కాపీ లెఫ్ట్
కాపీ లెఫ్ట్ లైసెన్స్, మేధో సంపత్తిని నకలు చేయడానికి, సవరణలతో పునరుత్పత్తి చేయడానికి సాధారణ అనుమతిని మంజూరు చేస్తుంది. తదుపరి అవే అనుమతులతో పంపిణీ చేయబడాలి. కాపీ లెఫ్ట్ ప్రధానంగా ఓపెన్ సోర్స్ కోడ్ వినియోగ అనుమతులు గురించి ఉపయోగించే పదం. ఇది ప్రోగ్రామ్, కోడ్ లేదా మరొక పనిని ఉచితంగా ఉపయోగించడానికి అలాగే ఏవైనా తదుపరి సంస్కరణలు లేదా సవరణలను చేయడానికి అనుసరించే ఒక పద్ధతి.[1] కాపీ లెఫ్ట్ అనే భావన అనేక ప్రోగ్రామింగ్ ప్రాజెక్ట్‌లకు ప్రధానమైనది. సాఫ్ట్‌వేర్, డిజిటల్ ఆర్ట్, రచనలు ఇంకా ఇతర సృజనాత్మక పనుల కోసం ఈ అనుమతి సాధారణంగా ఉపయోగించబడుతుంది.[2]
గ్రంథస్వామ్యం, కాపీ లెఫ్ట్
[మార్చు]కాపీలెఫ్ట్ అనుమతులు ఇతర రకాల గ్రంథస్వామ్య అనుమతుల నుండి భిన్నంగా ఉంటాయి. సమాజ ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రోత్సాహకాలను అందించడం కోసం ఆవిష్కరణలు, సృజనాత్మక పనులను రక్షించుటకు గ్రంథస్వామ్య వ్యవస్థ పనిచేస్తుంది. ఈ సంఘంలో గ్రంథస్వామ్యం వెచ్చించడం ద్వారా కాపీలెఫ్ట్ సామాజిక ప్రయోజనాలను రక్షిస్తుంది. గ్రంథస్వామ్య చట్టం సాఫ్ట్‌వేర్ రచయితలకు వారి రచనలను నకలు చేయడం, పంపిణీ చేయడం, సవరించడంపై నియంత్రణను, రక్షణను ఇస్తుంది. కాపీలెఫ్ట్ లక్ష్యం ఈ పని, రచనలను కార్యకలాపాలన్నింటినీ, వినియోగించుకునే స్వేచ్ఛను ఇవ్వడం. ఈ స్వేచ్ఛలు -
- 0) పనిని ఉపయోగించుకునేందుకు;
- 1) పనిని అధ్యయనం చేసేందుకు;
- 2) పనిని నకలు చేసి ఇతరులతో పంచుకునే స్వేచ్ఛ;
- 3) పనిని సవరించేందుకు, అందువల్ల ఉత్పన్నమైన పనులను పంపిణీ చేసే స్వేచ్ఛ [3].
కాపీలెఫ్ట్ అనుమతుల్లో ఎక్కువ భాగం ఉచిత సాఫ్ట్‌వేర్, ఓపెన్ సోర్స్ నిర్వచనాలు నుండే ఉత్పన్నమయినాయి.[4] గ్రంథస్వామ్యం, కాపీ లెఫ్ట్ దేనికదే ప్రత్యేకంగా చట్టపరమైన ఆలోచనలు కావు; గ్రంథస్వామ్య నిబంధనలలోనే కాపీ లెఫ్ట్ ఉంది [5]. గ్రంథస్వామ్య హక్కులు స్వయంచాలకంగా నమోదు లేకుండానే జోడించబడుతుంది. రచయతలు, ఆవిష్కరణకర్తలు, సంస్థలో ఉత్పత్తులు అభివృద్ధి చేసినవారు (డెవలపర్) సంస్థ అనుమతి లేకుండా ఇతరులు ఎవరూ అమలు లేదా నకలు చేయలేరు. సాధారణంగా, గ్రంథస్వామ్య చట్టాన్ని నియంత్రించే అంతర్జాతీయ చట్టాలలో, కాపీలెఫ్ట్ యంత్రాంగం కూడా ఉంటుంది. కాపీలెఫ్ట్ అనేది గ్రంథస్వామ్య