ఎన్. కె. ప్రేమచంద్రన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎన్. కె. ప్రేమచంద్రన్ లో‍క్‍సభ సభ్యుడు
ఎన్. కె. ప్రేమచంద్రన్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
5 జూన్ 2014 (2014-06-05)
ముందు ఎన్. పీతాంబర కురుప్
నియోజకవర్గం కొల్లాం

కేరళ జలవనరుల శాఖ మంత్రి
పదవీ కాలం
18 మే 2006 (2006-05-18) – 16 మే 2011 (2011-05-16)
ముందు తిరువంచూర్ రాధాకృష్ణన్
తరువాత పీ.జే. జోసెఫ్
నియోజకవర్గం చవర

పదవీ కాలం
1996 (1996) – 1999 (1999)
ముందు ఎస్. కృష్ణ కుమార్
తరువాత పి. రాజేంద్రన్
నియోజకవర్గం కొల్లాం

వ్యక్తిగత వివరాలు

జననం (1960-05-25) 1960 మే 25 (వయసు 64)
నవైకులం , తిరువనంతపురం , కేరళ , భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ
తల్లిదండ్రులు ఎన్. కృష్ణ పిళ్లై
మహేశ్వరి అమ్మ
జీవిత భాగస్వామి ఎస్.గీత[1]
సంతానం 1
పూర్వ విద్యార్థి
  • ఫాతిమా మాతా నేషనల్ కాలేజ్, కొల్లాం
  • ప్రభుత్వ న్యాయ కళాశాల, తిరువనంతపురం

ఎన్. కె. ప్రేమచంద్రన్ (జననం 25 మే 1960) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కొల్లాం నుండి ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

ప్రేమచంద్రన్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కొల్లాం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ తొలిసారి, 1998లో వరుసగా రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2000 నుండి 2006 వరకు రాజ్యసభ సభ్యుడిగా, 2006లో జరిగిన కేరళ శాసనసభ ఎన్నికలలో ఎమ్మెల్యేగా ఎన్నికై జలవనరుల శాఖ మంత్రిగా పని చేశాడు.

ప్రేమచంద్రన్ 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కొల్లాం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఐ(ఎం) అభ్యర్థి మరియం అలెగ్జాండర్ బేబీపై 37,649 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో 1 సెప్టెంబర్ 2014 నుండి 25 మే 2019 వరకు మానవ వనరుల అభివృద్ధిపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, 15 సెప్టెంబర్ 2014 నుండి 25 మే 2019 వరకు పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్‌లో ఆహార నిర్వహణపై జాయింట్ కమిటీ సభ్యుడిగా, కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడిగా పని చేశాడు.

ప్రేమచంద్రన్ 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కొల్లాం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఐ(ఎం) అభ్యర్థి కెఎన్ బాలగోపాల్ పై 1,48,869 ఓట్ల మెజారిటీతో గెలిచి నాలుగవసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై లోక్‌సభలో ప్యానెల్ ఆఫ్ చైర్‌పర్సన్స్ గా, రసాయనాలు & ఎరువులపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, సాధారణ ప్రయోజనాల కమిటీ సభ్యుడిగా, విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడిగా పని చేసి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసి గెలిచి ఐదొవసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. "'He is a Soft Person'". 16 June 2014. Archived from the original on 3 August 2024. Retrieved 3 August 2024.
  2. Deccan Herald (18 February 2024). "RSP's N K Premachandran to contest again from Kerala's Kollam" (in ఇంగ్లీష్). Archived from the original on 3 August 2024. Retrieved 3 August 2024.
  3. The New Indian Express (25 March 2024). "Kerala LS polls: Battle between Premachandran, Mukesh and Krishnakumar for Kollam seat" (in ఇంగ్లీష్). Retrieved 3 August 2024.
  4. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Kollam". Archived from the original on 5 August 2024. Retrieved 5 August 2024.
  5. The Hindu (4 June 2024). "Lok Sabha Elections: Premachandran scores a swift hat-trick in Kollam" (in Indian English). Archived from the original on 5 August 2024. Retrieved 5 August 2024.