Jump to content

కుర్తా

వికీపీడియా నుండి
(కమీజ్ నుండి దారిమార్పు చెందింది)
సాధారణ కుర్తా

కుర్తా అనునది భారతదేశంలో (సాధారణంగా) పురుషులు శరీర పై భాగాన్ని కప్పుకోవటానికి ఉపయోగించే దుస్తులలో ఒకటి. దీని క్రింద పైజామా గానీ, ధోవతిగానీ, పంచె గానీ ఒక్కోసారి యువకులు జీన్స్ ప్యాంటు గానీ వేసుకొంటారు. స్త్రీలు వేసుకొనే కుర్తాలను కుర్తీ అని గానీ వ్యవహరిస్తారు. ఒక్కోమారు స్త్రీ పురుషుల కుర్తాని (సల్వార్ కమీజ్లో భాగమైన) కమీజ్ అని కూడా వ్యవహరిస్తారు.

సాధారణంగా పురుషులు నూలు/ఖద్దరు లేదా నూలుతో కలసిన ఇతర రకాలు (blend) తో తయారు చేసిన కుర్తా (జుబ్బా/లాల్చీ) ధరిస్తారు.

2002 లో విడులైన మన్మథుడు చిత్రంలో షార్ట్ కుర్తాని ధరించిన అక్కినేని నాగార్జున

సాంప్రదాయిక (లాంగ్) కుర్తాలు

[మార్చు]

మ్యాండరిన్ కాలర్ (చైనీసు కాలర్) తో కూడి గానీ, అసలు కాలరే లేకుండా గానీ, మెడ నుండి తొడల వరకూ/భుజాల నుండి అరచేతుల వరకు కుర్తా శరీరాన్ని కప్పుతుంది. చేతుల వద్ద బొత్తాలు ఉండవు. ఛాతీ వద్ద కాజాలతో కూడిన, లేక నొక్కుడు బొత్తాలు రెండు లేదా మూడు ఉంటాయి. కుర్తాలు సాధారణంగా తెలుపే అయిననూ అప్పుడప్పుడూ వేరే రంగులలో ఉండగలవు. జేబులు సాధారణంగా ఛాతీ వద్ద ఉండవు. కానీ నడుముకు ఇరువైపులా ఉంటాయి. పెన్ను, పాకెట్ బుక్, మొబైల్, పర్సు వంటివి భద్రపరచుకొనటానికి అనువుగా ఛాతీ వద్ద ఒక జేబు వ్యక్తిగతంగా కొందరు పెట్టించుకొంటారు. కుర్తాకి నడుముకు ఇరువైపులా ఒక్కో వెంటు (చీలిక) ఉంటుంది. కాళ్ళ కదలికలకి అడ్డు పడకుండా ఈ వెంటులు ఖాళీ స్థలాన్ని సృష్టిస్తాయి.

ఆధునిక (షార్ట్) కుర్తాలు

[మార్చు]

మన్మథుడు (సినిమా)లో అక్కినేని నాగార్జున వీటికి కొంత ఆధునికత జోడించి, సొబగులు అద్ది (చారలు, గడులు లేదా పూల డిజైను గల వస్త్రాలతో మరీ వదులుగా లేకుండా, శరీరానికి హత్తుకునేంత బిగుతుగా, మోచేతి నుండి కొద్దిగా బెల్-బాటం వలె వచ్చి, బొత్తాలు అసలు లేకుండా, ఛాతీ మధ్యభాగము బహిర్గతము అయ్యేలా, ఛాతీ వద్ద, అరచేతుల వద్ద ఎంబ్రాయిడరీలు వేసి ఉండి, చొక్కా వలె పొడవు తక్కువగా ఉండే షార్ట్ కుర్తాలని ఆంధ్ర ప్రదేశ్లో మొట్టమొదటి సారిగా ధరించాడు. ఇవి విపరీతమైన జనాదరణ పొందాయి. వాస్తవానికి వీటి పేరు షార్ట్ కుర్తాలైనా, మన్మథుడు షర్ట్ లు గానే ఇవి జనానికి దగ్గరయ్యాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కుర్తా&oldid=4164537" నుండి వెలికితీశారు