హక్కుదారుడు మంజూరు చేసిన సాధారణ అనుమతి (లైసెన్స్) ఒప్పందం. ఇది ఎవరికైనా గ్రంథస్వామ్యం చేయబడిన మేధో సంపత్తిని నిర్దిష్ట నిబంధనల ప్రకారం ఉచితంగా ఉపయోగించడానికి అనుమతిస్తుంది. ఉదాహరణకు, సాఫ్ట్‌వేర్ సోర్స్ కోడ్ స్వేచ్ఛగా అందుబాటులో ఉండే షరతుపై సాఫ్ట్‌వేర్‌ను అమలు చేయడానికి, సవరించడానికి, నకలు చేయడానికి, భాగస్వామ్యం చేయడం, పంపిణీ చేయడానికి కాపీ లెఫ్ట్ వినియోగదారులను అనుమతిస్తుంది. అటువంటి సాఫ్ట్‌వేర్ తరువాత కాపీ లెఫ్ట్ అనుమతులతో జారీ చేయబడాలి, దీని కోసం వినియోగదారులు కాపీ లెఫ్ట్‌ని అంగీకరించాలి, ప్రసారం చేయాలి. తదుపరి ఏవైనా జరిగే మార్పులు లేదా మెరుగుదలలు కూడా కాపీలెఫ్ట్ కింద జారీ చేయబడాలని ఆదేశించాలి. కాపీలెఫ్ట్ అనుమతుల క్రింద తమ పని/రచన మీద గ్రంథాస్వామ్యాన్ని సమర్పించడం ద్వారా, వారు ఉద్దేశపూర్వకంగా కొన్ని హక్కులను వదులుకుంటారు.[2]
చరిత్ర
[మార్చు]1976 జూన్లో లి-చెన్ వాంగ్ 'టైనీ బేసిక్ ' (Tiny BASIC) పంపిణీ నోటీసులో కాపీలెఫ్ట్ అను పదాన్ని వాడాడు.[6][7] టైనీ బేసిక్ కాపీలెఫ్ట్ పంపిణీ నిబంధనలు అధికారిక రూపంలో పంపిణీ చేయబడలేదు, కానీ సోర్స్ కోడ్ భాగస్వామ్యం చేయబడి, సవరించబడిన సందర్భంలో ఇది ప్రదర్శించబడింది. వాస్తవానికి, 'వాంగ్' 'టైనీ బేసిక్ ఎక్స్‌టెండెడ్' కు సవరణలను అందించాడు.[8] ముఖ్యమయిన కాపీలెఫ్ట్ అనుమతులలో G.N.U - GPL (జనరల్ పబ్లిక్ లైసెన్స్ GPL) ను MIT కంప్యూటర్ నిపుణుడు 'రిచర్డ్ స్టాల్‌మన్' రచించారు. 1983లో, స్టాల్‌మన్ GNU అనే ఓపెన్-సోర్స్ ప్రోగ్రామింగ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాడు.[2] స్టాల్‌మన్ కొన్ని సంవత్సరాల క్రితం 'లిస్ప్ ( Lisp (programming language) ఇంటర్‌ప్రెటర్'లో పనిచేశాడు. 'సింబాలిక్స్' లిస్ప్ ఇంటర్‌ప్రెటర్‌ను ఉపయోగించమని కోరింది స్టాల్‌మాన్ తన పనికి సంబంధించిన ప్రజోపయోగ పరిధి (పబ్లిక్ డొమైన్)లోని ప్రతిని (వెర్షన్) వారికి అందించాడు. సింబాలిక్స్ 'లిస్ప్ ఇంటర్‌ప్రెటర్'ను విస్తరించి మెరుగుపరిచింది, అయితే సింబాలిక్స్ ఈ మెరుగుదలలను స్టాల్‌మన్ కి ఇవ్వడానికి నిరాకరించింది. స్టాల్‌మన్ తర్వాత 1984లో, ఈ యాజమాన్య (proprietary) సాఫ్ట్‌వేర్ విధానాన్ని నిర్మూలించే దిశగా పనిచేసాడు, అతను సాఫ్ట్‌వేర్ షేరింగ్‌ను సమర్థించాడు.