అక్షాంశ రేఖాంశాలు: 16°4′55″N 79°55′26″E / 16.08194°N 79.92389°E / 16.08194; 79.92389

ఏల్చూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఏల్చూరు
పటం
ఏల్చూరు is located in ఆంధ్రప్రదేశ్
ఏల్చూరు
ఏల్చూరు
అక్షాంశ రేఖాంశాలు: 16°4′55″N 79°55′26″E / 16.08194°N 79.92389°E / 16.08194; 79.92389
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల
మండలంసంతమాగులూరు
విస్తీర్ణం27.89 కి.మీ2 (10.77 చ. మై)
జనాభా
 (2011)[1]
8,915
 • జనసాంద్రత320/కి.మీ2 (830/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు4,564
 • స్త్రీలు4,351
 • లింగ నిష్పత్తి953
 • నివాసాలు2,353
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్523302
2011 జనగణన కోడ్590675

ఏల్చూరు బాపట్ల జిల్లా, సంతమాగులూరు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన సంతమాగులూరు నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నరసరావుపేట నుండి 22 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2353 ఇళ్లతో, 8915 జనాభాతో 2789 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4564, ఆడవారి సంఖ్య 4351. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1475 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 255. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590675.[2].నరసరావుపేట నుండి 22 కి. మీ. దూరంలోనూ ఉంది. సమీప గ్రామాలు

గ్రామ చరిత్ర

[మార్చు]

ఇది రామిరెడ్డిపాలెం, ఏల్చూరుల సమూహం. ఏల్చూరు చాలా ప్రాచీనమైన గ్రామం. అన్ని కులాల వారు సామరస్యమముతో మెలిగేవారు. ఈ ఊరిలో "ఏలు" అనే దేవత అనేక ఈతి బాధలు, వ్యాదుల నుండి ఈ గ్రామన్ని రక్షిస్తూ ఈ గ్రామాన్ని ఏలిందని నమ్మకం. ఏలు ఏలిన గ్రామం కనుక ఈ గ్రామానికి ఏలు దేవత పేరు మీదుగా ఏల్చూరు అని పిలిచెడివారు.

గ్రామ భౌగోళికం

[మార్చు]

ఫతేపురం 6 కి.మీ, సజ్జాపురం 6 కి.మీ, కొప్పరం 6 కి.మీ, కొమ్మలపాడు 6 కి.మీ, సంతమాగులూరు 6 కి.మీ, అడవిపాలెం 2 కి.మీ.

జనగణన గణాంకాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2353 ఇళ్లతో, 8915 జనాభాతో 2789 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4564, ఆడవారి సంఖ్య 4351.[3]

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో దేవరపల్లి లక్ష్మారెడ్డి, సర్పంచిగా ఎన్నికైనారు.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, కస్తూరిబాగాంధీ బాలికల పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల సంతమాగులూరులోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల‌లు నరసరావుపేటలోనూ ఉన్నాయి. సమీప మేనేజిమెంటు కళాశాల నరసరావుపేటలోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్‌లు గుంటూరులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల సంతమాగులూరులోను, అనియత విద్యా కేంద్రం నరసరావుపేటలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు

[మార్చు]

ఇది ప్రకాశం జిల్లా ముఖ్యపట్టణం అయిన ఒంగోలు నుండి 75 కి.మీ. దూరంలో అద్దంకి మీదుగా నర్సారావుపేట వెళ్ళే మార్గంలో ఉంది. ఏల్చూరు గ్రామం నుండి 4 కి.మీ. పడమర వైపుకు కారుమంచి ఉంది. ఏల్చూరు, నర్సారావుపేటకు 25 కి.మీ. దూరంలో ఉంది. నార్కెట్‌పల్లి - అద్దంకి - మేదరమెట్ల రహదారి గ్రామం పక్కనే ఉంది.

