Jump to content

ఐ.జి. పటేల్

వికీపీడియా నుండి
ఇంద్రప్రసాద్ గోర్ధన్‌భాయ్ పటేల్
I. G. Patel, 1984
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ కు 9 వ డైరెక్టర్
In office
1984–1990
అంతకు ముందు వారురాల్ఫ్ డహ్రెండోర్ఫ్
తరువాత వారుజాన్ ఆష్వర్త్
14 వ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్
In office
డిసెంబర్ 1, 1977 – సెప్టెంబర్ 15, 1982
అంతకు ముందు వారుఎమ్. నరసింహం
తరువాత వారుమన్మోహన్ సింగ్
డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం
In office
1972–1977
2 వ భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు
In office
1965–1967
In office
1961–1963
వ్యక్తిగత వివరాలు
జననం(1924-11-11)1924 నవంబరు 11
వడోదర, గుజరాత్, భారతదేశం
మరణం2005 జూలై 17(2005-07-17) (వయసు 80)
న్యూయార్క్ నగరం, యు.ఎస్.
సమాధి స్థలంవడోదర, గుజరాత్, భారతదేశం
జాతీయతభారతీయుడు
కళాశాలముంబై విశ్వవిద్యాలయం
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం
హార్వర్డ్ విశ్వవిద్యాలయం
వృత్తిఇండియన్ ఎకనామిక్స్ సర్వీస్[1][2]
సంతకం

ఐ.జి. పటేల్ ( నవంబర్ 11, 1924జూలై 17, 2005 ) ఈయన ఒక భారతీయ ఆర్థికవేత్త. ఈయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క పద్నాలుగో గవర్నర్‌గా పనిచేశాడు.[3]

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

ఈయన 1924, నవంబర్ 11 న గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో జన్మించాడు. ఈయన తన మెట్రిక్యులేషన్ పరీక్షలో మొదటి స్థానంలో నిలిచాడు. ఈయన తన బి.ఎ. విద్యను ముంబై విశ్వవిద్యాలయంలో పూర్తిచేసాడు. ఈయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని కింగ్స్ కాలేజీలో స్కాలర్షిప్ తో చదివాడు. ఈయన హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీని పూర్తిచేసాడు.

కెరీర్

[మార్చు]

ఈయన భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత బరోడా కాలేజీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. ఇదే కాలేజీలో 1949 లో ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. 1950లో ఈయన గురువు ఎడ్వర్డ్ బెర్న్‌స్టెయిన్ అంతర్జాతీయ ద్రవ్య నిధి పరిశోధనా విభాగంలో చేరమని ఆహ్వానించాడు. అక్కడ ఐదు సంవత్సరాలు పనిచేసిన తరువాత న్యూఢిల్లీకి తిరిగి వచ్చాడు. ఈయన 1954 లో ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఆర్థిక సలహాదారుగా పనిచేశాడు. ఈయన భారత ప్రభుత్వంలో 18 సంవత్సరాల పాటు వివిధ పదవులను చేసాడు. ఈయన 1972 లో ఐదేళ్లపాటు ఐరాస అభివృద్ధి కార్యక్రమానికి డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ గా పనిచేశాడు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ పదవిని చేపట్టడానికి తిరిగి భారతదేశానికి వచ్చాడు. ఈయన 1982 లో అహ్మదాబాద్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రిన్సిపాల్ గా నియమించబడ్డాడు. ఈయన ప్రిన్సిపాల్ గా ఉన్న కాలంలో ఉత్తమ నిర్వహణ కాలేజ్ గా అవతరించింది. ఈయన 1984 లో ఎల్‌ఎస్‌ఇ డైరెక్టర్‌గా నియమితులయ్యాడు. ఈయన హౌటన్ స్ట్రీట్‌లో పాఠశాలల ఆర్థికవ్యవస్థను మెరుగుపరిచాడు, దాని పోర్ట్‌ఫోలియోకు అనేక ఆస్తులను జోడించి పాఠశాలల స్థితిగతులను రూపుమార్చాడు.

రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్

[మార్చు]

ఈయన ఆర్బీఐ 14 వ గవర్నర్ గా 1977 డిసెంబరు 1 నుంచి 1982 సెప్టెంబరు 15 మధ్యకాలంలో విధులు నిర్వహించాడు. ఈయన పదవీకాలంలో 1000, 5000, 10,000 విలువ కలిగిన భారతీయ రూపాయి నోట్లు, బంగారు వేలం రద్దుచేసాడు. తరువాతి కాలంలో 1000 రూపాయల నోట్లను తిరిగి మళ్ళీ ప్రవేశపెట్టాడు. ఈయన వడోదరలోని బరోడా మహారాజా సయాజిరావ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెససర్ గా పనిచేశాడు. ఈయనను ఆనాటి ప్రధానమంత్రి పి. వి. నరసింహారావు 1991 లో భారత ఆర్థిక మంత్రి బాధ్యతను స్వీకరించాలని కోరాడు కాని ఈ ప్రతిపాదన ఈయన తిరస్కరించాడు.

పదవులు

[మార్చు]

ఈయన అహ్మదాబాద్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంస్థకు డైరెక్టర్ గా పనిచేశాడు. ఈయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డైరెక్టర్ గా కూడా పనిచేశాడు. ఈయన యూకేలో ఉన్నత విద్యా సంస్థకు నాయకత్వం వహించిన భారతీయ సంతతికి చెందిన మొదటి వ్యక్తిగా నిలిచాడు. మాజీ జర్మన్ ఛాన్సలర్ హెల్ముట్ ష్మిత్ ఏర్పాటు చేసిన "కమిటీ ఆఫ్ ది థర్టీ"లో సెంట్రల్ బ్యాంకర్లు, ఆర్థిక రాజనీతిజ్ఞుల ఉన్న కమిటీలో ఈయన కూడా ఒకరు. ఈయన న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమ ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్‌గా కూడా పనిచేశాడు.

పురస్కారాలు

[మార్చు]

ఈయన ఆర్థిక శాస్త్ర రంగంలో చేసిన కృషికి గాను 1991లో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది.

మూలాలు

[మార్చు]
  1. "Modi and economics". Business Standard. 25 December 2015. Retrieved 23 December 2016.
  2. "Obituary: Dr I.G. Patel". Financial Times. Retrieved 22 November 2019.
  3. "I. G. Patel". Independent.co.uk (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2005-07-19. Archived from the original on 2014-12-03. Retrieved 2019-11-22.