Jump to content

ఏంజెల్ జలపాతం

అక్షాంశ రేఖాంశాలు: 5°58′03″N 62°32′08″W / 5.96750°N 62.53556°W / 5.96750; -62.53556
వికీపీడియా నుండి
ఏంజెల్ జలపాతం
Salto Ángel
Kerepakupai Vená
Angel Falls, Bolívar State, Venezuela
ఏంజెల్ జలపాతం is located in Venezuela
ఏంజెల్ జలపాతం
Location in Venezuela
ప్రదేశంAuyán-tepui, Canaima National Park, Bolívar State, Venezuela
అక్షాంశరేఖాంశాలు5°58′03″N 62°32′08″W / 5.96750°N 62.53556°W / 5.96750; -62.53556
రకంPlunges
మొత్తం ఎత్తు979 మీ. (3,212 అ.)
బిందువుల సంఖ్య2
పొడవైన బిందువు807 మీ. (2,648 అ.)
ప్రపంచములో ఎత్తువారిగా ర్యాంక్1st[1]

ఏంజెల్ జలపాతం (పెమోన్ భాషలో "కెరెపాకుపై మేరు" అంటే "లోతైన ప్రదేశంతో ఉన్న జలపాతం", లేదా పరాకుపే వేనా, అంటే "ఎత్తైన ప్రదేశం నుండి పడటం") వెనిజులాలోని ఒక జలపాతం . అది ప్రపంచంలో అత్యంత ఎత్తైన జలపాతం, 979 మీ. (3,212 అ.) ఎత్తు కలిగి, 807 మీ. (2,648 అ.) లోతు దూకేటటు వంటిది. ఆ జలపాతం కనైమా నేషనల్ పార్క్ (స్పానిష్: Parque Nacional Canaima) లోని ఔయాన్టెపుయ్ పర్వతపు అంచుల నుండి క్రిందకు పడుతుంది. ఇది వెనిజులా లోని బోలివార్ రాష్ట్రంలోని గ్రాణ్ సబానా ప్రాంతంలో ఉన్న ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్.

ఆ జలపాతం ఎత్తు ఎంత ఎక్కువంటే, అది నేలకు చేరకముందే, నీటిలో ఎక్కువ భాగంఆవిరైపోయి లేక ఒక పలుచని పొగమంచువలె బలమైన గాలుల ద్వారా వీస్తుంది. ఆ జలపాతం క్రింది భాగం కెరెప్ నదికి నీరు అందించగా ఆ నీరు కరోవా నది యొక్క ఉపనది అయిన చురుణ్ నదిలోకి ప్రవహిస్తుంది.

ఎత్తైన ఆకారం 979 మీ. (3,212 అ.)లో ముఖ్య భాగమైన జలపాతం ఉన్నా కూడా అది నీరు దుమికే స్థలానికి దిగువలో ఉన్న దాదాపు 400 మీ. (0.25 మై.) లోని జారుడు ప్రవాహాలు, వేగవంతమైన ప్రవాహాలు, ఒక 30 మీ. (98 అ.) టాలుస్ వేగవంతమైన ప్రవాహాలు ఉంటాయి.

చరిత్ర

[మార్చు]

వ్యుత్పత్తి శాస్త్రం

[మార్చు]

ఇరవయ్యో శతాబ్దములో ఈ జలపాతం "ఏంజెల్ ఫాల్స్" అనే పేరుతో పిలవబడింది. జిమ్మీ ఏంజెల్ అనే ఒక అమెరికా దేశ ఏవియేటర్ తొలి సారిగా ఈ జలపాతం మీదగా ఒక విమానం నడిపాడు. అతని పేరు మీద ఈ జలపాతానికి ఏంజెల్ ఫాల్స్ అని పేరు పెట్టడం జరిగింది.[2]

ఏంజెల్ యొక్క చితాభస్మాన్ని 1960 జూలై 2 జలపాతం మీదుగా అతని భార్య, కుమారులు, స్నేహితులు చల్లారు. [3]

