Jump to content

ఎ.యస్.యన్.మూర్తి

వికీపీడియా నుండి
ఎ.యస్.యన్.మూర్తి
అన్నంరాజు సత్యనారాయణ మూర్తి
జననంఅన్నంరాజు సత్యనారాయణ మూర్తి
(1946-01-21) 1946 జనవరి 21 (వయసు 78)
భీమవరం , భీమవరం మండలం పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ భారతదేశం
నివాస ప్రాంతంబెంగళూరు, కర్నాటక, ఇండియా
వృత్తివిశ్రాంత డిప్యూటీ చీఫ్ సిగ్నల్ రైల్వే ఇంజనీర్ ( IRSSE)
ప్రసిద్ధిరచయిత, Gor Banjara Bhagavad Gita సంగీతం రూపకర్త.
భార్య / భర్తఅన్నంరాజు లక్ష్మి
పిల్లలురవి భరద్వాజ, వేణు మాధవ్
తండ్రిసుబ్బారావు
తల్లినాగరత్నం

అన్నంరాజు సత్యనారాయణ మూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాం, పశ్చిమ గోదావరి జిల్లా,భీమవరం గ్రామానికి చెందిన రచయిత, విశ్రాంత చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి, గోర్ బంజారా సంపూర్ణ భగవద్గీత సంగీత రూపకర్త[1].

జననం విద్యాభ్యాసం

[మార్చు]

అన్నంరాజు సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో అన్నంరాజు సుబ్బారావు , నాగరత్నం దంపతులకు రెండవ సంతానంగా 1946లో జనవరి 21 న జన్మించాడు.ప్రాథమిక విద్యా పాలకోడేరు , పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నత విద్య ప్రి యూనివర్శిటి కోర్స్ WGB కాలేజి, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ,యం బి టి యస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ గుంటూరు,నేషనల్ అకాడెమీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్, వడోదర ఫోర్ స్కూల్ ఆఫ్ మ్యానేజ్ మెంట్ ఢిల్లీ,ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఢిల్లీ,ఇండియన్ రైల్వే ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైల్వే సిగ్నలింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్‌‌ సికింద్రాబాద్, చివరిగా ఇండియన్ రైల్వే సర్వీసెస్ ఆఫ్ సిగ్నల్ అండ్ టెలికామ్ ఇంజనీర్స్ (IRSSE)లో ఉత్తీర్ణత సాధించాడు.

బంజారా సమాజ సేవ

[మార్చు]

గోర్ బంజారా భగవద్గీత సంగీత రూపకం ఎ.యస్.యన్.మూర్తి బంజారా జాతికి చెందకపోయినా, బంజారా సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో భగవద్గీత జ్ఞానాన్ని బంజారా ప్రజలకు వినూత్నంగా అందించారు. భగవద్గీతను గోర్ బోలి భాషలో సంగీత రూపకం గా మలచి మొబైల్ ఫోన్‌ల ద్వారా, యు ట్యూబ్ ద్వారా ఉచితంగా అందించారు. భగవద్గీత ప్రాచుర్యం కోసం పుస్తకం కొనడం, చదవడం వంటి అవసరాలు లేకుండా చేశారు. ఈ ప్రేరణాత్మక "గోర్ బంజారా భగవద్గీత సంగీత రూపకం" ప్రాజెక్టుకు మూర్తి ఉదారంగా నిధులు సమకూర్చారు మరియు ప్రతిభావంతులైన తమ కుటుంబ సభ్యులైన శ్రీమతి రజని శ్రీ పూర్ణిమ (గాయని) మరియు శ్రీమతి రమణి హైమావతి (సంగీత దర్శకురాలు) సహాయంతో దీనిని సాకారం చేశారు.

బంజారా భాషలో భగవద్గీత శ్లోకాలు

[మార్చు]
గోర్ బంజారా భగవద్గీత శ్లోకాలు సంగీత రూపకం.

బంజారా సమాజ ప్రజలకు మాతృభాష గోర్ బోలి శ్రవణ మాధ్యమంలో ద్వారా గోర్ బంజారా సంపూర్ణ భగవద్గీత సంగీత రూపకంలో అందించేందుకు కృషి చేస్తున్నాడు. భగవద్గీత లోని 18 అధ్యాయాలలో 700 శ్లోకాలను బంజారా భాష సంస్కృతికి శ్రవణ మాధ్యమం ద్వారా రోజుకు ఒక శ్లోకం చొప్పున మొత్తం ఆరు అధ్యాయాలు పూర్తి చేశాడు. ఏడవ అధ్యాయం ప్రారంభించాడు. చదవడం, రాయడం అవసరం లేకుండా భగవద్గీతను బంజారా భాషలో శ్రవ్యమైన సంగీతంను మేళవించి సంగీత రూపకంలో బంజారా సమాజం ప్రజలకు ఉచితంగా సోషల్ మీడియా ద్వారా అందిస్తున్నాడు[2].

పుస్తకాలు

[మార్చు]

సేవాగడ్ టూ పోహ్రాగడ్ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రచించాడు[3].

మూలాలు

[మార్చు]
  1. Nestham, Vaasthava (2025-01-13). "Sevaalaal Maharaj : ఆంగ్ల భాషలో సంత్ సేవాలాల్ మహారాజ్ జీవిత చరిత్ర పుస్తకం". Vaasthava Nestham (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2025-01-13.
  2. "Vaasthava Nestham Telugu News Paper - 13 Jan 2025 - Page 4". epaper.vaasthavanestham.com. Retrieved 2025-01-13.
  3. Sevagad to poharagad. "Sevagad to poharagad".