[9] దీని విస్తృతమైన వినియోగాన్ని చూసే మొదటి సాఫ్ట్‌వేర్ కాపీలెఫ్ట్ లైసెన్స్ మొజిల్లా పబ్లిక్ లైసెన్స్[10], ఫ్రీ ఆర్ట్ లైసెన్స్,[11] క్రియేటివ్ కామన్స్ షేర్-అలైక్ లైసెన్స్ షరతు.[12] చివరి రెండు అనుమతులు విద్యా సంబంధిత లేదా కళలకు సంబంధించిన పత్రాలు, చిత్రాలు, రచనల కోసం ఉద్దేశించబడ్డాయి. 1985లో రిచర్డ్ స్టాల్‌మాన్ GNU మానిఫెస్టోలో 'కాపీ లెఫ్ట్' భావన వివరించాడు. GNU ప్రజ్యోపయోగ పరిధి (Public Domain) లో లేదు. దీనిని ఎవరైనా సవరించి తిరిగి పంపిణీ చేయవచ్చు, కానీ ఏ పంపిణీ దారు కూడా దానిని తిరిగి పంపిణీ చేయడానికి నియంత్రణ చేయకూడదు. అంటే GNU సంస్కరణలు అన్ని స్వేచ్ఛగా ఉండాలి. GNU ప్రాజెక్ట్, "స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌ను పునఃపంపిణీ చేసేటప్పుడు, స్వేచ్ఛను హరించే పరిమితులను జోడించ కూడదు" అని పేర్కొంది. ఈ నిర్వచనాన్ని 'కాపీ లెఫ్ట్' సూత్రంగా పరిగణిస్తారు.[13] ఫ్రాన్స్‌లో, 2000లో "కాపీలెఫ్ట్ ఆటిట్యూడ్" పేరుతో జరిగిన సమావేశాల శ్రేణి ఫలితంగా 'ఫ్రీ ఆర్ట్ లైసెన్స్ (FAL)' ఆవిర్భవించింది.[14] బెర్న్ కన్వెన్షన్‌కు కట్టుబడి ఉన్న ఏ అధికార పరిధిలోనైనా అమలు అవుతుంది. ఇంకా స్టాల్‌మాన్ స్వంత 'ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్' సిఫార్సు చేసింది.[15] యునైటెడ్ స్టేట్స్‌లో క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ 2001 నుండి అనేక విభిన్న సంస్కరణల (వెర్షన్) రూపములలో అందుబాటులోకి వచ్చింది.
ఇతర లైసెన్సులు
[మార్చు]స్వేచ్ఛలను మంజూరు చేసే ఇతర సారూప్య అనుమతులు వలె కాకుండా, కాపీ లెఫ్ట్ అనుమతులు ఏవైనా సవరించిన సంస్కరణలు తప్పనిసరిగా ఈ స్వేచ్ఛలను మంజూరు చేయాలని నిర్ధారిస్తాయి. అందువల్ల, కాపీ లెఫ్ట్ అనుమతులు షరతులను కలిగి ఉంటాయి: సవరణలు తప్పనిసరిగా అనుకూల కాపీలెఫ్ట్ పథకం క్రింద పంపిణీ చేయబడాలి, సవరించిన పనిలో సవరించే సాధనాలు ఉండాలి.[16]
అయితే అన్ని ఉచిత-సాఫ్ట్‌వేర్ అనుమతులు కాపీ లెఫ్ట్ అనుమతులు కావు, ఎందుకంటే వాటికి హక్కు దారు ఒకే అనుమతి క్రింద ఉత్పన్నమైన పనులను పంపిణీ చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుత గ్రంథస్వామ్య చట్టం, కాపీ లెఫ్ట్ అనుమతించతగిన (పర్మిసివ్) అనే రెండు రకాల అనుమతులను కలుగ చేస్తుంది.
