ఐశ్వర్య రాయ్ సినిమాలు
![Aishwarya Rai gently smiles at the camera](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/85/Aishwarya_Rai_at_an_event_for_Raavan_%28cropped%29.jpg/220px-Aishwarya_Rai_at_an_event_for_Raavan_%28cropped%29.jpg)
ఐశ్వర్య రాయ్ ప్రముఖ నటి, మోడల్. ఐదు భాషల్లో దాదాపు 40 సినిమాల్లోనటించారు ఆమె. ఎక్కువగా హిందీ, తమిళ్, ఇంగ్లీష్ భాషల్లో సినిమలు చేశారు. 1997లో మణిరత్నం దర్శకత్వంలో తమిళ్ లో ఇరువర్ సినిమాతో తెరంగేట్రం చేశారు ఐశ్వర్య. ఈ సినిమాలో ఆమె ద్విపాత్రాభినయం చేశారు. అదే ఏడాది బాలీవుడ్ లో ఔర్ ప్యార్ హో గయా సినిమాలో నటించారు.[1][2] ఆమె నటించిన జీన్స్(1998) సినిమా పెద్ద హిట్ అవడమే కాక అకడమీ అవార్డులకు వెళ్ళిన మొదటి భారతీయ సినిమాగా రికార్డు సృష్టించింది. ఆ తరువాత సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆమె నటించిన హమ్ దిల్ దే చుకే సనమ్(1999) సినిమా బాలీవుడ్ లో ఆమెకు గుర్తింపునిచ్చింది. ఈ సినిమాలోని నటనకు ఐశ్వర్య ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం కూడా అందుకోవడం విశేషం.[3][4][5] 1999లో సంగీత ప్రధానమైన సినిమా తాళ్ లో నటించారు ఐశ్వర్య ఈ సినిమా కూడా విజయవంతం కావడంతో ఆమె అగ్ర కథానాయికగా మారారు.[6]
2000లో ఐశ్వర్య తమిళ్ లో కందుకొండైన్ కందుకొండైన్, హిందీలో మొహొబ్బతే తో సహా ఆరు సినిమాల్లో నటించారు.[7][8] 2002లో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్, మాధురీ దీక్షిత్ తో కలసి దేవదాస్ సినిమాలో నటించారు ఆమె.[9] ఈ సినిమా భారీ వసూళ్ళు సాధించడమే కాక, ఆమె నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం కూడా అందుకున్నారు.[4][10] 2003లో బెంగాలీలో చోఖెర్ బాలీ సినిమాలో నటించారు ఐశ్వర్య. ఈ సినిమా కూడా హిట్ అయింది.[11][12] అదే ఏడాది ఆమె నటించిన దిల్ కా రిష్తా, కుచ్ నా కహో సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆమె బాలీవుడ్ కెరీర్ కొంత వెనకపట్టింది.[13][14] ఆ తరువాతి ఏడాది జాన్ ఆస్టేన్ నవల ప్రైడ్ అండ్ ప్రెజుడీస్ ను ఇంగ్లీష్ లో బ్రిటిష్ చిత్రం బ్రైడ్ అండ్ ప్రెజుడీస్ సినిమాలో ఎలిజబెత్ బెన్నెట్ పాత్రలో నటించారు ఐశ్వర్య.[15] 2004లోనే అజయ్ దేవగణ్ సరసన రైన్ కోట్ సినిమాలో నటించారు ఆమె సర్బ్ జిత్.[16]
మూలాలు
[మార్చు]- ↑ Warrier, Shobha (3 September 2003). "25 years, 25 landmarks".
- ↑ Roy, Gitanjoli (1 November 2012).
- ↑ "Family values" Archived 2011-10-19 at the Wayback Machine.
- ↑ 4.0 4.1 "Best Actor in a Leading Role (Female) award winners down the years".
- ↑ Sharma, Anu (6 March 2011).
- ↑ "Box Office India report of 1999".
- ↑ Baskaran, S. Theodore (28 May 2000).
- ↑ "Box Office 2000".
- ↑ Chowdhury, Souvik (23 September 2002).
- ↑ "Box Office India report of 2002".
- ↑ Pillai, Shreedhar (13 November 2003).
- ↑ Saha, Sambit (10 January 2004).
- ↑ "Box Office 2003".
- ↑ Sharma, Neha (16 September 2012).
- ↑ Dargis, Manohla (11 February 2005).
- ↑ Verma, Sukanya (24 December 2004).