భూమి వినియోగం

[మార్చు]

ఏల్చూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 196 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 272 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 2 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 17 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 219 హెక్టార్లు
  • బంజరు భూమి: 910 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1172 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 1401 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 900 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

ఏల్చూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 864 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 11 హెక్టార్లు
  • చెరువులు: 25 హెక్టార్లు

వ్యవసాయం

[మార్చు]

వరి, మిరప, ప్రత్తి మొక్కజొన్న, మినుం, పెసలు, కందులు, పొగాకు (కొద్దిపాటి) మొదలగునవి సాగుచేస్తారు. నాగార్జున సాగర్ కాలువ అతి ముఖ్య నీటి వనరు. ఈ నీటి ద్వారా అధిక భాగం వ్యవసాయం జరుగుతుంది. ఇదే కాకుండా గ్రామానికి ఆనుకొని అతి పెద్ద ప్రాచీన నిర్మితమైన చెరువు ఉంది. ఈ చెరువు పరిధిలో ఎల్చురు పొలాలతో పాటుగా క్రింద ఉన్న సజ్జాపురం, కొప్పరం, సంతమగులూరుకు చెందిన కొన్ని పొలాలు కూడా సాగవుతాయి.

ఇతర జీవనోపాధి వనరులు

[మార్చు]

ఈ ఊరిలో కొండలు ఎక్కువగా ఉండటంవలన సగానికి పైగా ప్రజలు దీనినే ఆదరంగా జీవిస్తూన్నారు. బిల్దింగ్ రాళ్ళు, స్లాబ్ కంకర కులీలు ఉన్నారు. ఇక్కడ ఒక క్రషర్ మిల్లు కూడా ఉంది. ఈ కొండలు గ్రానైట్ కి ప్రసిద్ధి. అంతే కాక చెరువులో మత్యసంపద పుస్కలంగా ఉండును.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ కోదండరామస్వామివారి ఆలయం

[మార్చు]

ఏల్చూరు గ్రామంలోని పెద్ద మేడ వద్ద ఉన్న ఈ ఆలయంలోనూ, చిన్న మేడ వద్ద ఉన్న రామాలయంలోనూ, శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం, శ్రీ సీతారాముల కళ్యాణం, కన్నులపండువగా నిర్వహించెదరు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొంటారు.

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి & శ్రీ ప్రసన్నాంజనేయస్వామి ఆలయం

[మార్చు]

ఏల్చూరు గ్రామంలోని కొండ మీద నెలకొన్న శ్రీ ప్రసన్నాంజనేయస్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, భక్తుల కొంగు బంగారంగా పేరొందినారు. ఈ ఆలయంలో 41వ వార్షిక తిరునాళ్ళు, 2014, మార్చి-21న వైభవంగా జరిగినవి. ఫాల్గుణ బహుళ పంచమి తిథి రోజుననే, తోడు స్వామివారల తిరునాళ్ళు కలసి రావడం విశేషం. దీనితో ఆలయాలు భక్తులతో కిటకిటలాడినవి. ప్రసన్నంజనేయస్వామివారికి భక్తులు ఆకుపూజ చేశారు. కొండపైన లక్ష్మీనరసింహస్వామివారికి విశేషపూజలు నిర్వహించారు. ఉత్సవంలో ఏర్పాటు చేసిన విద్యుత్తు ప్రభలు ప్రతేక ఆకర్షణగా నిలిచినవి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నవి. ఈ కార్యక్రమాలకు ఏల్చూరు నుండియేగాక, భక్తులు, చుట్టుప్రక్కల గ్రామాల నుండి గూడా అధికసంఖ్యలో విచ్చేసారు.

శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయాన్ని గ్రామస్తుల సమష్టి సహకారంతో రు.30 లక్షల అంచనా వ్యయంతో పునర్నిర్మించడానికి శ్రీకారం చుట్టినారు. ఈ కార్యక్రమంలో భాగంగా, 2015, మార్చి-12వ తేదీ గురువారం నాడు, శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించి, వేదపండితులు శాస్త్రోక్తంగా క్రతువు నిర్వహించారు.

శ్రీ నీలకంఠేశ్వరస్వామివారి ఆలయం

[మార్చు]

ఈ ఆలయాన్ని చోళులకాలంలో నిర్మించినారని ప్రతీతి. దేవాదాయశాఖ అధీనంలో ఉన్న ఈ ఆలయానికి 19.95 ఎకరాల మాగాణి భూమి మాన్యంగా ఉంది. దీనిలో 10.95 ఎకరాలు ఆలయంలో నిత్య ధూప, దీప, నైవేద్యం, అర్చనలకోసం కేటాయించారు. దీనిమీద వచ్చే ఫలసాయం మాత్రమే వారు అనుభవించేలాగా ఏర్పాటుచేసారు. మిగిలిన 9 ఎకరాల భూమిని కౌలుకు ఇచ్చి, వచ్చే ఆదాయంతో ఆలయ అభివృద్ధి, నిర్వహణ, చేపట్టాలని ఉంది. ప్రతి సంవతస్రం కౌలు ఆదాయం వేల రూపాయలు వచ్చుచున్నా, ఆలయ అభివృద్ధి జరుగలేదు.