ఉచిత | ఉచితము కానివి | |||||
---|---|---|---|---|---|---|
ప్రజోపయోగపరిధి సమానమైనవి | అనుమతింపబడినవి (Permissive) |
కాపీ లెఫ్ట్ అనుమతి
(protective license) |
వాణిజ్యేతర అనుమతి |
యాజమాన్య
అనుమతులు |
వాణిజ్య రహస్యం | |
వివరణ | అన్ని హక్కులను
మంజూరు చేస్తుంది |
అనుమతుల ప్రదానం,
రీలైసెన్స్ హక్కు (యాజమాన్యీకరణ, |
వాణిజ్యేతర ఉపయోగం కోసం మాత్రమే హక్కులను మంజూరు చేస్తుంది. షేర్-అలైక్‌తో కలిపి ఉండవచ్చు. |
కాపీరైట్ యొక్క సాంప్రదాయ
ఉపయోగం; కొన్ని హక్కులు మంజూరు చేయబడవచ్చు లేదా మంజూరు చేయబడకపోవచ్చు |
ఎలాంటి సమాచారం
పబ్లిక్ చేయలేదు |
పబ్లిక్ కి సమాచారం
లేదు |
సాఫ్ట్‌వేర్ కోసం | ప్ర.ప,
అనుమతి లేదు.CC0 |
BSD, MIT, అపాచీ | GPL, AGPL | JRL, AFPL | యాజమాన్య సాఫ్ట్‌వేర్,
పబ్లిక్ లైసెన్స్ లేదు |
ప్రైవేట్, అంతర్గత సాఫ్ట్‌వేర్ |
ఇతర సృజనాత్మక
పనుల కోసం |
ప్ర.ప, | CC BY | CC BY-SA,
Free Art License (FAL) |
CC BY-NC | కాపీరైట్, పబ్లిక్ లైసెన్స్ లేదు, | ప్రచురించబడలేదు |
రచయితలు తమ రచనలకు ఏ రకమైన అనుమతి ఇవ్వాలో ఎంచుకోవచ్చు. సాఫ్ట్‌వేర్, కోడే కాకుండా ఇతర పత్రాలు, కళలు పనుల కోసం, క్రియేటివ్ కామన్స్ షేర్-అలైక్ లైసెన్సింగ్ సిస్టమ్
ఇంకా GNU ఉచిత భావవ్యక్తీకరణ లైసెన్సు (GNU ఉచిత డాక్యుమెంటేషన్ లైసెన్స్- GFDL) రచయితలు తమ పనిలోని కొన్ని విభాగాలకు పరిమితులను వర్తింపజేయడానికి అనుమతిస్తాయి,
బలహీనమైన కాపీలెఫ్ట్ లైసెన్స్‌లు:
అన్ని ఉత్పన్న రచనలు కాపీలెఫ్ట్ లైసెన్స్‌ను వారసత్వంగా పొందని విషయంలో "బలహీనమైన కాపీలెఫ్ట్" అనే పదం సూచిస్తుంది. "బలహీనమైన" కాపీ లెఫ్ట్‌ని ఉపయోగించే ఫ్రీ-సాఫ్ట్‌వేర్ లైసెన్స్‌లలో GNU లెస్సర్ జనరల్ పబ్లిక్ లైసెన్స్, మొజిల్లా పబ్లిక్ లైసెన్స్ ఉన్నాయి.
బలమైన కాపీలెఫ్ట్ లైసెన్స్‌లు
AGPL, ఇది సేవా వినియోగ సందర్భాలలో సాఫ్ట్‌వేర్ కోసం సోర్స్ కోడ్‌ను ప్రచురిస్తుంది.[17][18][19][20]
సైబేస్ ఓపెన్ వాట్ కామ్ (Sybase Open Watcom) పబ్లిక్ లైసెన్స్ అత్యంత బలమైన కాపీలెఫ్ట్ లైసెన్స్‌లలో ఒకటి. ఈ లైసెన్స్ OSI ద్వారా ఓపెన్ సోర్స్‌గా అంగీకరించబడుతుంది.
డిజైన్ సైన్స్ లైసెన్స్ (DSL) అనేది సాఫ్ట్‌వేర్ లేదా డాక్యుమెంటేషన్ మాత్రమే కాకుండా సాహిత్యం, కళాఖండాలు, సంగీతం, ఛాయాగ్రహణం దృశ్య మాధ్యమాలకి కూడా వర్తించే బలమైన కాపీ లెఫ్ట్ అనుమతి.
