యోగిని పితే ధర్మః కైరతజః మతః .
  15. "Kamakhya Temple Timings | Darshan Timing | Puja Timing | Pooja Timings". Kamakhya Temple. Archived from the original on 2020-04-26. Retrieved 2020-05-25.
  16. కాళికా పురాణం , యోగిని తంత్రము లలో పేర్కొనబడిన బలికి అర్హమైన జంతువులు ఆ ప్రాంతంలోని వివిధ గిరిజన సమూహాలకు చెందిన బలి ఇచ్చే జంతువులుగా కాకతి పేర్కొన్నాడు.
  17. కాకతి 1989, p34
  18. కాకతి, 1989, p42
  19. కాకతి , 1989 p35
  20. గైట్,ఎడ్వర్డ్ అస్సాం చరిత్ర , 1905, pp172-173
  21. "Kamakhya Temple". Archived from the original on 2006-11-09. Retrieved 2006-09-12.

సూచనలు

[మార్చు]
  • కాకతి, బణికాంత (1989) ది మదర్ గాడెస్ కామాఖ్య, పబ్లికేషన్ బోర్డు, గౌహతి
  • సర్కార్, జెఎన్. (1992) చాప్టర్ I: ది సోర్సెస్ ఇన్ ది కంప్రేహెన్సివ్ హిస్టరీ ఆఫ్ అస్సాం, (ed H K బర్పుజారి) పబ్లికేషన్ బోర్డు, అస్సాం.
  • గైట్, ఎడ్వర్డ్ (1905) ఎ హిస్టరీ ఆఫ్ అస్సాం

బాహ్య లింకులు

[మార్చు]