Jump to content

ఏలేశ్వరోపాధ్యాయులు

వికీపీడియా నుండి


ఏలేశ్వరోపాధ్యాయులు సంస్కృతకవి, గొప్ప సంప్రదాయ విద్యా వేత్త.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన శ్రీశైలమునకు పశ్చిమ భాగంలో గల ఏలేశ్వరము అను గ్రామంలో నివసించేవారు. కనుకనే ఇతనికి ఈ పేరు కలిగెను. చిన్నప్పుడే సకలశాస్త్రములు నేర్చి విద్యార్థులకు పాఠములు చెప్ప ఆరంభించినందున ఈయన మొదటిపేరు ఎవరికిని తెలియక పోయెను., ఇతడు పదునాలుగు సంవత్సరముల వయస్సు ఉన్నప్పుడు రాజసభలకు పోయి శాస్త్ర ప్రసంగముచేసి ప్రతిపక్ష సిద్ధాంతములను అణచి స్వసిద్ధాంతమును స్థాపించెను. గౌతమస్మృతికి దర్పణము అనెడు వ్యాఖ్యానమును, తెనుగుదేశమును గురించిన భూగోళశాస్త్రము ఒకటియును ఇతనిచే రచియింపబడెను.

రానురాను యుగధర్మము వ్యాపించి వర్ణసాంకర్యము కలుగుచు ఉండఁగా ఆంధ్ర బ్రాహ్మణులను నాడులచే విభజించి భోజన ప్రతిభోజనములు తప్ప తక్కిన సంబంధబాంధవ్యములు ఆయాయి నాడువారు వారిలోనే జరుపుకొనుచు ఉండునట్లు నియమించెను. నాటినుండి వెలినాడు, వేగినాడు, ములికినాడు, కాసరనాడు, తెలగాణ్యులు అని ఐదు తరగతులు అయెను. (ఈ వెలినాడు, వేగినాడు మొదలగుపేర్లచే నూఱునాడులు విభాగింపఁబడెను అని ఒక చరిత్రకారుఁడు వ్రాసి ఉన్నాఁడు.) అందు వెలినాటివారు వెలనాటివారు అనియు, ములికినాటివారు మురికినాటివారు అనియు ఇప్పుడు పేర్కొనంబడుచు ఉన్నారు.

కాలక్రమమున కొందరు బ్రాహ్మణులు వైదిక వ్యాపారములను వదలి లౌకిక వ్యాపారములయందు ప్రవేశించిరి. వారిని నియోగులు అంటారు. మొట్టమొదట ఆ నియోగుల సంఖ్య ఆఱువేలు అయినందున వారిని ఆఱువేల నియోగులు అంటారు.

నియోగులకును వైదికులకును బాంధవ్యము కలుగనేరదు.

వనరులు

[మార్చు]
  • పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1

మూలాలు

[మార్చు]