ఏప్రిల్ 28 ఏం జరిగింది
ఏప్రిల్ 28 ఏం జరిగింది | |
---|---|
దర్శకత్వం | వీరాస్వామి |
స్క్రీన్ ప్లే | వీరాస్వామి |
నిర్మాత | వీరాస్వామి |
తారాగణం | రంజిత్ షెర్రీ అగర్వాల్ తనికెళ్ళ భరణి రాజీవ్ కనకాల |
ఛాయాగ్రహణం | సునీల్ కుమార్ |
కూర్పు | సంతోష్ |
సంగీతం | సందీప్ కుమార్ |
నిర్మాణ సంస్థ | వి.జి. ఎంటర్‌టైన్‌మెంట్ |
విడుదల తేదీ | 27 ఫిబ్రవరి 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఏప్రిల్ 28 ఏం జరిగింది 2021లో తెలుగులో విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా.[1] వి.జి. ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వీరాస్వామి నిర్మించి దర్శకత్వం వహించాడు.[2] రంజిత్, షెర్రీ అగర్వాల్,తనికెళ్ళ భరణి, రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 27న విడుదలైంది.[3]
కథ
[మార్చు]విహారి (రంజిత్) సినిమాలకు రచయితగా పని చేస్తుంటాడు. ఓ సినిమా ఫ్లాపు తర్వాత నిర్మాత (తనికెళ్ళ భరణి)ఒత్తిడితో మంచి ఐడియా కోసం భార్య ప్రవల్లిక (షెర్రీ అగర్వాల్)తో కలిసి సిరిపురం అనే ఊరిలోని ఓ గెస్ట్ హౌస్‌కి వెళ్తాడు. కానీ అందులో ఉన్న కొన్ని ఆత్మలు రంజిత్ తో ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉంటాయి. ఆ తర్వాత అక్కడ కొన్ని అనూహ్య పరిణామాలు జరుగుతాయి. విహారికి స్నేహితుడు ఎస్ఐ డేవిడ్(అజయ్)తో పాటు ఈ ఫ్యామిలీ మొత్తం విస్తుపోయే నిజాలు తెలుస్తాయి. ఆ ఇంట్లో ఉన్న ఆత్మలు ఎవరివి? ఆ తరువాత ఏం జరిగింది? అనేదే మిగతా సినిమా కథ.[4]
నటీనటులు
[మార్చు]- రంజిత్
- షేర్లీ అగర్వాల్
- అజయ్
- తనికెళ్ళ భరణి
- రాజీవ్ కనకాల
- చమ్మక్ చంద్ర
- తోటపల్లి మధు
- జబర్ధస్త్ దీవెన
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: వీజీ ఎంటర్‌టైన్మెంట్
- నిర్మాత: వీరాస్వామి
- కథ, దర్శకత్వం: వీరాస్వామి
- స్క్రీన్‌ప్లే: హరి ప్రసాద్ జక్కా
- సంగీతం: సందీప్ కుమార్
- సినిమాటోగ్రఫీ: సునీల్ కుమార్
- ఎడిటర్: సంతోష్
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (9 February 2021). "ఏప్రిల్ 28న 'ఏం జరిగింది..?'". Retrieved 8 June 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ Telangana Today (21 January 2021). "'April 28 Em Jarigindi' to hit screens". Retrieved 8 June 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ Eenadu (20 February 2021). "'ఏప్రిల్ 28 ఏం జరిగింది' అందరినీ అలరిస్తుంది". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.
- ↑ Sakshi (27 February 2021). "'ఏప్రిల్ 28 ఏం జరిగింది' మూవీ రివ్యూ". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.