మైఖేల్ స్టట్జ్, నాన్-సాఫ్ట్‌వేర్ పనులకు GNU-శైలి కాపీలెఫ్ట్‌ని వర్తింపజేసిన తర్వాత DSLని రాశారు, ఇది తరువాత 'లిబ్రే వర్క్స్' (ఉచిత సమాచారం) అని పిలువబడింది. 1990లలో, ఇది సంగీత ముద్రణ (మ్యూజిక్ రికార్డింగ్)లు, దృశ్య ప్రధాన కళలు (విజువల్ ఆర్ట్) కాల్పనిక సాహిత్యంపై కూడా ఉపయోగించబడింది. ఇది ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్ GNU GPLకి అనుకూలమైనదిగా పరిగణించలేదు.[21]
పూర్తి, పాక్షిక కాపీలెఫ్ట్
పనికి సంబంధించి అన్ని భాగాలు (లైసెన్స్ తప్ప) సవరించబడి, కాపీ లెఫ్ట్ నిబంధనల ప్రకారం పంపిణీ చేసినప్పుడు 'పూర్తి కాపీ లెఫ్ట్' ఉంటుంది. పాక్షిక కాపీ లెఫ్ట్, దీనికి విరుద్ధంగా, కాపీ లెఫ్ట్ నిబంధనల నుండి పనిలోని కొన్ని భాగాలను మినహాయిస్తుంది, కాపీ లెఫ్ట్ అనుమతి కాకుండా ఇతర నిబంధనల ప్రకారం కొన్ని సవరణలను పంపిణీ చేయడానికి అనుమతినిస్తుంది కానీ అన్ని భాగాలను అనుమతించదు. పాక్షిక కాపీ లెఫ్ట్‌కి ఉదాహరణ కొన్ని సాఫ్ట్‌వేర్ ప్యాకేజీల కోసం చేసిన GPL మినహాయింపు.
షేర్-అలైక్
అనుమతులలోని " షేర్-అలైక్ " అను షరతు వలన పనికి సంబంధించి మంజూరు చేయబడిన ఏదైనా స్వేచ్ఛ తప్పనిసరిగా ఏదైనా ఉత్పన్నమైన పనిలో కచ్చితంగా అదే విధముగా లేదా అనుకూలమైన నిబంధనలపై మంజూరు చేయబడాలి.
ఏదైనా కాపీ లెఫ్ట్ లైసెన్స్ స్వయంచాలకంగా షేర్-అలైక్ లైసెన్స్ అని సూచిస్తుంది, షేర్-అలైక్ ఒప్పందాలకు రచయిత మొత్తం పనిని భాగస్వామ్యం చేయవలసి ఉంటుంది. సోర్స్ కోడ్ రచయితకు ప్రయోజనం ఏంటంటే, కోడ్‌లో ఏదైనా మార్పు చేస్తే అసలు రచయితకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా, రచయిత గుర్తించబడతారు. మార్చబడిన కోడ్‌ను అదే లైసెన్స్ నిబంధనలు లేదా అనుకూలమైనవి చేసేలా చూస్తారు.[22] కొన్ని క్రియేటివ్ కామన్స్ అనుమతులు షేర్-అలైక్ కాపీలెఫ్ట్ అనుమతులకు ఉదాహరణలు.
అనుమతి లైసెన్సులు
ఆ లైసెన్స్‌లు సాఫ్ట్‌వేర్ వినియోగదారులకు కాపీ లెఫ్ట్ లైసెన్స్‌ల వలె అదే స్వేచ్ఛను మంజూరు చేస్తాయి, సాఫ్ట్‌వేర్‌ను ఎలా ఉపయోగించాలి, సవరించవచ్చు, పునఃపంపిణీ చేయవచ్చు అనే దానిపై వారికి కనీస పరిమితులు ఉన్నాయి. అందువల్ల కాపీ లెఫ్ట్ లైసెన్స్‌లు కావు. ఈ రకమైన లైసెన్స్‌లకు ఉదాహరణలు X11 లైసెన్స్, అపాచీ లైసెన్స్, ఎక్స్‌పాట్ లైసెన్స్, వివిధ BSD లైసెన్స్‌లు.
