Jump to content

ఎ.కె.ప్రేమాజం

వికీపీడియా నుండి
ఎ.కె.ప్రేమాజం

నియోజకవర్గం Badagara


వ్యక్తిగత వివరాలు

జననం (1938-12-08) 1938 డిసెంబరు 8 (వయసు 86)
Pallikkunnu, Kannur, కేరళ
రాజకీయ పార్టీ భారతీయ కమ్యూనిష్టు పార్టీ
జీవిత భాగస్వామి డా. కె. రవీంద్రనాథ్
సంతానం ఇద్దరు
మూలం http://parliamentofindia.nic.in/ls/lok12/biodata/12kl03.htm

ఎ. కె. ప్రేమాజం (A.K Premajam) (జ: 1938 డిసెంబరు 8) ప్రముఖ పార్లమెంటు సభ్యురాలు, సంఘ సేవకురాలు.[1]

తొలి రోజులు

[మార్చు]

ఈమె కన్నూరు మండలంలో పల్లిక్కున్ను గ్రామంలో జన్మించింది. కాలికట్ విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రోవిడెన్స్ కళాశాల, మద్రాసు విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రభుత్వ బ్రెన్నెన్ కళాశాల, కేరళ విశ్వవిద్యాలయ కళాశాల లలో విద్యాభ్యాసం చేసింది. ఆమె మాస్టర్స్ డిగ్రీ సంపాదించి ఉపాధ్యాయినిగా వృత్తి విద్యను ప్రారంభించింది. అనతికాలంలోనే కొజికోడ్ లోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రధాన అధ్యాపకురాలుగా 1991 నుండి 1994 వరకు పనిచేసింది.

రాజకీయ జీవితం

[మార్చు]

ప్రేమాజం తన రాజకీయ జీవితాన్ని కొజికోడ్ మేయరుగా ప్రారంభించింది. ఈమె మేయర్ పదవిలో 1995 నుండి 1998 వరకు ప్రజలకు సేవచేసింది. ఈమె 12వ లోకసభకు, 13వ లోకసభకు 1998, 1999లో ఎన్నుకోబడింది.[2] ఆమె తిరిగి 2010 నుంచి కోజికోడ్ కార్పొరేషను మేయరుగా ఉంది.[3]

మూలాలు

[మార్చు]
  1. "Lok Sabha: Members". Government of India. Archived from the original on 7 అక్టోబరు 2012. Retrieved 4 March 2013.
  2. "Lok Sabha: Members". Government of India. Archived from the original on 20 నవంబరు 2015. Retrieved 4 March 2013.
  3. "Mayors swear in". Mathrubhumi. 9 November 2010. Archived from the original on 12 నవంబరు 2010. Retrieved 4 March 2013.