ఏకాదశి (పుస్తకం)
స్వరూపం
(ఏకాదశి(పుస్తకం) నుండి దారిమార్పు చెందింది)
ఏకాదశి | |
కృతికర్త: | చింతా దీక్షితులు |
---|---|
అంకితం: | శివశంకరశాస్త్రి |
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | కథాసంపుటి |
విభాగం (కళా ప్రక్రియ): | తెలుగు సాహిత్యం |
ప్రచురణ: | సాహితీసమితి తెనాలి |
విడుదల: | 1925 |
పేజీలు: | 158 |
చింతా దీక్షితులు(1891-1960) వ్రాసిన కథల సంపుటి ఈ పుస్తకం.[1] దీనిలో 11 కథలున్నాయి. 1925లో తెనాలి సాహితీసమితి ఈ పుస్తకాన్ని ప్రచురించింది. తల్లావఝల శివశంకరశాస్త్రికి ఈ పుస్తకాన్ని అంకితం చేయబడింది. ఈ పుస్తకానికి ఆముఖము పేరుతో శివశంకరశాస్త్రి పీఠిక వ్రాశాడు.
కథలు
[మార్చు]- శ్యామల (1920)
- ముద్దు (1920)
- మా అబ్బాయి (1920)
- వరూధిని (1924)
- కవిరాయుడు:మహారాజు(1924)
- "సాహితి"కి కథ(1921)
- పాఠము(1921)
- ఎన్నో చేస్తాను(1921)
- మన్మథసందర్శనము(1921) - ఈ కథ హాస్య కథలు పుస్తకంలో కూడా ప్రచురితమైంది.
- గాలిపాటు(1920)
- చెంచుదంపతులు
అభిప్రాయం
[మార్చు]శివశంకరశాస్త్రి పీఠికలో ఇలా తన అభిప్రాయం చెప్తున్నాడు.
ఈ కథలలో నానాత్వము, చమత్కారిత్వమూ కనబడుతున్నవి. మన కథ, కథానకము, ఆఖ్యానకము, ఆఖ్యాయికి అనే విభాగాలకూ ఇంగ్లీషులో Story, Tale, Sketch అనే విభాగాలకూ ఇంచుమించుగా సరిపోయేలాగున వుంటవి దీక్షితులుగారి కథలు. కథా లక్షణాలు వుండడం చేత ఈ సంపుటిలో చేరింది వరూధిని.