సైద్ధాంతికంగా స్వేచ్ఛ వనరుల ప్రారంభకాలు (ఓపెన్ సోర్స్ ఇనిషియేటివ్), ఉచిత (ఫ్రీ) సాఫ్ట్‌వేర్ ఉద్యమాలకి కాపీ లెఫ్ట్ కొంత మధ్యగా సూచించబడింది.[23] ఏది ఏమైనప్పటికీ, కాపీ లెఫ్ట్ రెండు పార్టీలచే ఆమోదించబడింది, ప్రతిపాదించబడింది అని రుజువు ఉంది
కాపీలెఫ్ట్ చిహ్నం కాపీరైట్ చిహ్నం © : వృత్తములో అపసవ్యంగా ఉండే C యొక్క ప్రతిబింబ రూపము.[24] యూనికోడ్ భవిష్యత్తు రూపానికి చిహ్నాన్ని జోడించాలనే 2016 ప్రతిపాదన యూనికోడ్ టెక్నికల్ కమిటీచే ఆమోదించబడింది.[25][26]
సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ లేదా పనిని పునరుత్పత్తి చేయడానికి, సవరించడానికి అవసరమైన సమాచారాన్ని గ్రహీతలకు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలి. ఇవి తరచుగా 'బైనరీ ఎక్జిక్యూటబుల్స్' గా పంపిణీ చేయబడతాయి. ఇది అనుమతుల నిబంధనల పత్రాన్ని, కోడ్ రచించిన రచయితల సమాచారమును పేర్కొంటుంది. ఈ సమాచారం సాధారణంగా 'సోర్స్ కోడ్' దస్తం (ఫైల్)ల రూపంలో ఉంటుంది, గ్రంథస్వామ్యం లేనిచోట, ఒక పని లేదా పత్రాలు పూర్తిగా ప్రజా పరిధి (పబ్లిక్ డొమైన్) లోకి ఉంచడానికి బదులు, రచయితలు తమ పనిని ఉపయోగించడంపై పరిమితులను విధించడానికి అనుమతిస్తుంది. కాపీలెఫ్ట్ విధించిన ప్రధాన పరిమితుల్లో ఒకటి, ఉత్పన్నమైన రచనలు కూడా అనుకూల కాపీలెఫ్ట్ అనుమతుల క్రింద విడుదల చేయబడాలి.[4] కారణం ఏమంటే మునుపటి పని నుండి ఉచితంగా ప్రయోజనం ఉన్నప్పటికీ, కానీ ఆ పనిలో ఏవైనా మార్పులు జరిగితే ఇతరులకు కూడా కాపీ లెఫ్ట్ అనుమతుల వలన ప్రయోజనం చేకూరుతుంది. అందువలన కాపీ లెఫ్ట్ అనుమతులను పరస్పర (reciprocal) అనుమతులు అని అంటారు. ఈ ఆవశ్యకత కారణంగా, కాపీ లెఫ్ట్ అనుమతులను వాటి స్వీయ-శాశ్వత నిబంధనల (self-perpetuating term) కారణంగా "వైరల్"గా కూడా వర్ణిస్తారు.[27]
ప్రయోజనాలు
[మార్చు]కాపీలెఫ్ట్ అనేది గ్రంథస్వామ్య (కాపీరైట్) హక్కునుంచి ఏదేని పని, లేదా రచనలపై నిర్దిష్ట పరిధిలో స్వేచ్ఛను మంజూరు చేసే చట్టపరమైన సాంకేతిక ప్రక్రియ. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, పత్రాలు, కళలు, శాస్త్రీయ ఆవిష్కరణలు, పేటెంట్‌లు ఇంకా ఇతర రచనలు గ్రంథస్వామ్య రక్షణ నుంచి కాపీ లెఫ్ట్‌ని అమలు చేసేందుకు అనుమతిపత్రము (లైసెన్స్)లు ఉపయోగించుతాయి.[28] ఇంతేకాక కాపీలెఫ్ట్ సాఫ్ట్‌వేర్, స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ అనుమతి పత్రాలకు పరస్పరం రక్షణగా పరిగణించబడతాయి[29].
