కల్పాక్కం
కల్పాక్కం | |
---|---|
పట్టణం | |
![]() కల్పాక్కం పట్టణం మొదటి వీధి | |
Coordinates: 12°33′27″N 80°10′31″E / 12.557563°N 80.175406°E | |
దేశం | ![]() |
రాష్ట్రం | తమిళనాడు |
జిల్లా | చెంగల్పట్టు |
జనాభా (2002) | |
• మొత్తం | ~20,000+ |
Languages | |
• Official | తమిళం |
కాల మండలం | UTC+5:30 (IST) |
PIN | 603 102 |
Telephone code | 91-44 |
Vehicle registration | TN-19 |
Lok Sabha constituency | Kancheepuram |
Vidhan Sabha constituency | Cheyyur |
కల్పాక్కం తమిళనాడులోని ఒక పట్టణం. ఇది ఆ రాష్ట్ర రాజధాని చెన్నై నగరానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో దక్షిణాన కోరమాండల్ తీర ప్రాంతంలో ఉంది. ఇది పుదుపట్టణం, సదురంగపట్టణం అనే రెండు ఊర్లు కలిపి భారత అణుశక్తి విభాగం వారు ఏర్పాటు చేసిన పట్టణం. ఇది తిరువణ్మియూర్ కు 55 కిలోమీటర్ల దూరంలోనూ, పుదుచ్చేరికి 85 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది.
కల్పాక్కం అందులో ఉన్న అణు కర్మాగారం, దాని సంబంధిత పరిశోధనాశాలలకు పేరెన్నికగన్నది. ఇందులో ముఖ్యమైనవి మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్, ఇంకా ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్. ఇవి రెండూ భారత ప్రభుత్వపు అణుశక్తి విభాగం, భాభా అణు పరిశోధనా కేంద్రం కు అనుసంధానమై ఉన్నాయి. భారతదేశంలో ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్ (FBTR), ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ (PHWR) కలిగి ఉన్న ఏకైక న్యూక్లియర్ ప్లాంట్ కల్పాక్కంలోనే ఉంది.[1]
సౌకర్యాలు
[మార్చు]కల్పాక్కం అనేది ప్రణాళిక ప్రకారం రూపుదిద్దుకున్న పట్టణం. ఇక్కడ అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్, రెండు కేంద్రీయ విద్యాలయాలు, ప్రభుత్వ సెకండరీ స్కూలు, ఇతర ప్రైవేటు స్కూళ్ళు ఉన్నాయి. వైద్య సౌకర్యాల కోసం ఆసుపత్రి, జనరల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఉన్నాయి. ఇది రెండు సద్రాస్, పుదుపట్టణం అని రెండు భాగాలుగా విభజించబడి ఉన్నాయి. ఈ రెండింటినీ ఒక వంతెన కలుపుతుంది.
మూలాలు
[మార్చు]- ↑ "న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా".
{{cite web}}
: CS1 maint: url-status (link)