ఎలిజబెత్ కురియన్ మోనా
ఎలిజబెత్ కురియన్ "మోనా" | |
---|---|
జననం | ఎలిజబెత్ కురియన్ 1949 అక్టోబరు 18 హైదరాబాద్,తెలంగాణ |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | కవయిత్రి, అనువాదకురాలు. |
ఎలిజబెత్ కురియన్ మోనాహైదరాబాదుకు చెందిన బహుభాషా కవయిత్రి. ఈమె మాతృభాష మలయాళం. కానీ మలయాళంతో పాటు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషలలో కవిత్వం వ్రాస్తుంది. ఈమె బాల్యం అంతా హైదరాబాదులోనే గడిచింది. రోజరీ కాన్వెంట్, నిజాం కళాశాలలో ఈమె చదివింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేస్తూ హైదరాబాదు, ముంబైలలో పనిచేసింది. మేనేజర్‌గా పదవీ విరమణ పొంది ప్రస్తుతం హైదరాబాదులో నివసిస్తూ ఉంది.
ఈమె ఎక్కువగా ఉర్దూలో గజళ్ళను వ్రాస్తుంది. "మోనా" అనేది ఈమె తఖల్లుస్ (కలం పేరు). ఈమె న్యూఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియాలో కరెస్పాండెన్స్ ద్వారా ఉర్దూ వ్రాయడం, చదవడం నేర్చుకుంది. హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం నుండి తెహసీన్ - ఎ- గజల్ కోర్సును చదివింది. ఈమె కమల్ ప్రసాద్ "కమల్", ముంబైకు చెందిన ఆర్.పి.శర్మ "మెహరిష్"లవద్ద గజల్ మెలకువలను నేర్చుకుంది.[1] [2]
రచనలు
[మార్చు]- కహ్‌కషాన్ (ఉర్దూ) - ఈ గ్రంథానికి ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీల అవార్డు లభించింది.
- ముహబ్బత్ కె సాయె (ఉర్దూ)
- జఖ్ జుసాతాజు (ఉర్దూ)
- ఖాసే కుజా (ఉర్దూ)
- బియాండ్ ఇమేజస్ (ఇంగ్లీషు)
- సప్నే మరుస్థల్ మే (హిందీ)
- హస్నే గజల్ (హిందీ)
- కానాకినావుకల్ (మలయాళం)
- మిర్రర్స్ ఆఫ్ మై సోల్ (ఇంగ్లీషు - అనువాదం)
- ట్రెమర్స్ (ఇంగ్లీషు - అనువాదం)
- ఎవెయిటింగ్ ఎ న్యూ సీజన్ (ఇంగ్లీషు - అనువాదం)
- ది ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ గజల్ - ఎ రీడర్స్ గైడ్ టు ఉర్దూ గజల్ (ఇంగ్లీషు)
- గాడ్ పార్టికల్ అంద్ అదర్ పొయెమ్స్ (ఇంగ్లీషు - అనువాదం) మొదలైనవి.
ఈమె బియాండ్ ఇమేజస్ పుస్తకం ఫ్రెంచి, తమిళ భాషలలోకి అనువదించబడింది.
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "PROFILE OF ELIZABETH KURIAN MONA". rekhta. Retrieved 26 October 2024.
- ↑ వెబ్ మాస్టర్. "Elizabeth Kurian Mona". Cyberwit. Retrieved 26 October 2024.