కాడ్మియం ఆక్సైడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాడ్మియం ఆక్సైడ్
పేర్లు
IUPAC నామము
Cadmium oxide
ఇతర పేర్లు
Cadmium(II) oxide,
Cadmium monoxide
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [1306-19-0]
పబ్ కెమ్ 14782
యూరోపియన్ కమిషన్ సంఖ్య 215-146-2
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య EV1925000
SMILES [Cd]=O
ధర్మములు
CdO
మోలార్ ద్రవ్యరాశి 128.41 g·mol−1
స్వరూపం colorless powder (alpha form)
red-brown crystal (beta form) [1]
వాసన odorless
సాంద్రత 8.15 g/cm3(crystalline),
6.95 g/cm3 (amorphous)[2] solid.
ద్రవీభవన స్థానం 900–1,000 °C (1,650–1,830 °F; 1,170–1,270 K)
decomposition of amorphous form[3]
బాష్పీభవన స్థానం 1,559 °C (2,838 °F; 1,832 K) sublimation[3]
4.8 mg/L (18 °C)
ద్రావణీయత soluble in dilute acid
slowly soluble in ammonium salts
insoluble in alkalies
బాష్ప పీడనం 0.13 kPa (1000 °C)
2.62 kPa (1200 °C)
61.4 kPa (1500 °C)
Band gap 2.18 eV
Electron mobility 531 cm2/V·s
అయస్కాంత ససెప్టిబిలిటి -3×10−5 cm3/mol
Thermal conductivity 0.7 W/m·K
వక్రీభవన గుణకం (nD) 2.49
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
cubic, cF8
Fm3m, No. 225
a = 4.6958 Å
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
−258 kJ/mol[4]
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
55 J/mol·K[4]
విశిష్టోష్ణ సామర్థ్యం, C 43.64 J/mol·K
ప్రమాదాలు
భద్రత సమాచార పత్రము [1]
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు GHS06: ToxicGHS08: Health hazardGHS09: Environmental hazard
జి.హెచ్.ఎస్.సంకేత పదం Danger
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు H330, H341, H350, H361, H372, H410
GHS precautionary statements P201, P260, P273, P281, P284, P310
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
R-పదబంధాలు మూస:R45, R26, మూస:R48/23/25, మూస:R62, మూస:R63, మూస:R68, R50/53
S-పదబంధాలు S53, S45, S60, S61
జ్వలన స్థానం {{{value}}}
Lethal dose or concentration (LD, LC):
72 mg/kg (oral, rat)[6]
72 mg/kg (oral, mouse)
500 mg/m3 (rat, 10 min)
2500 mg/m3 (rabbit, 10 min)
3500 mg/m3 (guinea pig, 10 min)
4000 mg/m3 (dog, 10 min)
780 mg/m3 (rat, 10 min)
340 mg/m3 (mouse, 10 min)
3000 mg/m3 (rabbit, 15 min)
3000 mg/m3 (guinea pig, 15 min)
400 mg/m3 (dog, 10 min)[7]
US health exposure limits (NIOSH):
PEL (Permissible)
[1910.1027] TWA 0.005 mg/m3 (as Cd)
REL (Recommended)
Ca[5]
IDLH (Immediate danger)
Ca [9 mg/m3 (as Cd)]
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
Zinc oxide
Mercury oxide
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

కాడ్మియం ఆక్సైడ్ ఒక రసాయన సంయోగ పదార్థం.ఇది ఒక అకర్బన రసాయన సంయోగ పదార్థం.కాడ్మియం, ఆక్సిజన్ పరమాణువుల సమ్మేళనం వలన కాడ్మియం ఆక్సైడ్ రసాయన పదార్థం ఏర్పడినది.ఇతర కాడ్మియం సంయోగ పదార్థాల ఉత్పత్తికి కాడ్మియం ఆక్సైడ్ పూర్వగామిగా (precursor)గా పనిచేయును. కాడ్మియం ఆక్సైడ్ స్వాభావికంగా,అరుదైన మోంటేపోనైట్ (monteponite)ఖనిజ రూపంలో లభిస్తుంది.కాడ్మియం ఆక్సైడ్ n-రకానికి చెందిన అర్ద వాహకం (semiconductor)[8] గది ఉష్ణోగ్రత వద్ద అణువులోని పరమాణువుల బంధ దూరం 2.18 eV (2.31 eV)

భౌతిక లక్షణాలు

[మార్చు]

భౌతిక స్థితి

[మార్చు]

కాడ్మియం ఆక్సైడ్ వర్ణరహిత అస్ఫాటిక/ స్ఫటికముగా ఏర్పడని (amorphous) పొడి స్థితి లోను లేదా బ్రౌన్ లేదా ఎరుపు స్పటికస్థితిలో లభించును.కాడ్మియం ఆక్సైడ్ వాసన లేని ఘనపదార్థం.[9] కాడ్మియం ఆక్సైడ్ అణుభారం 128.41 గ్రాములు/మోల్−1.[10]

సాంద్రత

[మార్చు]

25 °C వద్ద కాడ్మియం ఆక్సైడ్ సాంద్రత 8.15 గ్రాములు/సెం.మీ3 (8150 kg/m3).[9] అస్పటిక పొడి స్థితిలోని కాడ్మియం ఆక్సైడ్ సాంద్రత 6.95 గ్రాములు/సెం.మీ3.

