ఎలిమినేటి కృష్ణారెడ్డి
ఎలిమినేటి కృష్ణారెడ్డి | |||
![]()
| |||
ఎమ్మెల్సీ
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2017 మార్చి 30 - ప్రస్తుతం | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | వడపర్తి, భువనగిరి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా | 22 నవంబరు 1936||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | నర్సిరెడ్డి, లక్ష్మమ్మ | ||
జీవిత భాగస్వామి | కౌసల్య | ||
సంతానం | ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు | ||
నివాసం | హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం | ||
మతం | హిందూ |
ఎలిమినేటి కృష్ణారెడ్డి తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి తరపున తెలంగాణ శాసన మండలి సభ్యుడిగా ఉన్నాడు.[1]
జీవిత విషయాలు
[మార్చు]కృష్ణారెడ్డి 1936, నవంబరు 22న నర్సిరెడ్డి, లక్ష్మమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి మండలంలోని వడపర్తి పట్టణంలో జన్మించాడు.[2] ఇతని తమ్ముడు ఎలిమినేటి మాధవ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నుండి వివిధ మంత్రిత్వ శాఖలలో పనిచేసాడు.[3] మరియాలలో జెడ్‌పిహెచ్‌ఎస్ నుండి ఎస్‌ఎస్‌సి పూర్తిచేశాడు. బిఏ, బిఎడ్ వరకు చదువుకున్న కృష్ణారెడ్డి, వివిధ ప్రాంతాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందాడు.
వ్యక్తిగత వివరాలు
[మార్చు]కృష్ణారెడ్డికి కౌసల్యతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు.
రాజకీయరంగం
[మార్చు]తెలంగాణ రాష్ట్ర సమతి పార్టీలో చేరిన కృష్ణారెడ్డి జిల్లాలో ముఖ్యనేతగా ఎదిగాడు. టిఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ గా కూడా కొంతకాలం పనిచేశాడు.[4] 2017, మార్చి 30న శాసన సభ్యుల కోటాలో శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[5]
ఇతర వివరాలు
[మార్చు]హాంకాంగ్, నేపాల్, సింగపూర్, థాయిలాండ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొదలైన దేశాలలో పర్యటించాడు.
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు, జిల్లా వార్తలు (31 July 2021). "పేదల శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం". EENADU. Archived from the original on 1 August 2021. Retrieved 1 August 2021.
- ↑ Telangana data, MLCs (29 September 2020). "Telangana Assembly Constituency MLC Alimineti Krishna Reddy". www.telanganadata.news. Archived from the original on 1 August 2021. Retrieved 1 August 2021.
- ↑ "Telangana CM declares candidates for seven MLC seats, prefers defectors". The New Indian Express. Retrieved 2021-08-01.
- ↑ "TRS to contest all three MLC seats from MLAs quota". The Hindu (in Indian English). Special Correspondent. 2017-03-05. ISSN 0971-751X. Retrieved 2021-08-01.
{{cite news}}
: CS1 maint: others (link) - ↑ Sakshi (31 March 2017). "నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం". Archived from the original on 19 ఆగస్టు 2021. Retrieved 19 August 2021.