కడియాల మధుసూదనరావు
కడియాల మధుసూదనరావు మత్స్య శాస్త్రవేత్త.
జీవిత విశేషాలు
[మార్చు]ఆయన కృష్ణా జిల్లా వీరులపాడు మండలం లోని పొన్నవరం గ్రామంలో జూన్ 19 1934 న జన్మించారు. ఇంటర్మీటియట్ విద్యను ఏలూరులోని సి.ఆర్.ఆర్ కళాశాలలో 1952 లో పూర్తి చేసారు. 1954 లో విశాఖపట్నంలో మిసెస్ ఎ.వి.ఎన్.కళాశాల నుండి బి.ఎస్సీ డిగ్రీని పొందారు. 1956 లో బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి పూర్తి చేసారు. హిందూ విశ్వవిద్యాలయం లోనూ, ఢిల్లీ విశ్వవిద్యాలయం లోనూ జంతు శాస్త్రంలో పి.హెచ్.డి అందుకున్నారు. "అప్లికేషన్ ఆఫ్ రెమోట్ సెన్సింగ్ టు ఆక్వా కల్చర్ అండ్ ఇన్లాండ్ ఫిషరీస్"అనే అంశం మీద అంతర్జాతీయ శిక్షణ పొంది ఐక్యరాజ్యసమితి (ఎఫ్.ఎ.ఓ) వారి ప్రశంసా పత్రమును అందుకున్నారు.
ఉద్యోగ పర్వం
[మార్చు]ఉద్యోగ పర్వంలో తొలిసారిగా ఆయన విశాఖపట్నం కళాశాలలో జంతుశాస్త్ర విభాగంలో పని చేసారు. ఆ తరువాత కేంద్ర రాష్ట్ర విషరీస్ విభాగాలలో పరిశోధకులుగా పనిచేసారు.పశ్చిమ బెంగాల్ లోని బారక్‌పూర్ లోనూ, ఒరిస్సా లోనూ ఫిషరీస్ అదికారిగా యున్నారు.ఆయన రీజనల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ ఇన్లాండ్ ఫిషరీస్ ఆపరేటివ్స్(హైదరాబాదు) లో సీనియర్ ఇనస్ట్రక్టరుగా పనిచేసారు.[1] సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఏడ్యుకేషన్ (ముంబై) లో అనేక ఉన్నత పదవులను అధిష్టించి ప్రిన్సిపాల్ సైంటిస్టుగా పదవీవిరమణ చేసారు.
పరిశోధనలు
[మార్చు]మత్స్య శాస్త్ర రంగంలో ఆయన పరిశోధనలు చేసారు. చేపలలో 17 హైబ్రిడ్ రకాలను రూపొందించారు. చేపల,రొయ్యల పెంపకాలమీద ఆయన 199 పరిశోధనా పత్రాలు,సమీక్షా వ్యాసాలు,పుస్తకాలను,[2] బులెటెన్స్, జర్నల్స్[3] వెలువరించారు. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిషరీస్ డిపార్టుమెంటుకు ఎక్స్ పర్టు ఆడ్వయిజరుగా ఉండి "మాస్టర్ ప్లాన్" రూపకల్పనలో కీలక పాత్ర వహించారు. రెండున్నర దశాబ్దాలుగా వివిధ రాష్ట్రాల చేపల, రొయ్యల పెంపకం దార్లకు సలహాదారుగా ఉండి అధిక దిగుబడి సాధించారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లకు సలహాదారుగా ఉండి విశేష స్థాయిలో సేవలందిచారు. 1990 లో ఇందిరాగాంధీ ప్రోధ్బలంతో అస్సాం రాష్ట్రంలో వ్యవసాయ ఆర్థిక రంగాన్ని అభివృద్ధి పరచిన "హైపవర్ టీం"లో సభ్యులుగా ఉండి విశేష ఖ్యాతినార్జించారు.
అవార్డులు
[మార్చు]- 1954 : సర్ సి.వి.రామన్ ప్రైజ్.
- 1956 : బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ర్యాంక్ హోల్డర్ పురస్కారం.
- 1990,92 : ఎ.బి.ఐ ఇంటర్నేషనల్ బోర్డ్ ఆఫ్ రీసెర్చ్ (అమెరికా) వారి "మ్యాన్ ఆఫ్ ద యియర్" అవార్డు.
- 1991 : ఎ.బి.ఐ. అమెరికా వారి "రీసెర్చ్ అడ్వయిజర్ ఆఫ్ ద ఇయర్" అవార్డు.
- 1992 : మోస్టు అడ్మయిర్డ్ మ్యాన్ ఆఫ్ ద డెకేడ్ అవార్డు.
- 2003 : ఎం.ఎస్.స్వామినాథన్ అవార్డు [4]
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో, కార్పొరేట్ రంగంలో వివిధ ఉన్నత పదవులను పొందారు. అమెరికా బయోగ్రఫికల్ ఇనిస్టీట్యూట్ వారు "సర్వీసు టు ప్రొఫెసర్" కేటగిరీలో 1990 లో లీడర్ షిప్ అవర్డు అందించారు8. మనీలా (ఫిలిప్పైన్స్) ఆసియన్ ఫిషరీస్ సొసైటీకి శాశ్వత సభ్యులు ఎ.బి.ఐ రీసెర్చి అసోసియేషన్ (అమెరికా) కు డిప్యూటీ గవర్నర్ గా ఉన్నారు.
మన రాష్ట్రంలో రామోజీ ఫిల్మ్ సిటీలో "ఫిషరీస్ కన్సల్టెంట్"గా గౌరవ హోదాలో ఉన్నారు.
మూలాలు
[మార్చు]- ↑ PARTICIPANTS
- ↑ Reservoir Fisheries of India
- ↑ "Indian J()urnal ()f Animal Sciences 56 (3) : 453 -458, April 1986" (PDF). Archived from the original (PDF) on 2017-08-12. Retrieved 2015-06-09.
- ↑ "Felicitation function of Dr MS Swaminathan". Archived from the original on 2016-03-05. Retrieved 2015-06-09.