Jump to content

ఏబీసీడీ (అమెరిక్ బోర్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశి)

వికీపీడియా నుండి
ఏబీసీడీ (అమెరిక్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశి)
దర్శకత్వంసంజీవ్ రెడ్డి
నిర్మాతమధుర శ్రీధర్ రెడ్డి
యాష్ రంగినేని
తారాగణంఅల్లు శిరీష్
రుక్సార్ ధిల్లన్
ఛాయాగ్రహణంరామ్ రెడ్డి
కూర్పునవీన్ నూలి
సంగీతంజుడా శాండీ
నిర్మాణ
సంస్థ
మధుర ఎంటర్టైన్మెంట్
పంపిణీదార్లుబిగ్ బెన్ సినిమాస్
విడుదల తేదీ
17 మే 2019 (2019-05-17)
దేశం భారతదేశం
భాషతెలుగు

ఏబీసీడీ (అమెరిక్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశి) 2019లో విడుదలైన తెలుగు సినిమా. మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ బ్యానర్స్ పై మధుర శ్రీధర్‌ రెడ్డి, యష్‌ రంగినేని నిర్మించిన ఈ చిత్రానికి సంజీవ్‌ రెడ్డి దర్శకత్వం వహించాడు. అల్లు శిరీష్, రుక్సార్ ధిల్లన్, భ‌ర‌త్‌, రాజా చెంబోలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2019 మే 17న విడుదలైంది.[1]

చిత్ర నిర్మాణం

[మార్చు]

ఈ సినిమా షూటింగ్ 2018 జూన్ 18న ప్రారంభమైంది.[2] ఈ చిత్రంలోని మెల్ల మెల్లగా సాంగ్‌ను 2019 ఫిబ్రవరిన, ఏప్రిల్ 15న విడుదల చేసి, సినిమాను 2019 మే 17న విడుదల చేశారు.

అర‌వింద ప్ర‌సాద్‌ (అల్లు శిరీష్‌) న్యూయార్క్‌లో సెటిల్‌ అయిన మిలియనీర్‌ విద్యా ప్రసాద్‌ (నాగబాబు ) కొడుకు. డబ్బు విలువ ఏమాత్రం తెలియకుండా పెరిగిన అవి (అల్లు శిరీష్) విదేశాల్లో విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాడు. అతనిని ఎలాగైనా మార్చాల్సిందేనని నిర్ణయించుకున్న అతని తండ్రి నాగబాబు, అవి, అతని స్నేహితుడు (మాస్టర్ భరత్) ను హైదరాబాద్ లో ఎంబీఏ కాలేజ్‌లో జాయిన్ చేయిస్తాడు. అవికి నేహ‌ (రుక్స‌ర్ థిల్లాన్‌) ప‌రిచ‌యం అవుతుంది. హైదరాబాద్‌లో అవికి లోకల్ పొలిటీషన్‌ భార్గవ్‌తో గొడవ అవుతుంది. అవి, భార్గవ్‌ల మధ్య గొడవకు కారణం ఏంటి..? అత‌నికి డ‌బ్బు విలువ ఎలా ఎప్పుడు తెలిసింది? అవి తండ్రి అవికి డబ్బు విలువ తెలిసేలా చేయగలిగాడా? చివరికి ఏం జరిగింది? అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్‌: మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్‌, బిగ్‌ బెన్‌ సినిమా
  • నిర్మాతలు: యష్‌ రంగినేని, మధుర శ్రీధర్‌ రెడ్డి
  • దర్శకత్వం: సంజీవ్‌ రెడ్డి
  • సంభాషణలు: కళ్యాణ్‌ రాఘవ్‌
  • సంగీతం: జుడా శాండీ
  • ఛాయాగ్రహణం: రామ్‌

మూలాలు

[మార్చు]
  1. Mana Telangana (16 April 2019). "సినిమాను ప్రేమించే వాళ్లు ఎక్కువ చిత్రాలు చేయాలి". Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News. Archived from the original on 30 జూన్ 2021. Retrieved 30 June 2021.
  2. Sakshi (19 June 2018). "ఏబీసీడీలకు వేళాయె". Sakshi. Archived from the original on 30 జూన్ 2021. Retrieved 30 June 2021.
  3. Sakshi (17 May 2019). "'ఏబీసీడీ' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 30 జూన్ 2021. Retrieved 30 June 2021.