Jump to content

కనక్తారా

వికీపీడియా నుండి
కనక్తారా
తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాదులోని రవీంద్రభారతిలో నిర్వహించిన తెలంగాణ యువ నాటకోత్సవంలో 2017 అక్టోబరు 22న సురభి నాటక బృందం ప్రదర్శించిన కనక్తారా నాటకంలోని దృశ్యం
కృతికర్త: చందాల కేశవదాసు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: నాటకరంగం
ప్రచురణ: కొండపల్లి వీరవెంకయ్య అండ్ సన్సు, రాజమండ్రి
విడుదల: 1944
పేజీలు: 126

కనక్తారా నాటకము చందాల కేశవదాసు రచించిన నాటకము.

రచయిత గురించి

[మార్చు]

నాటకాల్లో మొదట పాడే పరబ్రహ్మ పరమేశ్వర అనే సుప్రసిద్ధ కీర్తనను, ఆంధ్రదేశమంతటిని ఉర్రుతలూగించిన భలే మంచి చౌక బేరము పోయినన్ దొరుకదు అనే పాటను రాసిన చందాల కేశవదాసు ( 1876 జూన్ 20 - 1956 జూన్ 14) తొలి తెలుగు సినీ గీత రచయిత, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, అష్టావధాని, శతావధాని,, నాటకకర్త. తెలుగులో మొదటి శబ్ద చిత్రం భక్త ప్రహ్లాదకు ఈయన పాటలు రాసారు. ఆ కారణంగా తొలి తెలుగు సినీ గేయ రచయితగా చరిత్రలో నిలిచారు. ఈ గ్రంథం ఆయన రాసిన నాటకం.

Chandala Kesavadasu.JPG
చందాల కేశవదాసు

పాత్రలు

[మార్చు]
పురుషులు
  • సూత్రధారుడు
  • ఉదయసేనుడు - మహారాజు
  • క్రూరసేనుడు - ఉదయసేనుని తమ్ముడు
  • ప్రతాపుడు - సేనాధిపతి
  • ధీమంతుడు - మంత్రి
  • సోమేశ్వర దీక్షితులు - కూటసాక్షి
  • సువర్ణుడు, దేవబలుడు - న్యాయవాదులు
  • మతిమంతుడు - విజయసేనుని మంత్రి
  • అనంతుడు, గ్రీష్ముడు - రాంజట్టి పుత్రులు
  • వైద్యుడు
  • ఖుస్రూఖాన్
  • లోభగుప్తుడు - వైశ్యుడు
  • సేవకుడు
  • కంచుకి
  • గిడ్డూఖాన్ - పహారా బంట్రోతు
  • సులోచనుడు - సేవకాధిపుడు
  • కనకసేనుడు - ఉదయసేనుని కుమారుడు
  • వీరపాలుడు, శూరపాలుడు - క్రూరుని సహచరులు
  • మల్లిగాడు, నల్లిగాడు, ఎల్లిగాడు, పుల్లిగాడు - జాలరులు
  • బూచిగాడు - దొంగమేటి
  • విజయసేనుడు - ఉదయసేనుని మిత్రుడు
  • ఋషులు
స్త్రీలు
  • కమలాదేవి - ఉదయసేనుని పట్టపురాణి
  • కీరవాణి - కమల చెలికత్తె
  • తార - ఉదయసేనుని కూతురు
  • రత్నాబాయి, రాధాబాయి - రాంజట్టి భార్యలు
  • లచ్చి - మల్లిగాని భార్య

తెలుగు సినిమాలు

[మార్చు]

ఈ నాటకం ఆధారంగా రెండు తెలుగు సినిమాలు నిర్మించబడ్డాయి:

మూలాలు

[మార్చు]
  1. కనకతార 1937 సినిమా at IMDb.
  2. కనకతార 1956 సినిమా at IMDb.
"https://te.wikipedia.org/w/index.php?title=కనక్తారా&oldid=4318178" నుండి వెలికితీశారు