Jump to content

కళావతి భూరియా

వికీపీడియా నుండి
కళావతి భూరియా

పదవీ కాలం
2018 – 2021
ముందు మధోసింగ్ దావర్
తరువాత సులోచన రావత్
నియోజకవర్గం జోబాట్

వ్యక్తిగత వివరాలు

జననం 1972
జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
నివాసం మధ్యప్రదేశ్
వృత్తి రాజకీయ నాయకురాలు

కళావతి భూరియా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె మధ్యప్రదేశ్ శాసనసభకు 2018 శాసనసభ ఎన్నికలలో జోబాట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1]

కళావతి కేంద్ర మంత్రి కాంతిలాల్ భూరియా మేనకోడలు.

రాజకీయ జీవితం

[మార్చు]

కళావతి భూరియా భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి ఝబువా-అలీరాజ్‌పూర్ (అవిభక్త) జిల్లా పంచాయతీ అధ్యక్షురాలిగా వరుసగా మూడుసార్లు పని చేసి 2018 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో జోబాట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి మాధోసింగ్ దావర్ పై 2,056 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఆమె 46,067 ఓట్లతో విజేతగా నిలవగా, మాధోసింగ్ దావర్ 44,011 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచాడు.[2]

మరణం

[మార్చు]

కళావతి భూరియా కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ తో ఇండోర్‌లోని షాల్బీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2021 ఏప్రిల్ 24న మరణించింది.[3][4][5][6]

మూలాలు

[మార్చు]
  1. India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners". Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.
  2. "Jobat Constituency Election Results 2023". The Times of India. 3 December 2023. Archived from the original on 27 February 2025. Retrieved 27 February 2025.
  3. "Madhya Pradesh Cong. MLA Kalawati Bhuria dies of COVID-19". The Hindu. 24 April 2021. Archived from the original on 27 February 2025. Retrieved 27 February 2025.
  4. "కరోనాతో కాంగ్రెస్‌ మహిళా ఎమ్మెల్యే కళావతి భూరియా మృతి". V6 Velugu. 25 April 2021. Archived from the original on 27 February 2025. Retrieved 27 February 2025.
  5. "Kalawati Bhuria, Congress MLA from Jobat seat of Madhya Pradesh, dies of Covid" (in ఇంగ్లీష్). The Indian Express. 24 April 2021. Archived from the original on 27 February 2025. Retrieved 27 February 2025.
  6. "కరోనాతో కాంగ్రెస్‌ మహిళా ఎమ్మెల్యే మృతి | Madhya Pradesh Congress MLA Kalawati Bhuria Dies During Covid | Sakshi". Sakshi. 24 April 2021. Archived from the original on 27 February 2025. Retrieved 27 February 2025.