Jump to content

ఎస్.ఆర్.ఎ.ఎస్. అప్పలనాయుడు

వికీపీడియా నుండి
ఎస్.ఆర్.ఎ.ఎస్ అప్పలనాయుడు
ఎస్.ఆర్.ఎ.ఎస్. అప్పలనాయుడు

మాజీ మంత్రి, మాజీ ఎంపి, ఎంఎల్‌ఎ

పదవీ కాలం
1967-71
మొదటి మంత్రి ఫిషరీస్ , ఓడరేవులు
ముందు ఈటి నాగయ్య
నియోజకవర్గం పరవాడ శాసనసభ నియోజకవర్గం

పదవీ కాలం
1971-84
ముందు మిస్సుల సూర్యనారాయణ మూర్తి
నియోజకవర్గం అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 6 నవంబర్,1925
పెందుర్తి,విశాఖపట్నంజిల్లా
మరణం 1996
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్

ఎస్.ఆర్.ఎ.ఎస్. అప్పలనాయుడు (1925, నవంబరు 6 - 1996) అనకాపల్లి నుండి 3 సార్లు (1971,1977,1980) పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన రాజకీయ నాయకుడు.[1][1][1].ఎస్.ఆర్.ఎ.ఎస్. అప్పలనాయుడు పూర్తి పేరు శ‌ర‌గ‌డం రామ సూరి అప్పలనాయుడు.

జననం, విద్య

[మార్చు]

1925లో విశాఖపట్నంలోని పెందుర్తిలో జన్మించారు. అతను బర్మాలోని రంగూన్‌లో తన ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు.

వివాహం

[మార్చు]

అతను 1946లో కొండయమ్మను వివాహం చేసుకున్నాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

అతను 1944-1964 మధ్య 4 సార్లు పెందుర్తి గ్రామ మునిసిభుగా పనిచేశాడు. 1964-1967 మధ్య అప్పటి గ్రామ సర్పంచ్‌గా పనిచేశాడు[2].అతను జిల్లా సహకార సభ్యునిగా పనిచేశాడు మరియు కాంగ్రెస్ పార్టీకి పిసిసి సభ్యునిగా కూడా పనిచేశాడు పరవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన మొదటి వ్యక్తి .[2] అవిభా జీత మద్రాసు రాష్ట్రంలో, 1946 లో టంగుటూరి ప్రకాశం ప్ర వేళ పెట్టిన ఫిర్కా అభివృద్ది పథకం అమలులో అప్పల నాయుడు ప్రముఖంగా పాల్గొన్నారు. హరిజన సంక్షేమ విషయాలలో ఆయన చాలో శ్రద్ద తీసుకున్నారు. 'పెందుర్తిలో (పాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ఉన్నత పాఠళాలనూ నెలకొల్చ్పడంలో ఆయన ప్రధాన పాత్ర వహించారు.[2]

అతను 1967 నుండి 1972 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు. అతను భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పరవాడ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు.[3] 1969-71 మధ్య కాలంలో ఆయన మత్స్య, ఓడరేవుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన 1982-83లో వుడా ఛైర్మన్‌గా కూడా ఉన్నారు.[4] ఉక్కు గనుల సహకార పార్లమెంటరీ సభ్యునిగా కూడా పనిచేశాడు[5]. ఆయన మత్స్య, ఓడరేవుల మంత్రిగా ఉన్న సమయంలో 250 లక్షలతో కాకినాడ పోర్టు, 80 లక్షలతో బందర్ మచిలీపట్నం పోర్టు అభివృద్ధి పనులు చేశారు.[6]ఆయన పార్లమెంటు సభ్యునిగా ఉన్న సమయంలో, ఆంధ్ర రాష్ట్ర పార్లమెంటు సభ్యులతో కలిసి రాయలసీమ ప్రాంతానికి రైలు మార్గాన్ని కూడా ప్రతిపాదించారు.[7]రైతులపై నేరుగా ప్రభావం చూపే ఎరువులను బదిలీ చేసేందుకు రైల్వే శాఖ వ్యాగన్లకు నిరాకరించడంపై ఆయన శ్రీ ఇందిరాగాంధీకి లేఖ రాశారు.[8]2 కోట్ల మార్కెట్ వాటా కలిగిన అనకాపల్లి బెల్లం మార్కెట్‌కు అదనపు వ్యాగన్లను కూడా డిమాండ్ చేశాడు[9].

స్మారక చిహ్నం :

[మార్చు]

1990వ దశకం మధ్యలో విశాఖపట్నంలోని పెందుర్తి క్రాస్ రోడ్స్‌లో ఆయన జ్ఞాపకార్థం ఒక కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

ఆయన జ్ఞాపకార్థం 2016లో విశాఖపట్నంలోని కశింకోట ఈసీబీలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Anakapalli (Andhra Pradesh) Lok Sabha Election Results - Anakapalli Parliamentary Constituency, Winning MP and Party Name". www.elections.in. Retrieved 2023-07-16.
  2. 2.0 2.1 2.2 "ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధులు". Andhra Pradesh ఆంధ్రప్రదేశ్ Magazine Volume 13 Issue 9. 13: 12–16. 1969-07-01.
  3. "🗳️ S. R. S. Appalanaidu. winner in Paravada, Andhra Pradesh Assembly Elections 1967: LIVE Results". LatestLY (in ఇంగ్లీష్). Archived from the original on 2023-07-05. Retrieved 2023-07-05.
  4. "Visakhapatnam Metropolitan Region Development Authority-VMRDA". vmrda.gov.in. Retrieved 2023-07-05.
  5. Patrika, Andhra (1980). "విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి మరో 70 కోట్లు ?". ANDHRAPATRIKA Volume no 67 issue no 66. Retrieved 1980-06-06. {{cite news}}: Check date values in: |access-date= (help)
  6. Andhra pradesh, Dept of Information and PR (1970-01-01). "ఆంధ్యప్రదేళ్‌లో రేవుల అభివృద్ధి". Andhra Pradesh Magazine Volume 14 Issue 3. Retrieved 1970-01-01. {{cite news}}: Check date values in: |access-date= (help)
  7. Jyothi, Andhra (1973-04-09). "రాయలసీమలో కొత్తగా రైలు మార్గాల నిర్మాణం". ANDHRAJYOTHI Volume no 13 issue no 267. Retrieved 1973-04-09. {{cite news}}: Check date values in: |access-date= (help)
  8. PATRIKA, ANDHRA (1981-05-01). "ANDHRAPATRIKA". ANDHRAPATRIKA Volume no 68 issue no 30. Retrieved 1981-05-01. {{cite news}}: Check date values in: |access-date= (help)
  9. PATRIKA, ANDHRA (1973-04-22). "అనకాపల్లి నుంచి బెల్లం నిలవలకు వ్యాగన్లు". ANDHRAPATRIKA Volume no 60 issue no 20. Retrieved 1973-04-22. {{cite news}}: Check date values in: |access-date= (help)