ఎన్.వి. రమణయ్య
స్వరూపం
ఎన్.వి. రమణయ్య | |
---|---|
జననం | జూలై 10, 1935 |
మరణం | జనవరి 16, 2018 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త, సంపాదకుడు |
ఎన్.వి. రమణయ్య (1935 జూలై 10 - 2018 జనవరి 16) ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త, సంపాదకుడు.[1]
జననం
[మార్చు]రమణయ్య 1935, జూలై 10న ప్రకాశం జిల్లా, సింగరాయకొండలో జన్మించాడు. బింగినిపల్లి, ఒంగోలు, నెల్లూరు, విజయనగరంలలో విద్యాభ్యాసం పూర్తిచేశాడు.
సామాజిక కార్యకర్తగా
[మార్చు]డిగ్రీ విద్యార్థిగా ఉన్నప్పుడు నెల్లూరు విఆర్ కళాశాల కార్యదర్శిగా, డి.ఎస్.యు. కార్యదర్శిగా పనిచేసాడు. చేతన, నవవికాస్ సంస్థల ద్వారా సేవ కార్యక్రమాలు నిర్వహించాడు.
సాహిత్య సేవ
[మార్చు]ఉన్నవ రచనలు, హేతువాద రచనలు, అక్షర, శంకరన్, మధుమురళి బాలమురళి, పరిశోధన, బతుకుచిత్రం, ఏకాంతసేవ మొదలైన గ్రంథాలకు సంపాదకత్వం వహించాడు.
మరణం
[మార్చు]ఈయన 2018, జనవరి 16న హైదరాబాదులో మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ ప్రజాసాహితి మాసపత్రిక, ఫిబ్రవరి 2018, జనసాహితి ప్రచురణ, పుట.4.