Jump to content

కాంచన్‌జంగ్ జాతీయ ఉద్యానవనం

అక్షాంశ రేఖాంశాలు: 27°42′N 88°08′E / 27.700°N 88.133°E / 27.700; 88.133
వికీపీడియా నుండి
కాంచన్‌జంగ్ జాతీయ ఉద్యానవనం
Mt. Kanchenjunga from Goecha La pass, Khangchendzonga National Park, Sikkim
Map showing the location of కాంచన్‌జంగ్ జాతీయ ఉద్యానవనం
Map showing the location of కాంచన్‌జంగ్ జాతీయ ఉద్యానవనం
Kanchenjunga NP
Locationఉత్తర సిక్కిం, సిక్కిం
Nearest cityచుంగ్ తంగ్
Coordinates27°42′N 88°08′E / 27.700°N 88.133°E / 27.700; 88.133
Area1,784 కి.మీ2 (689 చ. మై.)
Established1977
VisitorsNA (in NA)
Governing bodyకేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం
రకంMixed
క్రైటేరియాiii, vi, vii, x
గుర్తించిన తేదీ2016 (40th session)
రిఫరెన్సు సంఖ్య.1513
State PartyIndia

కాంచన్‌జంగ్ జాతీయ ఉద్యానవనం సిక్కిం రాష్ట్రంలోని చుంగ్ తంగ్ అనే ప్రాంతంలో ఉంది. భారతదేశంలో ఉన్న ఎత్తైన జాతీయ ఉద్యానవనాలలో ఇది ఒకటి. ఈ ఉద్యానవననం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో గుర్తింపునిచ్చింది.

చరిత్ర

[మార్చు]

ఈ ఉద్యానవనం 1977 లో స్థాపించబడింది. ఇది 849.5 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. ఈ ఉద్యానవనం లోపల లెప్చా గిరిజన జాతులకు చెందిన ప్రజలు నివసిస్తుంటారు. ఈ ఉద్యానవనంలో సిక్కింలో పవిత్రమైన మఠాలల్లో ఒకటైన తోలుంగ్ మొనాస్టరీని ఉంది.

జంతు, వృక్ష సంపద

[మార్చు]

ఈ ఉద్యానవనంలో కస్తూరి జింక, మంచు ప్రాంతంలో ఉండే చిరుతపులులు, అడవి కుక్కలు, సివెట్, నల్ల ఎలుగుబంట్లు, ఎర్ర పాండా, టిబెటన్ అడవి గాడిద, అలాగే సరీసృపాలు వంటి ఎన్నోరకాల జంతువులకు ఆవాసంగా ఉంది.

మరిన్ని విశేషాలు

[మార్చు]

ఈ ఉద్యానవనం సిక్కిం రాష్ట్రంలోని ఉత్తర, పశ్చిమ సిక్కిం జిల్లాల్లో ఉంది. ఈ ఉద్యానవనం ఉత్తరాన టిబెట్‌లోని కొమోలంగ్మా ప్రాంతాన్ని తాకుతుంది. పశ్చిమాన నేపాల్‌ ప్రాంతాన్ని తాకుతుంది.

మూలాలు

[మార్చు]