Jump to content

ఎఖినోకాక్టస్ గ్రుసోనీ

వికీపీడియా నుండి

Echinocactus grusonii
Echinocactus grusonii
దస్త్రం:Echinocactus grusonii
Echinocactus grusonii
Scientific classification
Kingdom:
(unranked):
angiosperms
(unranked):
eudicots
(unranked):
core eudicots
Order:
caryophyllales
Family:
cacatace
Subfamily:
cacatace
Genus:
echinocacatus
Species:
Echinocactus grusonii
Binomial name
Echinocactus grusonii

ఎఖినోకాక్టస్ గ్రుసోనీ వృక్షం పుష్పించే జాతికి చెందినది. ఇది ఒక రకమైన జెముడు మొక్క. ఈ మొక్కను ఆంగ్లంలో మదర్-ఇన్లాస్ కుషన్ అనీ, గోల్డెన్ బారెల్ కాసిల్ అనీ, గోల్డన్ బాల్ అనీ పిలుస్తారు. తూర్పు-మధ్య మెక్సికో ఈ మొక్కకి పుట్టినిల్లు. ఇది తన జన్మస్థాన ప్రదేశంలో ఒక లుప్తమవబోయే మొక్కగా గుర్తించబడింది. ఈ మొక్క అగ్నిపర్వతాల వద్ద భూమి ఉపరితలానికి 1400 మీటర్లలో పెరుగుతుంది.

వర్గీకరణ

[మార్చు]

ఎఖినోకాక్టస్ గ్రుసోనీ ఎఖినోకాక్టస్ శ్రేణికి చెందింది. దీనిని వృక్షశాస్త్రంలో బ్యారెల్ కాక్టి కింద వ్యవహరిస్తారు. 1891లో మొట్టమొదటిసారి ఈ మొక్కను జెర్మన్ వృక్షశాస్త్రజ్ఞుడు హీన్రిక్ హిల్డ్మన్ వివరించాడు.

లక్షణాలు

[మార్చు]

గోళాకారంగామొక్క పెరుగుతుంది. 3.3 అడుగుల వరకూ ఎత్తు పెరగవచ్చు. వీటి వయస్సు 30 ఏళ్ళు. [1] ఈ జెముడు ముళ్ళు బాగా పదునుగా పసుపు, అప్పుడప్పుడు తెలుపు వర్ణంలో ఉంటాయి.

ఎండాకాలంలో పసుపు రంగులో చిన్న చిన్న పుష్పాలు మొక్క శీర్షభాగంలో పూస్తాయి. ఇవి మొక్క 20 ఏళ్ళ వయసు వచ్చాక మాత్రమే పూస్తాయి.

ఉపయోగాలు

[మార్చు]
  1. ఈ వృక్షం ను అలంకరణ కొరకు వాడుతారు.
  2. ఈ మొక్క ఫలాలను నీటి వనరుగా వాడతారు.[2]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఐయూసీఎన్ వద్ద ఈ మొక్క గురించి వివరాలు
  2. ఈ మొక్క ఉపయోగాలు