Jump to content

ఏక్ షామ్ చార్మినార్ కే నామ్

వికీపీడియా నుండి
ఏక్ షామ్ చార్మినార్ కే నామ్
ప్రదేశం
ప్రదేశంచార్మినార్, హైదరాబాద్
చార్మినార్

ఏక్‌ షామ్‌ చార్మినార్‌ కే నామ్‌ హైదరాబాద్ నగర ప్రజలకు ఆహ్లాదం కలిగించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఆదివారం చార్మినార్‌ వద్ద నిర్వహిస్తున్న కార్యక్రమం. ట్యాంక్‌బండ్‌ పై ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న సండే ఫన్ డేకు సందర్శకుల నుండి ఆదరణ లభించడంతో చార్మినార్‌ వద్ద కూడా సన్‌డే ఫన్‌డే నిర్వహించాలని విజ్ఞప్తులు రావడంతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ సూచనలతో 2021 అక్టోబరు 17న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.[1][2]

ప్రస్తానం

[మార్చు]

ట్యాంక్‌బండ్‌ పై ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న సండే ఫన్ డేకు సందర్శకుల నుండి ఆదరణ లభించడంతో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చార్మినార్లో కూడా సండే ఫన్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాగుంటుంది అనే విషయాన్ని ట్విట్టర్ ద్వారా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి ట్యాగ్ చేసి ట్వీట్ చేశాడు.[3][4] దీనికి స్పందించిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ 2021 అక్టోబరు 14న, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్‌ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్, నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, సంబంధిత అధికారులతో కలిసి చార్మినార్లో పర్యటించి చార్మినార్ నలువైపులా ఇప్పటికే ఏర్పాటు చేసిన గ్రానైట్ రోడ్డులో కార్యక్రమాన్ని నిర్వహిస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందనే విషయాన్ని అధికారుల బృందం తేల్చి అక్టోబరు 17వ తేదీన సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.[5][6]

మొదటి రోజు కార్యక్రమం సందర్భంగా నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో పని చేసే పోలీస్ బ్యాండ్ ప్రదర్శన, ద‌క్కనీ మ‌జాహియా ముషారియా, ఖవ్వాలీ తదితర సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. చార్మినార్ లో వారం విడిచి వారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అధికారులు ఏర్పాటు చేశారు.[7]

ట్రాఫిక్‌ మల్లింపు, పార్కింగ్ ఏర్పాటు

[మార్చు]

ఏక్ షామ్ చార్మినార్ కే నామ్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చే సందర్శకుల సౌకర్యార్థం చార్మినార్ పరిసరాలలో ఉచిత పార్కింగ్ సౌకర్యాన్ని పోలీసులు ఏర్పాటు చేశారు. ఉత్తర మూసి నది ప్రాంతాల నుంచి పాతబస్తీకి వచ్చే వాహనదారులు వాహనాలను ఖుడా స్టేడియం, పత్తర్ గట్టి లోని ఎస్ వై జే కాంప్లెక్స్, కోట్ల అలీజా లోని ముఫిదుల్లా నామ్ పాఠశాల ప్రాంగణం, జిహెచ్ఎంసి చార్మినార్ సర్దార్ మహాల్ భవనం ప్రాంగణం, చార్మినార్ యునాని ఆసుపత్రి ప్రాంగణం, చార్మినార్ పాత బస్టాండ్ ఖాళీ స్థలం, మోతీగల్లి లోని ఓల్డ్ పెన్షన్ పేమెంట్ కార్యాలయ ప్రాంగణంలలో వాహనదారుల సౌకర్యార్థం ఉచిత పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.[8]

అఫ్జల్‌గంజ్, నయాపూల్‌ నుంచి వచ్చే సందర్శకులు తమ వాహనాలను సర్దార్‌ మహల్‌లోని జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌ లోపల, కోట్ల అలీజాలోని ముఫీద్‌ ఉల్‌ ఆనం బాయ్స్‌ హై స్కూల్‌లో, ముర్గీ చౌక్, శాలిబండ నుంచి వచ్చే సందర్శకులు తమ వాహనాలను మోతీగల్లీ పెన్షన్‌ ఆఫీస్, ఉర్దూ మస్కాన్‌ ఆడిటోరియం, ఖిల్వత్‌ గ్రౌండ్స్, చార్మినార్‌ సమీపంలోని ఏయూ హాస్పిటల్, చార్మినార్‌ బస్‌ టెర్మినల్‌ ఇన్‌ గేట్‌ వద్ద, మదీనా, పురానాపూల్, గోషామహల్‌ నుంచి వచ్చే సందర్శకులు తమ వాహనాలను కులీ కుతుబ్‌ షా స్టేడియం, సిటీ కాలేజ్, ఎంజే బ్రిడ్జి వద్ద పార్క్‌ చేసుకోవాలి.[9]