ద్రవీభవన ఉష్ణోగ్రత

[మార్చు]

కాడ్మియం ఆక్సైడ్ రసాయనం ద్రవీభవన స్థానం 900–1,000 °C (1,650–1,830 °F; 1,170–1,270K). అయితే అస్పటిక పొడి స్థితిలోని కాడ్మియం ఆక్సైడ్ ఈ ఉష్ణోగ్రత దగ్గర వియోగం చెందును

బాష్పీభవన ఉష్ణోగ్రత

[మార్చు]

కాడ్మియం ఆక్సైడ్ బాష్పీభవన స్థానం 1,559 °C (2,838 °F; 1,832 K)[9],ఈ ఉష్ణోగ్రత దగ్గర కాడ్మియం ఆక్సైడ్ నేరుగా ఉత్పతనం (sublimation=ఘన స్థితి నుండి నేరుగా వాయువుగా రూపాంతరం చెందటం)చెందును.

ద్రావణీయత

[మార్చు]

నీటిలో చాలా తక్కువ ప్రమాణంలో కరుగును.1000మి.లీ (లీటరు) నీటిలో18 °C వద్ద 4.8 మి.గ్రా కరుగును. సజలఆమ్లాలలోకరుగును. అమ్మోనియంలవణాలలో నెమ్మదిగా కరుగును.క్షారాలలో కరుగదు.

వక్రీభవన గుణకం/ వక్రీభవన సూచిక

[మార్చు]

కాడ్మియం ఆక్సైడ్వక్రీభవన సూచిక (nD):2.49

ఉత్పత్తి

[మార్చు]

తరచుగా కాడ్మియం సంయోగ పదార్థాలు జింకు ఖనిజాలలో ఉండటం వలన, జింకు లోహ ఉత్పత్తిలో,జింకును శుద్ధీకరణ కావించునపుడు కాడ్మియం ఆక్సైడ్ ఉపఉత్పత్తిగా లభ్యం. మూలక కాడ్మియాన్ని గాలిలో మండించడం వలన కుడా కాడ్మియం ఆక్సైడ్ ఉత్పత్తి అగును. కాడ్మియం నైట్రేట్, కాడ్మియం కార్బోనేట్ వంటి కాడ్మియం సమ్మేళనరసాయనాలను తాపవిచ్ఛేదన/ఉష్ణవిచ్ఛేదన (Pyrolysis) కావించుట వలన కూడా కాడ్మియం ఆక్సైడ్ ఉత్పత్తి అగును.వాణిజ్య పరంగా కాడ్మియం ఆవిరులను గాలిలో ఆక్సీకరించడం ద్వారా కాడ్మియం ఆక్సైడ్ ఉత్పత్తి చేయుదురు.

చర్యాశీలత

[మార్చు]

కాడ్మియం ఆక్సైడ్ క్షార ఆక్సైడ్ అందువలన ఇది సజల ఆమ్లాల రసాయన దాడికి గురై [Cd (H2O)6]2+.ద్రావణాన్ని ఏర్పరచును.బలమైన క్షార యుత ద్రావనాలతోచర్య వలన బలమైన క్షార ద్రావణం, [Cd (OH)4]2− ఏర్పడును.గది ఉష్ణోగ్రత దగ్గర తడి గాలి సమక్షంలో కాడ్మియం ఉపరితలం పై కాడ్మియం ఆక్సైడ్ పూత ఏర్పడును. కాడ్మియం ఆవిరులు,నీటి ఆవిరులు తిరోగామి రసాయనచర్య వలన కాడ్మియం ఆక్సైడ్, హైడ్రోజన్ను ఏర్పడును.

ఉపయోగాలు

[మార్చు]

కాడ్మియం ఆక్సైడ్ ను కాడ్మియం ప్లేటింగ్ బాత్‌లలో వాడెదరు.విద్యుత్తు నిల్వఉంచు స్టోరేజి బ్యాటరిలలో ఎలక్త్రోడులుగా ఉపయోగిస్తారు., కాడ్మియం లవణాల ఉత్పత్తిలో,సెరామిక్ గ్లేజేస్ తయారీలో ఉపయోగిస్తారు.అలాగే రంగుల తయారీలో వాడెదరు[8]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు/ఆధారాలు

[మార్చు]
  1. Patnaik, Pradyot (2003). Handbook of Inorganic Chemical Compounds. McGraw-Hill. ISBN 0-07-049439-8.
  2. "NIOSH Pocket Guide to Chemical Hazards". Retrieved 2007-02-16.
  3. 3.0 3.1 "INCHEM: Chemical Safety Information from Intergovernmental Organizations". Retrieved 2007-02-16.
  4. 4.0 4.1 Zumdahl, Steven S. (2009). Chemical Principles 6th Ed. Houghton Mifflin Company. p. A21. ISBN 0-618-94690-X.
  5. NIOSH Pocket Guide to Chemical Hazards. "#0087". National Institute for Occupational Safety and Health (NIOSH).
  6. http://chem.sis.nlm.nih.gov/chemidplus/rn/1306-19-0
  7. "Cadmium compounds (as Cd)". Immediately Dangerous to Life and Health Concentrations (IDLH). National Institute for Occupational Safety and Health (NIOSH).
  8. 8.0 8.1 "Cadmium Oxide (CdO) Semiconductors". azom.com. Retrieved 2016-03-25.
  9. 9.0 9.1 9.2 "Cadmium: cadmium oxide". webelements.com. Retrieved 2016-03-25.
  10. "CADMIUM OXIDE". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2016-03-25.