Jump to content

కాంక్రీట్ స్లాబ్

వికీపీడియా నుండి
Suspended slab under construction, with the formwork still in place.
Suspended slab formwork and rebar in place, ready for concrete pour. On reinforced concrete blockwork supporting walls.

కాంక్రీట్ స్లాబ్ అనేది ఆధునిక భవనాల యొక్క సాధారణ నిర్మాణ అంశం. స్టీల్ రీన్ఫోర్స్డ్ కాంక్రీటు సమాంతర కట్టడాలు సాధారణంగా 4, 20 అంగుళాల (100, 500 మిల్లీమీటర్లు) మధ్య మందం ఉంటాయి, తరచుగా అంతస్తులను, సీలింగ్ లను నిర్మించేందుకు ఉపయోగిస్తారు, అయితే సన్నని స్లాబ్లు బాహ్య సుగమం కోసం కూడా ఉపయోగిస్తారు. కొన్నిసార్లు ఈ సన్నని స్లాబ్స్ 2 అంగుళాల (51 మిమీ) నుండి మొదలుకొని 6 అంగుళాల (150 మిమీ) మందం ఉంటాయి, వీటిని మట్టి స్లాబ్స్ అని పిలుస్తారు, ముఖ్యంగా వీటిని ప్రధాన అంతస్తు స్లాబ్స్ కు లేదా క్రాల్ ప్రదేశాలలో కింద ఉపయోగిస్తారు. అనేక దేశీయ, పారిశ్రామిక భవనాలలో మందపాటి కాంక్రీటు స్లాబ్ పునాదుల మీద ఆధారపడి ఉంటుంది, లేదా నేరుగా అడుగునేల పైనే భవంతి యొక్క గ్రౌండ్ ఫ్లోర్ నిర్మించేందుకు ఉపయోగిస్తారు. ఎత్తయిన భవనాలు, ఆకాశహర్మ్యాలలో సన్నని ప్రి-కాస్ట్ కాంక్రీటు స్లాబ్స్ లలో ఉక్కు చట్రాలు ప్రతి స్థాయిలో ఫ్లోర్‌కి, సీలింగ్‌ ఏర్పాటు మధ్య కాంక్రీట్‌లో కూరుకొని ఉంటాయి. టెక్నికల్ డ్రాయింగుల నందు రీన్ఫోర్స్డ్ కాంక్రీటు స్లాబ్లు తరచుగా "r.c.c.స్లాబ్" లేదా సింపుల్‌గా "r.c." అనే సంక్షిప్తముతో ఉంటాయి.