ట్రాఫిక్‌ మళ్లింపులు

అఫ్జల్‌గంజ్, మదీనా నుంచి వచ్చే వాహనాలను గుల్జార్‌ హౌస్‌ నుంచి మేతీ కా షేర్, కాలీకమాన్, ఏతిబజార్‌ వైపు... ఫలక్‌నుమా, హిమ్మత్‌పురా వైపు నుంచి వచ్చే వాటిని పంచ్‌మొహల్లా నుంచి షా ఫంక్షన్‌ హాల్, మొఘల్‌పురా ఫైర్‌ స్టేషన్‌ రోడ్, బీబీ బజార్‌ వైపు మళ్లిస్తారు. బీబీ బజార్, మొఘల్‌పురా వాటర్‌ ట్యాంక్, హఫీజ్‌ ధన్కా మాస్క్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను సర్దార్‌ మహల్‌ నుంచి కోట్ల అలీజా, ఏతీ బజార్‌ చౌక్‌ వైపు ... ముసాబౌలి, ముర్గీ చౌక్, ఘాన్సీ బజార్‌ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను లాడ్‌ బజార్, మోతీగల్లీల వద్ద నుంచి ఖిల్వత్‌ రోడ్‌లోకి మళ్లిస్తారు.[10]

రవాణా సౌకర్యం

[మార్చు]

ఏక్‌ షామ్‌ చార్మినార్‌ కే నామ్‌కు వచ్చే వారి కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుండి చార్మినార్ వరకు ఆర్టీసీ 337 బస్‌ ట్రిప్పులను మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 వరకు స్పెషల్‌ సర్వీసులు నడుపుతోంది. చాంద్రాయణ గుట్ట నుంచి సుచిత్ర, బార్కస్‌ - సికింద్రాబాద్‌ (2సి), ఉప్పుగూడ- సికింద్రాబాద్‌, చార్మినార్‌- ఈసీఐల్‌ ఎక్స్‌రోడ్‌, జేపీ దర్గా, గోల్కొండ, నార్సింగ్‌, సికింద్రాబాద్‌, బోరబండ, గండిమైసమ్మ, అఫ్జల్‌గంజ్‌ నుంచి ఉప్పల్‌ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.[11]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (17 October 2021). "చార్మినార్‌ వద్ద ఉత్సాహంగా ప్రారంభమైన 'ఏక్‌ షామ్‌ చార్మినార్‌ కే నామ్‌'". Archived from the original on 18 October 2021. Retrieved 18 October 2021.
  2. ETV Bharat News (17 October 2021). "సందడికి వేళైంది.. 'ఏక్‌ షామ్‌ చార్మినార్‌ కే నామ్‌' మొదలైంది.!". Archived from the original on 18 October 2021. Retrieved 18 October 2021.
  3. Sakshi (12 October 2021). "చారిత్రక వేదిక.. సరదాల వేడుక: అసదుద్దీన్‌కు కేటీఆర్‌ సూచన". Archived from the original on 18 October 2021. Retrieved 18 October 2021.
  4. Andrajyothy (14 October 2021). "ఇక చార్మినార్‌ వద్ద కూడా ' సండే ఫన్‌ డే'". Archived from the original on 18 October 2021. Retrieved 18 October 2021.
  5. Andrajyothy (15 October 2021). "త్వరలో 'ఏక్‌ షామ్‌ చార్మినార్‌ కే నామ్‌'". Archived from the original on 18 October 2021. Retrieved 18 October 2021.
  6. Sakshi (16 October 2021). "చార్మినార్‌ చెంతా 'సండే– ఫన్‌డే' సందడి". Archived from the original on 18 October 2021. Retrieved 18 October 2021.
  7. TeluguTV9 Telugu (17 October 2021). "సండే ఫన్‌డేకు ఏర్పాట్లు పూర్తి.. చార్మినార్‌ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు." Archived from the original on 18 October 2021. Retrieved 18 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  8. Namasthe Telangana (16 October 2021). "ఏక్‌ షామ్‌ చార్మినార్‌కే నామ్‌." Archived from the original on 18 October 2021. Retrieved 18 October 2021.
  9. TV9 Telugu (17 October 2021). "ఏక్ షామ్-చార్మినార్ కే నామ్‌కు సర్వం సిద్ధం.. ఇక పై పాతబస్తీలో సందడే సందడి." Archived from the original on 18 October 2021. Retrieved 18 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  10. Sakshi (17 October 2021). "ఏక్‌ షామ్‌.. చార్మినార్‌కే నామ్‌.. ట్రాఫిక్‌ మళ్లింపులు ఇలా." Archived from the original on 18 October 2021. Retrieved 18 October 2021.
  11. Andrajyothy (18 October 2021). "సందడిగా 'ఏక్‌ షామ్‌ చార్మినార్‌కే నామ్‌'.. సరికొత్త అనుభూతి..." Archived from the original on 18 అక్టోబరు 2021. Retrieved 18 October 2021.