Jump to content

ప్రశ్నార్థక పదాలు

వికీపీడియా నుండి
(ఎప్పుడు నుండి దారిమార్పు చెందింది)
ప్రశ్నార్థక చిహ్నం

ఒక విషయాన్ని గురించి పూర్తి సమాచారాన్ని అధ్యయనం చేసేందుకు కనీసంగా నాలుగు ప్రశ్నలకు సమాధానం పొందవలసి ఉంటుంది. అవి ఎప్పుడు?, ఎక్కడ?, ఏమిటి?, ఎలా?. ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానం వస్తే విషయం క్లుప్తంగా అర్ధం అవుతుంది. ఉదాహరణకు చెప్పుకోవాలంటే - ఒక లారీ యాక్సిడెంటు జరిగిందని అనుకోండి.... __ఆ ప్రమాదం ఎప్పుడు జరిగింది? జ: ఫలానా సమయంలో...! __ఆ ప్రమాదం ఎక్కడ జరిగింది? జ: ఫలానా చోట...! __అసలు ఆ ప్రమాదం ఏమిటి ? జ: ఒక లారీ, ఆటోను డీ కొంది...! __అసలు ఆ ప్రమాదం ఎలా జరిగింది? జ: ఒక లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఓవర్ టేక్ చేస్తూండగా డీ కొంది...! ---అంటే యాక్సిడెంటు గురించి కొంత మేరకు క్లుప్తంగా సమాచారం లభిస్తుంది. ఇంకా అదనపు సమాచారం కావాలంటే 'ఆ ప్రమాదం ఫలితం ఏమిటని ప్రశ్నిస్తే ' మృతిచెందిన ...లేదా గాయపడిన వారి సంఖ్య తెలుస్తుంది. వారివివరాల కోసం __ఆ ప్రమాద బాధితులు ఎవరు ? అని ప్రశ్నిస్తే బాధితుల వివరాలు లభిస్తాయి. ఇదే ప్రశ్నలు-సమాధానాలు మన బయోడేటాల లోనూ లభిస్తాయి. ఒక అభ్యర్థి ఉద్యోగం కోసం పంపే దరఖాస్తు ___ ఆ అభ్యర్థి ఎవరు?, ఏమి చదువుకున్నాడు? ఎక్కడ చదువుకున్నాడు? ఎప్పుడు చదువుకున్నాడు? వంటి వివరాలు తెలియజేస్తుంది. అందుకే వ్యక్తిత్వ వికాస నిపుణులు ప్రశ్నించడం నేర్చుకోండి... ఆ ప్రశ్నలకు సమాధానం పొందడం ద్వారా ఆ సమాచారాన్ని ఆకళింపు చేసుకుంటూ మరింత అదనపు సమాచారం కోసం మరిన్ని సందేహాలు మీలో ప్రశ్నల రూపంలో మొదలవుతాయి. ఆయా ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొనే కొద్దీ అవే మిమ్మల్ని విజ్ఞానం వైపు నడిపిస్తాయంటూ సలహా ఇస్తుంటారు. పత్రికా విలేకరులు ఇలాటి ప్రశ్నలకు సమాధానం పొందడం ద్వారా విషయ సేకరణ చేస్తుంటారు.

ఎక్కడ

[మార్చు]

ఏదైనా సంఘటన గురించి ఏ ప్రదేశంలో జరిందో, జరగబోతుందో తెలుసుకోవడానికి ఉపయోగించే ప్రశ్న ఎక్కడ. జర్నలిజం ప్రక్రియలోని అతి ముఖ్యమైన ఆరు ఎ లులో ప్రముఖమైన ఒక ఎ యొక్క అర్థం ఎక్కడ. ఎక్కడ అను పదాన్ని ఆంగ్లంలో వేర్ (Where) అంటారు.

సామెతలు

[మార్చు]
  • ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు

పాటలు

[మార్చు]
  • ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక - ఈ పాట మహేష్‍బాబు హీరోగా నటించిన మురారి (2011) చిత్రం లోనిది.
  • ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ దాక్కున్నావే లక్కుని తెచ్చే చుక్క ఎక్కువ చిక్కులు పెట్టక, చిక్కవే చప్పున చక్కగ - ఈ పాట లేడీస్ టైలర్ (1986) చిత్రం లోనిది.

ఏమిటి

[మార్చు]

ఏదైన విషయాన్ని గురించి సమాచారాన్ని సేకరించడం కోసం వేసే ప్రశ్నలలో ఒకటి ఏమిటి. ఏదైనా ఒక సందర్భం జరిగినప్పుడు ఆ సందర్భం గురించి తెలుసుకోవాలనుకున్న వ్యక్తి వేసే మొట్టమొదటి ప్రశ్న ఏమిటి. ఈ ఏమిటి అనే ప్రశ్న తరువాత తదుపరి ప్రశ్నలు మొదలవుతాయి. ఏమిటి అనే ప్రశ్న ద్వారా జరిగిన, జరుగుతున్న, జరగబోయే అంశాల గురించి ప్రాథమిక సమాచారం అందుతుంది. జర్నలిజం ప్రక్రియలోని అతి ముఖ్యమైన ఆరు ఎ లులో ప్రముఖమైన ఒక ఎ యొక్క అర్థం ఏమిటి. ఏమిటి అను పదాన్ని ఆంగ్లంలో వాట్ (What) అంటారు.

ఎప్పుడు

[మార్చు]

ఏదైనా సంఘటన గురించి ఏ సమయంలో జరిందో, జరగబోతుందో తెలుసుకోవడానికి ఉపయోగించే ప్రశ్న ఎప్పుడు. జర్నలిజం ప్రక్రియలోని అతి ముఖ్యమైన ఆరు ఎ లులో ప్రముఖమైన ఒక ఎ యొక్క అర్థం ఎప్పుడు. ఎప్పుడు అను పదాన్ని ఆంగ్లంలో వెన్ (When) అంటారు.

ఎవరు

[మార్చు]

ఏదైనా జరిగిన లేక జరగబోతున్న సంఘటన గురించి కారకులయిన వ్యక్తులను తెలుసుకొనుటకు ఎవరు అనే ప్రశ్నను ఉపయోగిస్తారు. జర్నలిజం ప్రక్రియలోని అతి ముఖ్యమైన ఆరు ఎ లులో ప్రముఖమైన ఒక ఎ యొక్క అర్థం ఎవ్వరు. ఎవ్వరు అను పదాన్ని ఆంగ్లంలో వేర్ (Who) అంటారు.

ఎందుకు

[మార్చు]

ఏదైన సంఘటన జరగినది గాని జరగబోతున్న దానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఉపయోగించే ప్రశ్న ఎందుకు. జర్నలిజం ప్రక్రియలోని అతి ముఖ్యమైన ఆరు ఎ లులో ప్రముఖమైన ఒక ఎ యొక్క అర్థం ఎందుకు. ఎందుకు అను పదాన్ని ఆంగ్లంలో వై (Why) అంటారు.

ఏదైనా జరిగిన లేక జరగబోతున్న సంఘటన యొక్క విధానాన్ని తెలుసుకొనుటకు ఎలా అనే ప్రశ్నను ఉపయోగిస్తాము. జర్నలిజం ప్రక్రియలోని అతి ముఖ్యమైన ఆరు ఎ లులో ప్రముఖమైన ఒక ఎ యొక్క అర్థం ఎలా. ఎలా అను పదాన్ని ఆంగ్లంలో హౌ (How) అంటారు.