ఈ ఆలయంలో స్వామివారి వార్షిక తిరునాళ్ళ మహోత్సవం, 2016, మే-17వ తేదీ మంగళవారంనాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేకపూజలు నిర్వహించారు.భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ తిరునాళ్ళలో ఏర్పాటుచేసిన విద్యుత్తు ప్రభ భక్తులను విశేషంగా ఆకర్షించింది. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు గూడా ఏర్పాటు చేసారు. [10]

శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం

[మార్చు]

ఈ గ్రామంలోని గిలకల బావి సమీపంలో, గ్రామస్థులు, దాతలు సమష్టిగా సమకూర్చిన ముఫ్ఫై లక్షల రూపాయల నిధులతో, ఈ ఆలయ నిర్మాణం జరుగుచున్నది. 2017, మార్చి‌లో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించెదరు. ఈ ఆలయంలో ప్రతిష్ఠించనున్న ఐదు అడుగుల మూల విరాట్టు విగ్రహాన్ని, తిరుమల-తిరుపతి దేవస్థానం అందించుచున్నది.

9వతేదీ గురువారంనాడు, ఈ ఆలయంలో ప్రతిష్ఠించవలసిన స్వామివారి మూలవిరాట్టు తిరుపతి నుండి రాగా, ఆ విగ్రహానికి కన్నులపండువగా గ్రామోత్సవం నిర్వహించారు. ఈ గ్రామోత్సవం, కతూరిబా బాలికల ఉన్నత పాఠశాల సమీపంలో ఆరంభమై, గ్రామమంలోని అన్ని వీధులలోనూ సాగినది. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మేళతాళాల నడుమ మూలవిరాట్టుతోపాటు, ఉత్సవ విగ్రహాలు, కలశాన్ని గూడా ఊరేగించారు. ఈ గ్రామోత్సవంలో భక్తులు, గ్రామస్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ నూతన ఆలయంలో మూల విరాట్టును 2017, మే-12వతేదీ శుక్రవారం ఉదయం 10-40 కి ప్రతిష్ఠించెదరు.

శ్రీ దేశమ్మ అమ్మవారి ఆలయం

[మార్చు]

ఏల్చూరు గ్రామంలో, కొండ సమీపంలో ఉన్న ఈ ఆలయంలో, అమ్మవారి వార్షిక తిరునాళ్ళు, ప్రతి సంవత్సరం, ఉగాది పండుగ నాడు, వైభవంగా నిర్వహించెదరు.

శ్రీ అంకమ్మ తల్లి ఆలయం

[మార్చు]

ఏల్చూరులోని మాబునగర్ లో వెలసిన ఈ అమ్మవారి కొలుపులు, 2015, సెప్టెంబరు-4వ తేదీ శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం

[మార్చు]

ఈ ఆలయంలో స్వామివారి ఆరాధనోత్సవాలు 2016, మే-16వ తేదీ సోమవారం వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆరాధనోత్సవాలు మద్యాహ్నం భారీగా అన్నసమారాధన, సాయంత్రం విద్యుత్తు ప్రభ ఏర్పాటు, రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)

[మార్చు]
  • కుర్థాలం పీఠాధిపతి సిద్దేశ్వరానంద భారతిస్వామి
  • శ్రీ రామకవి. అతని పేరు మీద ఈ ఊరిలో ఒక గ్రంథాలయం ఉంది.
  • ప్రసిద్ధ నయాగారా కవులలో ఒకరైన "ఏసు" (ఏల్చూరి సుబ్రహ్మణ్యం)
  • అందరికి ఆరోగ్యం ఆయుర్వేదం మాస పత్రికా సంపాదకులు ఏల్చూరి.
  • పరుచూరి నంద, ఒక పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఏల్చూరు&oldid=4267230" నుండి వెలికితీశారు