కంప్యూటర్ ప్రపంచంలో, కాపీ లెఫ్ట్-అనుమతులు కలిగిన కంప్యూటర్ ప్రోగ్రామ్‌లు తరచుగా ప్రోగ్రామర్ల అవసరాన్ని అనుసరించి సవరించబడి తిరిగి కాపీ లెఫ్ట్ అనుమతులతో ప్రచురించబడతాయి. నకలు చేయడంపై పరిమితులతో పాటు, కాపీలెఫ్ట్ అనుమతులు చాలా అడ్డంకులను పరిష్కరిస్తాయి.[4]
గ్రంథస్వామ్య చట్టం సృష్టికర్తలకు ఆర్థిక ప్రయోజనాలను అందించడం ద్వారా పురోగతిని ప్రోత్సహించడానికి రూపొందించబడింది. వారి పనిని కాపీ లెఫ్ట్ చేసినప్పుడు, కంటెంట్ సృష్టికర్తలకు వారి సహచరుల నుండి గుర్తింపు వంటి ప్రయోజనాలను పొందవచ్చు. అధిక నాణ్యత కలిగిన ఓపెన్-సోర్స్, కాపీలెఫ్ట్-అనుమతులు కలిగిన సాఫ్ట్‌వేర్‌కు సహకరించడం లేదా సృష్టించడం వల్ల విలువైన అవకాశాలకు దారితీయవచ్చు.[30] కాపీ లెఫ్ట్ సాఫ్ట్‌వేర్ వ్యక్తిగత సృష్టికర్తలకు మించి ఆర్థిక ప్రభావాలను కలిగి ఉంటుంది. నాణ్యమైన కాపీ లెఫ్ట్ సాఫ్ట్‌వేర్ ఉనికి యాజమాన్య సాఫ్ట్‌వేర్ తమ నాణ్యతను పరీక్షించి దానితో పోటీ పడేలా పెంచుకోవలసి వస్తుంది.[31] ఇది పనిని ఉపయోగించడం, పనిని అధ్యయనం చేయడం, పనిని కాపీ చేయడం, ఇతరులతో పంచుకోవడం, పనిని సవరించడం, ఆ పని యొక్క కచ్చితమైన లేదా సవరించిన సంస్కరణలను రుసుముతో లేదా లేకుండా పంపిణీ చేసే స్వేచ్ఛను కలిగి ఉంటుంది.[32][33]
కాపీ లెఫ్ట్ అనుమతుల కోసం ఉపయోగించే కొన్ని చట్టాలు, నిబంధనలు ఒక దేశం నుండి మరొక దేశానికి మారుతూ ఉంటాయి. ఉదాహరణకు, కొన్ని దేశాల్లో, స్టాండర్డ్ GNU జనరల్ పబ్లిక్ లైసెన్స్ అనుసరించి నాణ్యత పూచీ (వారంటీ) లేకుండా సాఫ్ట్‌వేర్ ఉత్పత్తిని విక్రయించడం ఆమోదయోగ్యంగా ఉంటుంది. అయితే చాలా ఐరోపా దేశాల్లో విక్రయించిన ఉత్పత్తికి సంబంధించిన అన్ని పూచీకత్తులను వదులుకోవడానికి సాఫ్ట్‌వేర్ పంపిణీదారుకు అనుమతి లేదు. ఈ కారణంగా, చాలా యూరోపియన్ కాపీలెఫ్ట్ అనుమతులలో అటువంటి వాటికి పరిధి ఏర్పరచారు, ఉదాహరణకు, యూరోపియన్ యూనియన్ పబ్లిక్ లైసెన్స్ (EUPL),[34] లేదా CeCILL అనుమతులు,[35] పరిమిత పూచీతో కలిపి GNU GPLని ఉపయోగించాలి. నెట్‌వర్క్ ద్వారా అమలు చేయబడే ప్రాజెక్ట్‌ల కోసం, అఫెరో జనరల్ పబ్లిక్ లైసెన్స్ (GNU AGPL) అని పిలువబడే GNU GPL సాఫ్ట్‌వేర్ వినియోగదారులకు సోర్స్ కోడ్ అందుబాటులో ఉండేలా చేస్తుంది.
ప్రస్తావనలు
[మార్చు]- ↑ "Copyleft". CASTsoftware.com. Retrieved 24 June 2023.
- ↑ 2.0 2.1 2.2 Friedman, Ken (2 June 2023). "copyleft: intellectual property license". Britannica. Retrieved 22 June 2023.
- ↑ "What is free software?". gnu.org. 2019-07-30. Retrieved 2020-07-22.
- ↑ 4.0 4.1 4.2 Carver, Brian W. (5 April 2005). "Share and Share Alike: Understanding and Enforcing Open Source and Free Software Licenses". Berkeley Technology Law Journal. SSRN 1586574. Retrieved 6 February 2012.
- ↑ Cotton, Ben (12 August 2016). "What is copyleft?". Opensource.com. Retrieved 22 June 2023.
- ↑ Wang, Li-Chen (May 1976). "Palo Alto Tiny BASIC". (NB. Source code begins with the following six lines. "TINY BASIC FOR INTEL 8080; VERSION 1.0; BY LI-CHEN WANG; 10 JUNE, 1976; @COPYLEFT; ALL WRONGS RESERVED". The June date in the May issue is correct. The magazine was behind schedule, the June and July issues were combined to catch up.)
