కాంతి కిరణాలు
స్వరూపం
కాంతి ఏ ఋజు మార్గంలో ప్రయాణిస్తుందో ఆ ఋజుమార్గాన్ని చూపే సరళరేఖను కాంతి కిరణము అంటారు. కాబట్టి కాంతి కిరణాన్ని బాణపు గుర్తు కలిగిన సరళ రేఖతో సూచించవచ్చు.అనేక కిరణములు సముహాన్ని కాంతి కిరణ పుంజం అంటారు. ఈ కిరణపుంజం మూడు రకాలుగా ఉంటుంది.
- సమాంతర కిరణాల సముదాయం
- కేంద్రీకరణ కిరణాల సముదాయం
- వికేంద్రీకరణ కిరణాల సముదాయం
సమాంతర కిరణాల సముదాయం
[మార్చు]కాంతి జనకం నుండి వెలువడు కిరణాలు సమాంతరంగా పోతుంటే వాటిని సమాంతర కిరణ పుంజం అంటారు.
కేంద్రీకరణ కిరణాల సముదాయం
[మార్చు]కాంతి కిరణాలు ఒక బిందువు వద్దకు కేంద్రీకరింపబడితే వాటిని కేంద్రీకరణ కిరణాల సముదాయం అంటారు. కుంభాకర కటకం నుండి పోయిన సమాంతర కాంతి కిరణాలు ఒక బిందువువద్దకు కేంద్రీకృతమవుతాయి.
వికేంద్రీకరణ కిరణాల సముదాయం
[మార్చు]కాంతి కిరణాలు ఒక బిందువు నుండి అన్ని దిశల లోనికి ప్రయాణిస్తుంటే వాటిని వికేంద్రీకరణ కిరణాల సముదాయం అంటారు.