Jump to content

కప్పలకావడి

వికీపీడియా నుండి
కప్ప

కప్పలకావడి అనావృష్టి ప్రాంతమైన రాయలసీమలో వర్షం కోసం ప్రజలు ఆచరించే ఆచారం.

కళారీతి

[మార్చు]

ఒక కావడి భుజాన వేసుకుని రెండు ప్రక్కలా రెండు తట్టల్లో కప్ప లను పెట్టి అవి ఎగిరి పోకుండా వేప మండలు వేసి ఇద్దరు ముగ్గురు స్త్రీలు బృందాలుగా ఏర్పడి వానాలమ్మ వచ్చేనూ..... వరిచేలు పండేనూ అంటూ పాడుకుంటూ ఇంటింటికీ తిరుగుతూ యాచించే వారు. కప్పలు బెక బెక మంటే వర్షాలొస్తాయనీ, అలాంటి కప్పల్ని పూజిస్తే వర్షాలొస్తాయనీ నమ్మించే వాళ్ళు. ముఖ్యంగా అనావృష్టి జరిగి వర్షం కోసం రైతులు ఎదురు చూసే సమయంలో వాన దేవుడి కోసం చేసే ఆచారలలో ఇదొకటి. అనావృష్టి ప్రాంతమైన రాయలసీమ లో వర్షం కోసం ఇలాంటి ఆచారమే వుంది. మానవాతీత శక్తుల్ని సంతోష పెడితే వర్షం కురుస్తుందని వారి నమ్మకం. మట్టి మూకుడులో కప్పలనుంచి వాటిపైన తంగేడాకు వుంచి ఆ మూకుణ్ణి నెత్తి మీద పెట్టుకుని లేదా కావడిలో పెట్టి వాన దేవా....... అని పాడుతూ, భిక్షానికి వస్తారు. వర్షలక్ష్మి ఈ రూపంలో వచ్చిందని నమ్మిన స్త్రీలు బిచ్చం వేస్తారు. కావడి తగిలించు కున్న వారు ఈ క్రింది విధంగా పాడతారని జానపద విజ్ఞానం లో సుందరం గారు ఈ విధంగా ఉదహరించారు.

బూమెమ్మ కడుపునా బుగ బుగా పొగిలింది,
కన్నీటి పొంగులే, పెన్నేటి కాలువా? ఓ వాన దేవా?
ఏరులూ చెరువులూ ఏకమై పారల్ల
మా కొండ్ర పండల్ల
మా కడుపు నిండల్ల ఓ వాన దేవా..

[1]

సూచికలు

[మార్చు]
  1. కప్పల కావడి సమయంలో పాడే పాటని 1975 లో దోణప్ప గారి ఉదహరణ

యితర లింకులు

[మార్చు]