ఎలక్ట్రో ఎన్సెఫాలో గ్రఫీ
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |

ఈఈజిని ఆంగ్లంలో Electro Encephalo Graphy అని వ్రాస్తారు. ఈఈజి (EEG) అనే పదాన్ని ఇలా విడకొట్టవచ్చు - encephalo : మెదడు ; electro : విద్యుత్తుకి సంబంధించిన ; graphy : రాయుట. అనగా మెదడులో వుత్పత్తి అయ్యే విద్యుత్తరంగాలని సేకరించుట అని అనవచ్చు.ఎలక్ట్రో ఎన్సెఫాలో గ్రఫీలో మన మెదడులో వున్న నాడీ కణాల మధ్య జరిగే ఆయనిక విద్యుత్ సరఫరాలో వచ్చే వోల్టేజ్ మార్పులను సేకరించడం జరుగుతుంది . ఈ తరంగాలకి ఎంతో ప్రాధాన్యం ఉంది. మెదడుకు సంబంధించిన చాలా రుగ్మతలను ఈ తరంగాల యొక్క ప్రవర్తన ఆధారంగా గుర్తించవచ్చు. ముఖ్యంగా మూర్ఛ రోగం (epilepsy) యొక్క ఆనవాలు ఈ తరంగాల ద్వారా అధ్యయనం చేయడం జరుగుతుంది. నిద్ర పోవు వేళల్లో కూడా ఈ తరంగాలని గ్రహించి రోగి యొక్క మానసిక పరిస్థితిని గమనించవచ్చు. మన శరీరంలో కేవలం కన్ను మాత్రం పని చేస్తే మన మెదడులో ఎటువంటి తరంగాలు వస్తాయో తెలుసుకొనే అధ్యయనంలో ఒక మనిషిని విశ్రాంత పరిచి కేవలం కొన్ని సంజ్ఞలను ప్రసారం చేసి ఈ తరంగాలను గ్రహిస్తారు. ఇలాగే కొన్ని ప్రత్యేకమైన ధ్వనులని ఆ మనిషికి వినిపిస్తూ కూడా ఈ తరంగాలను గ్రహిస్తారు. ఒక ఆరోగ్యమైన మనిషి కొన్ని శబ్దాలను వినడం వలన వుత్పత్తి అయ్యే తరంగాలను అధ్యయనం చేసి చెవిటి రోగులకు కోక్లియర్ ఇంప్లాంట్లు (cochlear implants) తయారు చేస్తారు.
చరిత్ర
[మార్చు]వైద్యుడైనటువంటి రిచర్డ్ కేటన్ (సా.శ. 1842-సా.శ.1926) మొట్టమొదటి సారిగా సా.శ. 1875 లో బ్రిటిష్ వైద్య పత్రికలో కోతి, కుందేల యొక్క మెదడు భాగంలో జరిగేటటువంటి విద్యుత్ సంఘటనలను పొందుపరిచారు. సా.శ. 1890 లో పోలాండ్ కు చెందిన అడాల్ఫ్ బెక్ అనే మనస్తత్వవేత్త కుందేలు, శునకాలలో కాంతి మార్పుల వల్ల మెదడులో సంభవించే లయబద్ధమైన విద్యుత్తరంగాలను గమనించారు. సా.శ. 1924న జర్మన్ శాస్త్రవేత్త హాన్స్ బర్గర్ మొట్ట మొదటి సారిగా మనిషి ఈఈజీని గ్రహించారు. ఈఈజిని గ్రహించగల ఎలక్ట్రో ఎన్సెఫలో గ్రాం అనే పరికరాన్ని ఈయన రూపొందించారు. ఈ ఆవిష్కరణను నాడీ వ్యవస్థ శాస్త్రం లోనే అతి గొప్పదిగా భావిస్తారు.
