Jump to content

కంభంపాటి స్వయంప్రకాష్

వికీపీడియా నుండి
కంభంపాటి స్వయంప్రకాష్
కంభంపాటి స్వయంప్రకాష్
జననం
కృష్ణలంక, విజయవాడ
మరణం2010 ఆగస్టు 27(2010-08-27) (వయసు 48)
హైదరాబాదు
మరణ కారణంకాన్సర్
వృత్తిఆయుర్వేద వైద్యుడు, సెక్సాలజిస్ట్
జీవిత భాగస్వామిరామలక్ష్మి
పిల్లలులలిత, శ్రీనివాస్
తల్లిదండ్రులు
  • రామగోపాల కృష్ణ మూర్తి (తండ్రి)
  • విశాలాక్షి (తల్లి)

కంభంపాటి స్వయంప్రకాష్ లైంగిక సమస్యల నిపుణుడు (సెక్సాలజిస్ట్‌). ఈయన స్వస్థలం విజయవాడ కృష్ణలంక. ఆయన శృంగారంపై నెలకొన్న అపోహాలను తొలగించేందుకు విశేష కృషి చేశాడు.

జీవిత విషయాలు

[మార్చు]

కంభంపాటి రామగోపాల కృష్ణమూర్తి, విశాలాక్షి దంపతులకు 12 మార్చి, 1962 న ఆయన జన్మించాడు. ఆయనకు భార్య (రామలక్ష్మి), కుమార్తె (లలిత), కుమారుడు ( శ్రీనివాస్) ఉన్నారు. 1977 నుంచి 1983 వరకు ఆయుర్వేద వైద్య విద్య బీఎఎంఎస్ చదివిన స్వయంప్రకాష్, గుజరాత్‌లోని జాంనగర్‌ విశ్వవిద్యాలయంలో 1983 నుంచి 1986 వరకు ఆయుర్వేద రస శాస్త్రంలో ఎం.డి.చేశాడు.

వైద్యరంగం

[మార్చు]

1987లో తూర్పుగోదావరి జిల్లాలో గౌరవ మెడికల్ అధికారిగా ఉద్యోగంలో చేరాడు. ఎన్ఆర్ఎస్ ఆయుర్వేద కళాశాలలో తరగతులు తీసుకుని పాఠాలు చెప్పాడు. విజయవాడలోని డాక్టర్ ఆచంట లక్ష్మీపతి ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిలో వైద్యాధికారిగా పనిచేశాడు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద వైద్య కళాశాలలో రసశాస్త్ర అధ్యాపకుడుగా పనిచేశాడు. బాల్టిమోర్‌లోని జాన్స్ హాప్కిన్స్ ఆసుపత్రిలో సెక్సాలజిస్టు ప్రొఫెసర్‌ జాన్‌ మనీ వద్ద చాలాకాలం శిక్షణ పొందాడు. లైంగిక విజ్ఞానంపై సుమారు 14 పుస్తకాలు, దాదాపు 5 వేల వ్యాసాలు వ్రాశాడు. 2008లో హైదరాబాదులో 'అంతర్జాతీయ కాంగ్రెస్‌ ఆఫ్‌ సెక్సాలజీ' సదస్సు నిర్వహించడంలో కీలక పాత్ర పోషించాడు.

మరణం

[మార్చు]

ప్రోస్టేట్‌ క్యాన్సర్‌తో బాధపడుతూ 2010 ఆగస్టు 27 న చనిపోయాడు.

సూచికలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]