కాకతీయ పత్రిక
![]() | |
సంపాదకులు | పాములపర్తి సదాశివరావు |
---|---|
తరచుదనం | వారపత్రిక |
మొదటి సంచిక | 1948 |
ఆఖరి సంచిక | 1958 |
దేశం | భారతదేశం |
కేంద్రస్థానం | వరంగల్లు |
భాష | తెలుగు |
కాకతీయ పత్రిక వారపత్రికగా పాములపర్తి సదాశివరావు సంపాదకత్వంలో 1948లో ప్రారంభమై 1958 వరకూ నడిచింది.[1] ఈ పత్రికలో చలసాని ప్రసాదరావు, పి.ఎన్.స్వామి, జగదీశ్వరరావు, పెండెం శ్రీనివాసరావు మొదలైనవారు పనిచేశారు. పాములపర్తి సదాశివరావు భారత మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావుకు సోదరుడి వరుస, బాల్యమిత్రుడు. వీరి స్నేహం వికసించి కాకతీయ పత్రిక ప్రారంభించడానికి కారణమైంది. పాములపర్తి సదాశివరావు ఈ వారపత్రికకు సంపాదకుడు కాగా పి.వి.నరసింహారావు ఈ పత్రిక నిర్వహణలో పాలుపంచుకున్నాడు. ఇద్దరూ కలిసి ఈ పత్రికలో జయ-విజయ అనే కలం పేరుతో రచనలు చేసేవారు. అవి పాఠకులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఇద్దరూ అనేక కలంపేర్లతో ఈ పత్రికలో చాలా రచనలు చేశారు.
పి.వి.నరసింహారావు గొల్లరామవ్వ అనే కథను ఈ పత్రికలో ఆగష్టు 15 1949 సంచికలో “విజయ” అనే మారుపేరుతో వ్రాశాడు. ఆ రోజుల్లో ఇతడు “జయా “విజయ”, “రాజహంసొ", “భట్టాచార్య”, “రాజా” “విజయం” ఇత్యాది మారుపేర్లతో ఈ రకమైన కథలు, వ్యాసాలు ఎన్నో రాసి కాకతీయ వత్రికలో ప్రచురించాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ పాములపర్తి చంద్రకీర్తి, పాములపర్తి నిరంజన్ రావు (28 December 2024). "ఈనాడు, కాకతీయ పత్రికల బంధం". ప్రజాతంత్ర దినపత్రిక. Retrieved 20 February 2025.
- ↑ గంధం సుబ్బారావు (2020).
అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/పీవీ గారి సాహిత్యాభినివేశం. వికీసోర్స్.