సాల్టో ఏంజెల్ అనే సాధారణ స్పానిష్ పేరు, ఇది అతని ఇంటిపేరు నుండి వచ్చింది. 2009 లో వెనుజులా అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్ దేశంలోని అత్యంత ప్రసిద్ధమైన మైలురాయి అయిన ఈ ప్రదేశానికి స్వదేశీయుడి పేరు ఉండాలనే కారణంతో స్వదేశీ పదమైన "పెమోన్" అని పేరు పెట్టాలనే తన ఉద్దేశ్యాన్ని ప్రకటించాడు. దీని అర్థం "లోతైన ప్రదేశం గల జలపాతం" [4] పేరు మార్పును వివరిస్తూ ఛావెజ్, "ఇది మాది, ఏంజెల్ అక్కడికి రాకముందే ....... ఇది స్వదేశీ భూమి" అని చెప్పినట్లు తెలిసింది. [5] ఏదేమైనా అతను తరువాత పేరు మార్పును సవాలు చేయనని, కానీ "కేరెపాకుపై వేనే" పేరు వాడకాన్ని మాత్రమే సమర్థిస్తున్నట్లు చెప్పాడు. [6]

అన్వేషణ

[మార్చు]
వర్షాపాతం లేని ఋతువులో ఏంజల్ జలపాతం.

సర్ వాల్టర్ రాలే ఒక టేపుయ్ (టేబుల్ టాప్ పర్వతం) ని గూర్చి వివరించి ఉండవచ్చు. ఆయనే ఏంజెల్ ఫాల్స్‌ను చూసిన తొలి ఐరోపా వాసి అని కూడా చెప్పబడుతుంది. కాని ఇది నిజానికి ఇది చాలా సత్య దూరం.[7] జలపాతాన్ని సందర్శించిన తొలి ఐరోపావాసి ఫెర్నాండో దే బెర్రియో అని కొందరు చరిత్రకారులు చెపుతున్నారు. అతను స్పెయిన్‌కు చెందిన 16వ, 17వ శతాబ్దాల నాటి అన్వేషకుడు, గవర్నర్.[8] తరువాత, వాస్తవానికి ఈ జలపాతాన్ని 1912లో ఎర్నెస్టో సాన్చేజ్ లా క్రూజ్ అనే వెనిజూలా అన్వేషకుడు చూశాడు. కాని అతను ఆ సంగతిని ప్రచురించలేదు.

1933 నవంబరు 16న అమెరికా విమాన చోదకుడు జిమ్మీ ఏంజెల్, విలువైన ఖనిజాల కొరకు అన్వేషిస్తున్నపపుడు ఈ జలపాతం పై నుండి విమానంలో వెళ్ళే వరకు ఇది బయట ప్రపంచానికి తెలియదు.[9][10]

1937 అక్టోబరు 9 న తిరిగి వస్తున్నప్పుడు, మెటల్ ఎయిర్ క్రాఫ్టు కార్పరేషన్ ఫ్లమింగో వారి మోనోప్లేన్ ఎల్ రియో కరోని; ని ఆయన తెపుయి (టేబుల్ టాప్ పర్వతం) పైన దింపడానికి ప్రయత్నించాడు. కాని ఆ చిత్తడినేలలో విమాన చక్రాలు దిగబడి చెడిపోయాయి. తరువాత అతను, అతనితో పాటు ఉన్న ముగ్గురు, అతని భార్యతో సహా, నడుచుకుంటూ తెపుయి నుంచి దిగవలసివచ్చింది. తిరిగి జనాల మధ్య రావడానికి వారికి 11 రోజులు పట్టింది కాని వారి సాహస వార్త వేగంగా వ్యాపించి, ఆ జలపాతానికి అతని గౌరవార్ధం, ఏంజెల్ ఫాల్స్ అనే పేరు పెట్టబడింది.

కార్డోనా ఇచ్చిన ఆదేశాలను అనుసరించి, అమెరికన్ ఏవియేటర్ జిమ్మీ ఏంజెల్ ఒక విలువైన ధాతువు మంచం కోసం వెతుకుతున్నప్పుడు 16 నవంబర్ 1933 న విమానంలో వారిపైకి వెళ్లే వరకు వారు బయటి ప్రపంచానికి తెలియదు. [11] [12] [13]

ఏంజెల్ వదిలి వేసిన విమానం తెపుయి పైనే 33 ఏళ్ళు ఉండిపోయింది. తరువాత హెలికాప్టర్ సహాయంతో దానిని తొలగించారు. ఆ విమానం మారకేలోని ఏవియేషన్ మ్యూజియంలో పెట్టబడింది. ప్రస్తుతం అది సియుడాడ్ బోలివర్ విమానాశ్రయం ముందు బయట ప్రదర్శించబడుతుంది.

