Jump to content

కర్ణభక్తుల

వికీపీడియా నుండి
(బసవ కళ్యాణ్) కర్ణాటకలోని బసవేశ్వర విగ్రహం

కర్ణభక్తుల ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా బి గ్రూపులోని 10వ కులం.వీరు చేనేత కులానికి చెందినవారు కర్ణభక్తుల కులస్తులు శివభక్తులుబసవేశ్వరుని కొలుస్తారు.

వృత్తి, సామాజిక జీవనం

[మార్చు]
  • వీరి కులవృత్తి నేత పని. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలోనే ఎక్కువమంది ఉన్నారు. ఇతర రాష్ట్రాలకు తమ చేనేత ఉత్పత్తులను పంపిస్తున్నారు. పాలకొల్లు మండలం భగ్గేశ్వరం గ్రామంలోని కర్ణభక్తుల కులస్తులు తయారుచేసే తలపాగాలు దేశ వ్యాప్తంగా మంచి పేరు పొందాయి. ఈ తలపాగాల వ్యాపారంలోనే కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు.
  • బనియన్ల తయారీ, పట్టు షర్టింగ్‌ వ్యాపారంలోనూ వీరికి ఎక్కువ ప్రావీణ్యత కలదు. కర్ణాటక, గుజరాత్‌, హర్యానా వంటి అనేక రాష్ట్రాలకు వీరి ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. `అంగర' నేత చీరలకు కూడా ప్రత్యేకత ఉంది. నూరు, నూట ఇరవై కౌంట్‌తో నేసిన కారణంగా సుతి మెత్తగా ఉంటున్నాయి. చీర కట్టుకున్నవారు గొప్ప అనుభూతి పొందుతున్నారు కనుకనే విపరీతమైన ఆర్డర్లు వస్తున్నాయి. `నేలటూరు' బుటా వస్త్రాలకూ మంచి పేరుంది. దాదాపు 35 సంవత్సరాల క్రితం నుంచి కర్ణభక్తుల యువతలో మార్పు చోటు చేసుకుంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 23 చేనేత సంస్థలకుగాను 20కిపైగా కర్ణభక్తు కులస్తులు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలోఆరు చేనేత సంస్థలకు వీరే అధ్యక్షులు.
  • అజ్జరం ఇత్తడి బిందెలకు మంచి పేరుంది. గుండ్రంగా ఉండే ఈ బిందెలకు సంతలలో సైతం మంచి డిమాండ్‌ ఉంది. ఇత్తడి పనిలో తమ కళా కౌశలం చూపించినవారు ఇతర రంగాలవైపు కూడా దృష్టి చూపారు. జూట్‌ మిల్లులకు సంబంధించిన ఇత్తడి బేరింగ్‌లు కూడా వీరే తయారుచేస్తున్నారు. కంచు గంటలు తయారు చేయటంలో కూడా వీరు సిద్దహస్తులు. కంచు గంటలకు పశ్చిమ గోదావరి జిల్లాలోని అజ్జరం గ్రామం పేరు. పూర్తిగా కంచుతో తయారు చేసిన ఓంకార నాదం ధ్వనించే 340 కేజీల కంచుగంట ఇక్కడి వారు తయారు చేసిందే.
  • 50 శాతానికి పైగా అక్షరాస్యులు ఈ కులంలో ఉన్నారు. వీరి వివాహ వ్యవస్థలో దేవాంగ, పద్మశాలీ, కరికాల భక్త కులాల వారితో కూడా సంభంద బాంధవ్యాలు ఉంటాయి.

మూలాలు

[మార్చు]