Jump to content

ఎరగుడిపాటి హనుమంతరావు

వికీపీడియా నుండి
ఎరగుడిపాటి హనుమంతరావు
జననంసెప్టెంబర్ 24, 1898 -
మరణంమార్చి 20, 1959
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల నటుడు, న్యాయవాది, ఉపాధ్యాయుడు
తల్లిదండ్రులుగోపాలకృష్ణయ్య, భూదేవమ్మ

ఎరగుడిపాటి హనుమంతరావు (సెప్టెంబర్ 24, 1898 - మార్చి 20, 1959) ప్రముఖ రంగస్థల నటుడు, న్యాయవాది, ఉపాధ్యాయుడు.[1]

జననం - విద్యాభ్యాసం

[మార్చు]

హనుమంతరావు 1898, సెప్టెంబర్ 24న గోపాలకృష్ణయ్య, భూదేవమ్మ దంపతులకు నెల్లూరు జిల్లా గూడురు లో జన్మించాడు. నెల్లూరు సి.ఏ.ఎమ్. హైస్కూల్ లో ఎస్.ఎస్.ఎల్.సి. చదివి ఆంగ్లంలో బంగారు పతకం సాధించాడు. మద్రాసు లోని క్రిస్టియన్ కళాశాలో ఇంటర్, పచ్చయప్ప కళాశాలో బి.ఏ. చదివాడు.

ఉద్యోగం

[మార్చు]

కొలంబో, సిమ్లా సచివాలయంలో కొంతకాలం పనిచేశాడు. 1925లో గూడూరు హైస్కూల్ లో ఉపాధ్యాయుడిగా పనిచేసి, ఆ తరువాత మద్రాసు లా కళాశాలలో ప్లీడర్ పరీక్షలో ఉత్తీర్ణుడై, గూడూరులో న్యాయవాదిగా పనిచేశాడు. ఆంగ్లంలో న్యాయశాస్త్రంపై పుస్తకాలు రాశాడు.

రంగస్థల ప్రస్థానం

[మార్చు]

వేదం వెంకటరాయశాస్త్రికి శిష్యుడైన హనుమంతరావు ఆంధ్రసభ ప్రదర్శించిన నాటకాలలో నటించడం ప్రారంభించాడు. దువ్వూరి రామిరెడ్డి రచించిన కుంభరాణా నాటకంలో కుంభరాణా పాత్ర ధరించి నటుడిగా పేరు గడించాడు. పఠాన్ రుస్తుం, హిరణ్యకశిపుడు, యుగంధరుడు, కుంభరాణా మొదలైన పాత్రలలో నటించాడు.

మరణం

[మార్చు]

హనుమంతరావు 1959, మార్చి 20న మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.683.