ఏంజెల్ జలపాతం వైమానిక దృశ్యం

ఈ జలపాతానికి నీళ్ళు అందించే నదిని చేరుకున్న తొలి పాశ్చాత్య దేశస్తుడు, అలేక్సండ్ర్స్ లైమే అనే లాత్వియా అన్వేషకుడు. స్థానిక పెమోన్ జాతి వారు ఇతన్ని అలెజాండ్రో లైమేగా కూడా పిలుస్తారు. అతను ఆయన్-టెపుయిని 1955లో ఎక్కాడు. అదే సమయంలోనే అతను ఏంజెల్ విమానాన్ని కూడా చేరుకున్నాడు. అది విమానం కూలిన 18 సంవత్సరాల తరువాత జరిగింది. అతను జలపాతానికి నీరు అందించే ఆ నదికి గావ్జా అనే ఒక లాట్వియాలోని నది పేరు పెట్టాడు. కాని పెమోన్ వారి పేరైన కేరేప్ ఇప్పటికి ఎక్కువగా వాడబడుతుంది.

చురున్ నది నుంచి జలపాతానికి వెళ్ళే దారిని కనిపెట్టిన తొలి వ్యక్తి కూడా లైమే నే. ఆ దారిలోనే, జలపాతాన్ని ఫోటోలు తీయడానికి వీలుగా ఉండే ఒక స్థలం ఉంది. దానికి పేరు మిరడోర్ లైమే ("లైమే యొక్క వీక్షించే స్థలం" అని స్పానిష్ భాషలో అర్ధం) అని ఆయన గౌరవార్ధం పెట్టారు. ఈ మార్గాన్నే ప్రస్తుతం పర్యాటకులను ఇస్ల రటన్ క్యాంపు నుంచి తీసుకువెళ్ళడానికి వాడుతారు.

జలపాతం ఎత్తును అధికారపూర్వకంగా 1949లో అమెరికాకు చెందిన పాత్రికేయుడు రూథ్ రాబర్ట్సన్ నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటి సర్వేలో కనుగొన్నాడు.[14] తొలిసారి విజయవంతంగా ఆయం తెపుయిని ఎక్కి జలపాతం పై భాగానికి వెళ్ళిన సంఘటన గురించి డేవిడ్ నాట్ రచించిన ఏంజల్స్ ఫోర్ అనే పుస్తకములో వివరించబడింది.

1949 మే 13 న అమెరికన్ జర్నలిస్ట్ రూత్ రాబర్ట్‌సన్ నిర్వహించిన యాత్ర ద్వారా జరిపిన సర్వే ద్వారా జలపాతం యొక్క అధికారిక ఎత్తు నిర్ణయించబడింది. [15] [16] 1949 ఏప్రిల్ 23 న ప్రారంభమైన రాబర్ట్‌సన్ యాత్ర కూడా జలపాతం అడుగుభాగంలోకి చేరింది. [17] మొట్టమొదటిగా శిఖరం అధిరోహించే ప్రయత్నం 1968 లో తడిగా ఉన్న కాలంలో జరిగింది. జారే రాతి కారణంగా ఇది విఫలమైంది. 1969 లో పొడి వాతావరణం ఉన్న కాలంలో రెండో ప్రయత్నం జరిగింది. 120 మీటర్లు (400 అ.) వరకు చేరినా ఈ ప్రయత్నం విఫలమైంది. శిఖరంపైకి మొదటి అధిరోహణ 1971 జనవరి 13 న పూర్తయింది. అధిరోహకులు, అమెరికన్ పర్వతారోహకుడు, పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌కు చెందిన ఎలక్ట్రికల్ ఇంజనీర్ జార్జ్ బోగెల్ నేతృత్వంలోని 4 మంది వ్యక్తుల బృందం అధిరోహించడానికి తొమ్మిదిన్నర రోజులు, ర్యాప్పల్ చేయడానికి ఒకటిన్నర రోజులు అవసరం. [18] [19]

పర్యాటక రంగం

[మార్చు]

