Jump to content

ఏడాకుల చెట్టు

వికీపీడియా నుండి

ఏడాకుల చెట్టు
Indian Devil tree (Alstonia scholaris)
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Tribe:
Subtribe:
Genus:
Alstonia

Species

See text.

ఏడాకుల చెట్టు అనే ఈ సొగసైన సతతహరిత వృక్షం భారతదేశం యొక్క చాలా భాగాలలో కనిపిస్తుంది. దీని వృక్ష శాస్త్రీయ నామం ఆల్స్టోనియా స్కాలరీస్. ఎడిన్బర్గ్ కు చెందిన ప్రముఖ వృక్ష శాస్త్రజ్ఞుడు, ప్రొఫెసర్ సి. ఆల్స్టన్ (1685-1760) జ్ఞాపకార్ధం ఈ వృక్షానికి ఈ పేరు పెట్టారు. ఈ జాతుల పేరు స్కాలరీస్, స్కాలరీస్ అనగా పండితుడు, ఈ స్కాలరీస్ పేరు ఎలా వచ్చిందంటే, పాఠశాల పిల్లలకు అవసరమయిన చెక్క పలకలను తయారు చేసేందుకు ఈ చెట్టు కలపను ఉపయోగించేవారు. ఆంగ్లంలో దీనిని డెవిల్ ట్రీ అంటారు, డెవిల్ ట్రీ అనగా దయ్యం చెట్టు, ఈ చెట్లపై దయ్యాలు నివాసముంటాయనే పుకార్లతో ఈ చెట్టు దయ్యం చెట్టుగా ప్రాచుర్యం పొందింది. అక్టోబరులో ఈ చెట్టు చిన్నని, ఆకుపచ్చని, సువాసన కలిగిన పుష్పాలను పుష్పిస్తుంది. ఈ చెట్టు యొక్క అన్ని భాగాలు విషపూరితమైనవిగా పరిగణిస్తారు. ఈ పొడవైన సొగసైన వృక్షం కఠినమైన బూడిదరంగు బెరడును కలిగివుంటుంది. ఈ చెట్టు యొక్క కొమ్మలు వలయంగా,, అలాగే ఆకులు ఒకే చోట అనేకం వస్తాయి. ఈ ఆకులు కొంచెం గుండ్రంగా, తోలు వలె ముదురు ఆకుపచ్చగా ఒక్కొక్క గుచ్ఛానికి 4 నుంచి 7 ఉంటాయి, దాదాపుగా ఒక్కొక్కొక గుచ్ఛానికి ఏడు ఆకులే ఉంటాయి, అందువలనే ఈ చెట్టును ఏడాకుల చెట్టు అని, హిందీలో సప్తపర్ణి అని అంటారు. ఈ చెట్టు చెక్క చాలా మృదువైనది, ఏదైనా తయారు చేయడానికి అనువైనది, కాబట్టి, ఈ చెక్కను సాధారణంగా ప్యాకింగ్ బాక్సుల, నల్లబల్లల తయారీలో ఉపయోగిస్తారు. ఈ చెట్టు బెరడును డీటా బార్క్ అంటారు, ఈ బెరడును అతిసారము, జ్వరం చికిత్సకు సంప్రదాయ ఔషధంగా ఉపయోగిస్తారు. దయ్యం చెట్టుగా పేరు పొందిన ఈ చెట్టు కింద కూర్చునేందుకు లేదా సేదతీరేందుకు పశ్చిమ కనుమల్లోని గిరిజన ప్రజలు అయిష్టత వ్యక్తం చేస్తారు, అక్కడ దయ్యముంటుందని భయపడతారు.