Jump to content

ఐస్ క్రీమ్ (సినిమా)

వికీపీడియా నుండి
ఐస్ క్రీమ్
ఐస్ క్రీమ్ సినిమా పోస్టర్
దర్శకత్వంరామ్ గోపాల్ వర్మ
రచనరామ్ గోపాల్ వర్మ
నిర్మాతతుమ్మలపల్లి సత్యనారాయణ
తారాగణంనవదీప్
తేజస్వి మదివాడ
ఛాయాగ్రహణంఅంజి
కూర్పుప్రతాప్ కుమార్ సంగ
సంగీతంపద్యోతన్
నిర్మాణ
సంస్థ
భీమవరం టాకీస్
విడుదల తేదీ
12 జూలై 2014
సినిమా నిడివి
104 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

ఐస్ క్రీమ్ 2014, జూలై 12న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1][2] భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి సత్యనారాయణ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవదీప్, తేజస్వి మదివాడ జంటగా నటించగా, పద్యోతన్ సంగీతం అందించాడు.[3] ఫ్లోకామ్ సిస్టమ్ టెక్నాలజీతో చిత్రీకరించిన మొట్టమొదటి భారతీయ చిత్రం ఇది. ఐస్ క్రీం తినడం పట్ల మక్కువతో, పీడకల జబ్బుతో బాధపడుతున్న పాత్ర నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.[4]

కథా నేపథ్యం

[మార్చు]

రేణు (తేజస్వి మదివాడ) ఒక ధనవంతురాలైన అమ్మాయి, ఆమె తన బంధువుల వివాహానికి వెళ్ళకుండా ఒక పెద్ద బంగ్లాలో ఒంటరిగా నివసిస్తుంది. తన ఇంటిలోకి దుండగులు వచ్చినట్టు రేణుకి విచిత్రమైన కలలు వస్తాయి. భయపడిన రేణు సహాయం కోసం తన ప్రేమికుడు విశాల్ (నవదీప్) ని పిలుస్తుంది. విశాల్, రేణు ఆ బంగ్లాలో ఆనందంగా ఉంటుంటారు. విశాల్ కూడా రేణుని కొన్నిసార్లు భయపెడుతున్నట్లు నటిస్తాడు, కాని తరువాత ఇంట్లో ఎవరో ఉన్నట్టు అతను కూడా తెలుసుకుంటాడు. వారు పడుకున్న తరువాత ఆ దుండగులు బయటకువస్తారు. వారిద్దరికీ ఏం జరుగుతుందనేది మిగతా కథ.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • రచన, దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ
  • నిర్మాత: తుమ్మలపల్లి సత్యనారాయణ
  • సంగీతం: పద్యోతన్
  • ఛాయాగ్రహణం: అంజి
  • కూర్పు: ప్రతాప్ కుమార్ సంగ
  • నిర్మాణ సంస్థ: భీమవరం టాకీస్

వివరాలు

[మార్చు]

నటి తేజస్వి మదివాడ ఈ చిత్రానికి ప్రధాన నటిగా సంతకం చేసి, "రామ్ గోపాల్ వర్మతో పనిచేయాలన్న కల నిజమైందని, తను కెమెరా పరిమితులు లేకుండా నటించడానికి మీకు అవకాశాలు ఇస్తాడు" అని పేర్కొంది.[5]

సీక్వెల్

[మార్చు]

2014, జూలైలో ఈ చిత్రం విడుదలైన కొద్దిరోజుల తరువాత రామ్ గోపాల్ వర్మ ఐస్ క్రీమ్ 2 పేరుతో సీక్వెల్ చేయబోతున్నట్లు ప్రకటించాడు.[6][7] మృధుల భాస్కర్ ఈ చిత్రానికి ప్రధాన పాత్రకి ఎంపికయింది. జె.డి.చక్రవర్తి మరో ప్రధాన పాత్ర పోషించడానికి సంతకం చేశాడు. సీక్వెల్ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది.[1][8]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Mrudhula Basker roped in for Ram Gopal Varma's Ice Cream 2!". BollywoodLife. Retrieved 13 August 2020.
  2. "RGV-Navdeep's 'Ice cream' to be released on July 4th". IndiaGlitz. Retrieved 13 August 2020.
  3. "2 లక్షల్లో సినిమా.. వర్మ మ్యాజిక్‌! | ఆంధ్రజ్యోతి". andhrajyothy. 25 July 2014. Archived from the original on 25 జూలై 2014. Retrieved 13 ఆగస్టు 2020.
  4. "మంచి ఐడియాతో తీస్తే... 'ఐస్‌క్రీమ్'లా ఆర్థిక లాభాలు!". Sakshi. Retrieved 13 August 2020.
  5. "Working with RGV matters more than a hit film: Tejaswi". Business Standard. Retrieved 13 August 2020.
  6. "Ram Gopal Varma to Soon Start Working on Ice Cream 2". NDTV. Retrieved 13 August 2020.[permanent dead link]
  7. "20 First looks of 'Ice Cream 2' on 21st". IndiaGlitz. Archived from the original on 22 ఆగస్టు 2014. Retrieved 13 August 2020.
  8. "RGV finds his new muse for Ice-Cream 2". Times of India. Retrieved 13 August 2020.

ఇతర లంకెలు

[మార్చు]