Jump to content

ఐటీ జాయింట్ యాక్షన్ కమిటీ

వికీపీడియా నుండి

హైదరాబాద్ లో ఐటీయిజం మొదలైంది. వరుస ఉద్యమాలతో అభివృద్ధిలో పదేళ్లు వెనక్కి పోయిన హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్[1] పైనా ఆ ప్రభావం తీవ్రంగా పడడంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగులంతా కలిసి ఐటీయిజాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ బ్రాండ్ వేల్యూ పడిపోవడంతో, ఐటీ రంగ విస్తరణ ఆగిపోవడమే గాక, కొత్తగా పెట్టుబడులు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుస ఉద్యమాలతో ఐటీ ఎగుమతులు సగానికి పైగా పడిపోయాయనేది వారి ఆవేదన. ఏడాదికి 53వేల కోట్ల ఐటీ ఎగుమతులుంటే[2], అది ఇప్పుడు సగానికి పడిపోయింది. దీంతో ఐటీ ఉద్యోగులంతా కలిసి, జేఏసీగా ఏర్పడ్డారు. సేవ్ ఐటీ-సేవ్ హైదరాబాద్ పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించారు[3] రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితిని తొలగించి...ఏదో ఒక నిర్ణయాన్ని వెంటనే తీసుకుని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని జేఏసీ కోరనుంది.

అంతేకాదు... వరుస ఉద్యమాలు, ఆందోళనలతో హైదరాబాద్ ను అతలాకుతలం చేస్తున్న ఉద్యమ కారులను, రాజకీయనేతలను ఐటీ జేఏసీ కలిసి ఇకనైనా గొడవలు ఆపాల్సిందిగా విజ్ఞప్తి చేయనుంది. దేశంలోనే ఐటీ ఉద్యోగులు కలిసి..జేఏసీగా ఏర్పడడం హైదరాబాద్ లోనే మొదటిసారి.