Jump to content

కచ దేవయాని (నాటకం)

వికీపీడియా నుండి

కచ దేవయాని ముత్తరాజు సుబ్బారావు రచించిన నాటకం.

కచుడు దేవతల్లోని వాడు. మరణించినవారిని తిరిగి జన్మింపజేసే విద్య-మృతసంజీవని. దానిని సాధించేందుకు రాక్షసుల గురువైన శుక్రాచార్యుని వద్ద చేరి ఆయన కూతురు దేవయానిచే మోహింపజేసుకుని తుదకు ఆ విద్యను సాధిస్తాడు. ముత్తరాజు సుబ్బారావు కవి ఈ ఇతివృత్తాన్ని నాటకీకరించారు.

పాత్రలు

[మార్చు]
పురుషులు
  • ఇంద్రుడు - స్వర్గాధిపతి
  • అగ్ని - దిక్పాలకుడు
  • వాయువు - దిక్పాలకుడు
  • వరుణుడు - దిక్పాలకుడు
  • బృహస్పతి - దేవగురువు
  • కచుడు - బృహస్పతి జేష్ఠపుత్రుడు
  • నారదుడు - దేవమౌని
  • వృషపర్వుడు - అసురేశ్వరుడు
  • శుక్రాచార్యుడు - అసురగురువు
  • దండుడు - అసురుడు
  • కుంభుడు - అసురుడు
  • నికుంభుడు - అసురుడు
స్త్రీలు
  • శర్మిష్ఠ - వృషపర్వుని కూతురు
  • దేవయాని - శుక్రాచార్యుని కూతురు
  • రంభ - దేవవేశ్య
  • నిర్మల - దేవయాని చెలికత్తె

మూలాలు

[మార్చు]