Jump to content

ఏలూరి సాంబశివరావు

వికీపీడియా నుండి
ఏలూరి సాంబశివరావు

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014 - ప్రస్తుతం
నియోజకవర్గం పరుచూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 10 జులై 1977
కోనంకి, మార్టూరు మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు నాగేశ్వరరావు
జీవిత భాగస్వామి మాలతీ
సంతానం ఏలూరి దివ్యేష్‌[1]
వెబ్‌సైటు [1]

ఏలూరి సాంబశివరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పరుచూరు నియోజకవర్గం నుండి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

ఏలూరి సాంబశివరావు 1977 జులై 10న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, మార్టూరు మండలం, కోనంకి గ్రామంలో జన్మించాడు.[2]

క్లాస్ స్కూల్ / కాలేజీ ప్రదేశం సంవత్సరం
1 – 10వ తరగతి ఆంధ్రప్రదేశ్ రెసిడెన్సియల్ స్కూల్ గణపవరం 1992
ఇంటర్మీడియట్ వి.వి.ఎం కాలేజీ ఒంగోలు 1994
బీఎస్సీ ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్, హైదరాబాద్ 2000
ఎంఎస్సీ ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్, హైదరాబాద్ 2003

రాజకీయ జీవితం

[మార్చు]

ఏలూరి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరుచూరు నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గొట్టిపాటి భరత్‌పై 10,775 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3] ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరుచూరు నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పై 1647 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4] ఏలూరి సాంబశివరావు గుంటూరు జిల్లా బాపట్ల పార్లమెంటు టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా నియమితుడై, 2020 నవంబర్ 10న ప్రమాణస్వీకారం చేశాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. Prajasakti (25 December 2021). "ఏలూరి దివ్యేష్‌కి గ్లోబల్‌ ఫేమ్‌ అవార్డు". Archived from the original on 8 February 2022. Retrieved 8 February 2022.
  2. Eenadu (2020). "తెదేపా కొత్త సారథులొచ్చారు" (in ఇంగ్లీష్). Archived from the original on 8 February 2022. Retrieved 8 February 2022.
  3. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  4. Sakshi (2019). "2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల జాబితా". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  5. TV5 News (10 November 2020). "టీడీపీ బాపట్ల పార్లమెంట్ ఇన్‌చార్జ్‌గా సాంబశివరావు ప్రమాణస్వీకారం" (in ఇంగ్లీష్). Archived from the original on 8 February 2022. Retrieved 8 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)