ఏంజెల్ జలపాతం వెనిజులాలోని ప్రముఖ పర్యాటక ఆకర్షణలలో ఒకటి, అయితే జలపాతానికి ఒక ప్రయాణం సంక్లిష్టమైన విషయం. జలపాతాలు ఏకాంత అడవిలో ఉన్నాయి. మైకేటియా విమానాశ్రయం లేదా ప్యూర్టో ఓర్డాజ్ లేదా సియుడాడ్ బోలివర్ నుండి ఒక విమానం కనైమా క్యాంప్‌కి చేరుకోవాల్సిన అవసరం ఉంది. ఇది జలపాతం దిగువన నది పర్యటనలకు ప్రారంభ స్థానం. నదుల పర్యటనలు సాధారణంగా జూన్ నుండి డిసెంబరు వరకు జరుగుతాయి. నదులు పెమన్ గైడ్‌ల ఉపయోగం కోసం లోతుగా ఉంటాయి. పొడి కాలంలో (డిసెంబరు నుండి మార్చి వరకు), ఇతర నెలల కంటే తక్కువ నీరు కనిపిస్తుంది.

పొడిగా ఉండే కాలపు చివర్లో పాక్షికంగా మబ్బుపట్టినట్లు కనిపించే దృశ్యం
View of Angel Falls and Auyantepui from Isla Raton camp

మూలాలు

[మార్చు]
  1. "Angel Falls". Encyclopædia Britannica. 17 November 2013. Retrieved 22 May 2015.
  2. "Plane Pilot Sights Highest Waterfall in World". Popular Science: 37. April 1938.
  3. "The History of Jimmie Angel". Jimmie Angel Historical Project. Archived from the original on 16 March 2010.
  4. Carroll, Rory (21 December 2009). "Hugo Chávez renames Angel Falls". The Guardian. London. Retrieved 25 April 2010.
  5. "Venezuela Chavez renames world's tallest waterfall". Thomson Reuters Foundation. 17 September 2011. Archived from the original on 14 January 2010. Retrieved 24 August 2016.
  6. "Chávez dice que no decretó el cambio de nombre del Salto del Ángel". Noticias24. Archived from the original on 20 ఏప్రిల్ 2010. Retrieved 22 May 2015.
  7. "The Lost World: Travel and information on the Gran Sabana, Canaima National Park, Venezuela". Archived from the original on 14 అక్టోబరు 2002. Retrieved 14 Nov 2009.
  8. సాన్చేజ్ రామోస్, వలెరియానో: Farua: revista del Centro Virgitano de Estudios Históricos , ISSN 1138-4263, Nº. 8, 2005 , pags. 105–142. Disponible en Dialnet – Universidad de La Rioja (España)
  9. "Jimmie Angel … An Explorer". 2008. Archived from the original on 5 అక్టోబరు 2013. Retrieved 14 Nov 2009.
  10. Angel, Karen (2001). "The Truth About Jimmie Angel & Angel Falls". Retrieved 14 Nov 2009.
  11. Casanova_y_Solanas, Eugenio (2013). La conquista del Orinoco.
  12. "Jimmie Angel ... An Explorer". 25 December 2008. Archived from the original on 5 October 2013. Retrieved 22 May 2015.
  13. Angel, Karen (2001). "The Truth About Jimmie Angel & Angel Falls". Retrieved 14 November 2009.
  14. Robertson, Ruth (2006). "Jungle Journey to the World's Highest Waterfall.". In Jenkins, Mark (ed.). Worlds to Explore. National Geographic. ISBN 978-1-4262-0044-1.
  15. Angel, Karen (April 2012). "Why the World's Tallest Waterfall is Named Angel Falls" (PDF). Terrae Incognitae. 44: 16–42. doi:10.1179/0082288412Z.0000000003. Archived from the original (PDF) on 2 జూన్ 2013. Retrieved 5 March 2013.
  16. Robertson, Ruth (April 2007). "Jungle Journey to the World's Highest Waterfall". In Jenkins, Mark (ed.). Worlds to Explore. National Geographic. ISBN 978-1-4262-0044-1.
  17. Polk, Milbry; Tiegreen, Mary (2001). Women of Discovery: A Celebration of Intrepid Women who Explored the World (in ఇంగ్లీష్). Scriptum Editions. p. 189. ISBN 9781902686172.
  18. David Nott, Angels Four, Prentice-Hall Inc. 1972 chronicles the first successful climb up the face of Auyantepui to the top of the falls.
  19. J., Hellman; R., Slone; J., Unkovic (1978). "GEORGE BOGEL 1944-1977". American Alpine Journal. 21 (2): 674.

బాహ్య లింకులు

[మార్చు]

Media related to Kerepakupai merú (category) at Wikimedia Commons