Jump to content

కడియం కావ్య

వికీపీడియా నుండి
కడియం కావ్య

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు పసునూరి దయాకర్
నియోజకవర్గం వరంగల్

వ్యక్తిగత వివరాలు

జననం (1980-01-01) 1980 జనవరి 1 (వయసు 44)
ప‌ర్వ‌త‌గిరి , వ‌రంగ‌ల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు బీఆర్ఎస్
తల్లిదండ్రులు కడియం శ్రీహరి, కె.వినయరాణి
జీవిత భాగస్వామి డా. మహమ్మద్‌ నజీరుల్లా
నివాసం హైదరాబాద్
వరంగల్
మతం హిందూ

కడియం కావ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన వైద్యురాలు, సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకురాలు. ఆమె కడియం ఫౌండేషన్ ద్వారా వివిధ సామజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించింది.[1][2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

ఆమె దక్కన్ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ చేశాక, ఉస్మానియా మెడికల్ కాలేజీ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎండి (పాథాలజీ) పూర్తి చేసి, వరంగల్‌ లో కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్‌గా పని చేసింది.[3]

రాజకీయ జీవితం

[మార్చు]

కడియం కావ్య తన తండ్రి కడియం శ్రీహరి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఆమెను మార్చి 13న వరంగల్‌ ఎంపీ అభ్యర్థిగా కేసీఆర్‌ ప్రకటించాడు. ఆమె మార్చి 29న వరంగల్‌ లోక్‌సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించింది.[4][5]

కడియం కావ్య 2024 మార్చి 31న బీఆర్ఎస్ పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరింది.[6] ఆమెను ఏప్రిల్ 1న వరంగల్‌ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.[7] ఆమె 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ పై 220339 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[8][9]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (14 March 2024). "వరంగల్‌ బరిలో కడియం కావ్య." Archived from the original on 14 March 2024. Retrieved 14 March 2024.
  2. Andhrajyothy (19 January 2022). "నెలసరి గురించి నోరు విప్పాలంటే సిగ్గెందుకు..?". Archived from the original on 19 జనవరి 2022. Retrieved 19 January 2022.
  3. India Today (13 July 2024). "Doctors | Healthy corps" (in ఇంగ్లీష్). Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
  4. Andhrajyothy (29 March 2024). "బీఆర్‌ఎస్‌కు బై బై". Archived from the original on 29 March 2024. Retrieved 29 March 2024.
  5. Sakshi (29 March 2024). "బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌". Archived from the original on 29 March 2024. Retrieved 29 March 2024.
  6. V6 Velugu (31 March 2024). "కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి, కావ్య". Archived from the original on 31 March 2024. Retrieved 31 March 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. Eenadu (1 April 2024). "వరంగల్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా కడియం కావ్య". Archived from the original on 1 April 2024. Retrieved 1 April 2024.
  8. Election Commision of India (4 June 2024). "2024 Warangal Loksabha Election Results". Archived from the original on 4 June 2024. Retrieved 4 June 2024.
  9. Sakshi (25 October 2024). "కేంద్ర సంప్రదింపుల కమిటీల్లో ఎంపీలకు చోటు". Retrieved 25 October 2024.