- ↑ Rauskolb, Roger (December 1976). "Dr. Wang's Palo Alto Tiny BASIC". (NB. The source code begins with the following nine lines: "
TINY BASIC FOR INTEL 8080; VERSION 2.0; BY LI-CHEN WANG; MODIFIED AND TRANSLATED TO INTEL MNEMONICS; BY ROGER RAUSKOLB; 10 OCTOBER, 1976; @COPYLEFT; ALL WRONGS RESERVED
") - ↑ (February 1976). "Tiny BASIC Extended".
- ↑ Williams, Sam (March 2002). "7". Free as in Freedom – Richard Stallman's Crusade for Free Software. O'Reilly Media. ISBN 978-0-596-00287-9.
- ↑ Stallman, Richard (June 29, 2007). "GNU General Public License". GNU Project. Retrieved May 1, 2017.
- ↑ "Free Art License 1.3". Copyleft Attitude. Copyleft Attitude. Retrieved October 6, 2021.
- ↑ "Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0)". Creative Commons. Creative Commons. Retrieved August 14, 2015.
- ↑ "What is copyleft?". Opensource.com. 12 August 2016. Retrieved 26 June 2023.
- ↑ "Free Art License – Frequently Asked Questions". Copyleft Attitude. Copyleft Attitude. Retrieved October 6, 2021.
- ↑ "Licenses". GNU Project. GNU Project. Retrieved October 6, 2021.: "We don't take the position that artistic or entertainment works must be free, but if you want to make one free, we recommend the Free Art License."
- ↑ Kirk St.Amant; Brian Still (2008). "Examining Open Source Software Licenses through the Creative Commons Licensing Model". Handbook of Research on Open Source Software: Technological, Economic, and Social Perspectives. Information Science Reference. pp. 382 of 728. ISBN 978-1-59140-999-1.
- ↑ For some of the philosophy behind the term "SaaSS", see the "Server Software" section of "How to choose a license for your own work". GNU Project. December 20, 2015. Retrieved May 1, 2017.
- ↑ Stallman, Richard (November 18, 2016). "Who does that server really serve?". GNU Project. Retrieved May 1, 2017.
- ↑ "Why the Affero GPL". GNU Project. May 10, 2015. Retrieved May 1, 2017.
- ↑ List of free-software licences on the GNU website: "We recommend that developers consider using the GNU AGPL for any software which will commonly be run over a network".
- ↑ "Various Licenses and Comments about Them". GNU Project.
- ↑ . "Choosing an Open Source License". Athens University of Economics and Business.
- ↑ Biancuzzi, Federico (30 June 2005). "ESR: "We Don't Need the GPL Anymore"". ONLamp.com. Archived from the original on 2018-03-06. Retrieved 23 August 2008.
- ↑ "The Unicode Standard, Version 15.0: Enclosed Alphanumeric Supplement" (PDF). unicode.org.
- ↑ "Proposal to add the Copyleft Symbol to Unicode" (PDF).
- ↑ "Proposed New Characters: Pipeline Table". Unicode Character Proposals. Unicode Consortium. Retrieved April 18, 2017.
- ↑ Mundie, Craig (3 May 2001). "Prepared Text of Remarks by Craig Mundie, Microsoft Senior Vice President – The Commercial Software Model". New York University Stern School of Business. Archived from the original on 21 June 2005. Retrieved 1 October 2009.
- ↑ (December 29, 2011). "Copyright and Open Access at the Bedside".
- ↑ Open Source from a Proprietary Perspective at the Wayback Machine (archive index)
- ↑ Sarmah, Harshajit (2019-09-23). "5 Reasons Why Contributing To Open Source Projects Helps In Landing A Job". Analytics India Magazine (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-07-22.
- ↑ Mustonen, Mikko. "Copyleft - The Economics of Linux and Other Open Source Software" (PDF). Information Economics and Policy. Archived from the original (PDF) on 2 May 2014. Retrieved 1 May 2014.
- ↑ "What is Copyleft?". GNU Project.
- ↑ "Scheibner, James – "What price freedom (of software)? A guide for Australian legal practitioners on open source licensing" [2017] PrecedentAULA 23; (2017) 139 Precedent 39". classic.austlii.edu.au. Retrieved 2021-11-27.
- ↑ "The EUPL – European Union Public Licence". European Commission. Retrieved 9 January 2007.
- ↑ "Free Software Licensing Agreement CeCILL" (PDF). INRIA. Archived from the original (PDF) on 8 August 2010. Retrieved 24 August 2010.