ఎ డాల్స్ హౌస్ ఇబ్.సన్ నాటకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇబ్సన్ "ఎ డాల్స్ హౌస్" మూడంకాల నాటకం, 1879లో ముద్రణ అయింది, ఆయేడె డిసెంబర్ 21న నార్వె రాజధాని కోపెన్.హేగెన్ రాయల్ డేనిష్ థియేటర్ లో తొలి ప్రదర్శన జరిగింది. ప్రదర్శన చూచి ప్రేక్షకులు కోపంతో రెచ్చిపోయారు. నాటకంలో ఆనాటి వివాహ వ్యవస్థ, స్త్రీల స్థితిగతులమీద, మింగుడుపడని విమర్శలు, జెండర్ సమానత్వం మీద వ్యాఖ్యలు ఉన్నాయి. స్త్రీలు సమాజం నిర్ణయించిన కఠినమయిన నియమాలను అనుసరిచడాన్ని ఈ నాటకం విమర్శిస్తుంది. స్త్రీల హక్కులు, మహిళలకు సంబంధించిన సమాజ నియమాలను విమర్శిస్తుంది. ఈ నాటకం అసంఖ్యాకమయిన సినిమాలు, టి.విరూపకాలుగా, ఎన్నో విధాలుగా యూరోప్, ఆమెరికాలలో ప్రదర్శించబడుతూనే ఉంది.

నాటకం కథ. కథాకాలం 19వ శతాబ్ది మొదటిభాగం, నార్వే దేశంలో ఏదో ఒక టౌన్. నోరా హెల్మర్ ఒక గృహిణి, భర్త Torvalad Helmer బ్యాంకు ఉద్యోగి, ముగ్గురు బిడ్డలు,ఆనందంగా సాగుతున్న సంసారం. డాక్టర్ ర్యాంక్ నోరా కుటుంబానికి ఆత్మీయుడు, డాక్టర్ కూడా. అతను ఏదో జబ్బుతో చివరి దశలో ఉన్నపుడు నోరాతో ఆమెను ప్రేమిస్తున్నానని తన ప్రేమను తెలియజేస్తాడు, తాను అతణ్ణి కుటుంబ స్నేహితుణ్ణిగా మాత్రమే భావిస్తున్నట్లు చెప్పి సున్నితంగా అతని ప్రేమను నోరా తిరస్కరిస్తుంది.

క్రిష్ణని నోరా బాల్య స్నేహితురాలు. క్రిష్ణని కొంతకాలం Krodgsad అనే వ్యక్తితో సహజీవనం చేస్తుంది కుటుంబం గడవడం కోసం.

నోరా భర్త బ్యాంకి ఛైర్మన్ అవుతాడు. అదే బ్యాంకులో Krodgsad ఉద్యోగి. అతని అవినీతి కరమయిన ప్రవర్తనవల్ల నోరా భర్త అతన్ని ఉద్యోగం నుంచి తీసివేస్తాడు. అతణ్ణి మళ్ళీ ఉద్యోగంలో పెట్టుకోమని నోరా స్నేహితురాలు క్రిష్ణని నోరాను బ్రతిమాలుతుంది. నోరా భర్తను Krodgsad ను ఉద్యోగంలో పెట్టుకోమని అర్ధించినా Krodgsadకు ఉద్యోగం ఇవ్వడానికి ఆమె భర్త నిరాకరిస్తాడు అతను నమ్మకస్తుడు కాడనే కారణంతో.

Krodgsad నోరాను కలిసి నోరా తన తండ్రి సంతకం ఫోర్జరీచేసి రుణం తీసుకొన్న వ్యవహారం ఆమె భర్తకు చెబుతానని బెదిరిచి, బెదిరించినట్లే బ్యాంకు కాగితాలు నోరా భర్త లెటర్ బాక్సులో పడేస్తాడు. నోరా ఆ కాగితాలు భర్త కంట పడకుండా, రహస్యం బయట పడకుండా దాచడానికి ప్రయత్నం చేస్తుందికానీ చివరకు భర్త Torvalad Helmmer చూడనే చూస్తాడు. తన ట్రీట్మెంట్ కోసం నోరా దొంగసంతకం చేసిందని తెలిసినా, తనను గొప్ప నిజాయితీగా నడుచుకొనే పెద్దమనిషిగా భావించుకొంటూ ఆరోజునుంచి నోరాను ఒక బానిస లాగా చూడడం, చులకనగా చూడడం మొదలుపెడతాడు. ఆమె పెనిమిటి ప్రవర్తనను సహించలేక, ఆత్మగౌరవాన్ని నిలుపుకొనేందుకు, భర్తను, ముగ్గురు పిల్లలను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. నోరా తను జీవిస్తున్న జీవితం కృత్రిమమయినదని, అవాస్తవికమని, అబద్ధపు జీవితం అని, ఈ బంధాలను తెంచుకొని వెళ్లిపోవాలని గ్రహిస్తుంది. జెండర్, వెలుపలికి కనిపించని వాస్తవాలు, సంప్రదాయ భావాలను ప్రశ్నించడం ఈ నాటకం ధ్యేయం.

ఆమెభర్త ఇల్లు ఒక Doll's House, అందులో బొమ్మే నోరా, భర్త వినోదంకోసం ఆటబొమ్మ. ప్రతీకాత్మకమయిన పేరు.


మూలాలు: A Doll's House Play by Henrik Ibsen