Jump to content

కామందక నీతిసారము

వికీపీడియా నుండి

కామందక నీతిసారము (కామండకి లేదా నీతిసారము) రాజకీయాలు, ప్రభుత్వకళపై ఒక పురాతన భారతీయ గ్రంథం. దీనిని చాణుక్యుని శిష్యుడైన కామందక అని కూడా పిలువబడే కామందకుడు రచించాడు. ఇది సుమారుగా క్రీస్తుపూర్వం 4వ-3వ శతాబ్దం నాటిది[1], అయినప్పటికీ ఆధునిక పాండిత్యము దీనిని గుప్త, హర్షుల కాలం మధ్య 3వ,7 వ శతాబ్దాల మధ్య కాలానికి చెందినదిగా పేర్కొంటుంది. వాస్తవానికి ఇది క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం యొక్క శుక్రనీతి ఆధారంగా పునరావృతమైనది.[2] ఇందులో 19 విభాగాలు ఉన్నాయి. ఈ రచన పాటలీపుత్ర చంద్రగుప్తుడికి అంకితం చేయబడింది. ఈ రచన హితోపదేశ నమూనాగా రూపొందించబడిందని పండితులు భావిస్తున్నారు.

రచనాకాలం

[మార్చు]

మౌర్య చక్రవర్తి చంద్రగుప్తుని పేరును సూచిస్తున్నందున, కమాండకియ నీతిసారను మౌర్యుల కాలానికి అనంతర గ్రంథంగా పరిగణిస్తారు. మరోవైపు, మహాభారతం (శాంతిపర్వం, 123,11) లో కామందకీయ ప్రస్తావన గొప్ప ఇతిహాసం పూర్తయ్యే ముందు కాలానికి చెందినదని తెలియజేస్తుంది. చరిత్రకారుడు కె. పి. జయస్వాల్ ఈ గ్రంథాన్ని గుప్తుల యుగానికి (క్రీ. శ. 3వ-6వ శతాబ్దం) ఆపాదించారు.[3]

7వ శతాబ్దపు కవి భవభూతి దౌత్యకళలో ప్రావీణ్యం ఉన్న కామందకుడిని సూచిస్తున్నందున, ఈ గ్రంథం క్రీ. శ. 7వ శతాబ్దానికి పూర్వపు రచనగా నిర్ణయించడం జరిగింది. క్రీ. శ. 6వ శతాబ్దం చివరి భాగంలో నివసించిన దండి యొక్క దశకుమారచరిత్రము మొదటి అధ్యాయం చివరిలో నీతిసారం ఉదహరించబడింది.[4] అందువల్ల, ఈ గ్రంథం క్రీ పూ 3వ శతాబ్దం, క్రీ పూ 7వ శతాబ్దం మధ్య ఎప్పుడైనా రచించబడి ఉండవచ్చు.

రచనా విశేషాలు

[మార్చు]

నీతిసారంలో 20 సర్గలు (అధ్యాయాలు), 36 ప్రకరణాలు ఉన్నాయి. ఇది కౌటిల్యుని అర్థశాస్త్రం మీద ఆధారపడింది, సామాజిక క్రమం యొక్క సిద్ధాంతాలు, రాష్ట్ర నిర్మాణం, పాలకుడి బాధ్యతలు, ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వ సూత్రాలు, విధానాలు, అంతర్ రాష్ట్ర సంబంధాలు, రాయబారులు, గూఢచారుల నీతి, వివిధ రాజకీయ ప్రయత్నాల అనువర్తనం, వివిధ రకాల యుద్ధ శ్రేణులు, నైతికత పట్ల వైఖరి మొదలైన వివిధ సామాజిక అంశాలతో వ్యవహరిస్తుంది.[5]

మూలాలు

[మార్చు]
  1. Dutt, Manmatha Nath (Ed.). (1896). Kamandakiya Nitisara or The Elements of Polity (PDF) (in ఇంగ్లీష్). Calcutta: Elysium Press. pp. i–.
  2. Kaushik Roy (2012). Hinduism and the Ethics of Warfare in South Asia: From Antiquity to the Present. Cambridge University Press. p. 137. ISBN 9781139576840.
  3. Mitra, Rajendralala (1861). The Nitisara.
  4. Sastri, T. Ganapati (1912). Nitisara Of Kamandaka.
  5. Mitra, Raja Rajendra Lala (Ed.). (2008). The Nitisara by Kamandaki (in ఇంగ్లీష్). The Asiatic Society.