ఎం.శారదా మీనన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎం.శారదా మీనన్ (1923 ఏప్రిల్ 5 - 2021 డిసెంబరు 5) 1959లో భారత దేశంలోనే మొదటి మహిళా సైకియాట్రిస్ట్‌. [1]

మంగళూరులో పుట్టిన డాక్టర్ శారద మీనన్ మద్రాస్ మెడికల్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. బెంగళూరులోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ సైకియాట్రీలో శిక్షణ పొందారు. ఆ తర్వాత అదే సంస్థకు సుదీర్ఘకాలం హెడ్‌‌గా పనిచేసారు. 1992లో భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. సైకియాట్రిస్ట్ ఆర్.తారతో కలిసి 1984లో శారద మీనన్ షిజోఫ్రీనియా రీసెర్చ్ ఫౌండేసన్ (ఎస్‌సీఏఆర్ఎఫ్ ఇండియా)ను స్థాపించారు. బెంగళూరులో స్కిజోఫ్రెనిక్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌ను స్థాపించి దీని ద్వారా మానసిక సమస్యలపై పరిశోధన, చికిత్సనే కాకుండా ప్రజలకు అవగాహనా కల్పించేవారు. దీనికి డబ్ల్యూహెచ్‌ఓ గుర్తింపూ దక్కింది. ఈ క్రమంలో పరిచయమైన పోలీస్‌ ఆఫీసర్‌నే పెళ్లి చేసుకున్నారు.


98 ఏళ్ల శారదా మీనన్ చెన్నైలో 2021 డిసెంబరు 5న తుదిశ్వాస విడిచారు.[2]

మాంబలికాలతిల్ శారదా మీనన్
జననం(1923-04-05)1923 ఏప్రిల్ 5
మరణం2021 డిసెంబరు 5(2021-12-05) (వయసు 98)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
వృత్తిసైకియాట్రిస్ట్
సామాజిక కార్యకర్త
క్రియాశీల సంవత్సరాలు1951–2021
సుపరిచితుడు/
సుపరిచితురాలు
స్కిజోఫ్రెనియా రీసెర్చ్ ఫౌండేషన్ (SCARF ఇండియా)
పురస్కారాలు
  • పద్మ భూషణ్
  • అవ్వయ్యర్ అవార్డు
  • రాష్ట్ర ఉత్తమ వైద్యులు అవార్డు
  • భారత ప్రభుత్వ బెస్ట్ ఎంప్లాయర్ అవార్డు
  • ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సైకో-సోషల్ రిహాబిలిటేషన్ స్పెషల్ అవార్డు
  • రోటరీ క్లబ్ సేక్ ఆఫ్ హానర్

మూలాలు

[మార్చు]
  1. "ఈమెది మానసిక భరోసా". EENADU. Retrieved 2022-03-05.
  2. "దేశంలోని తొలి మహిళా సైకియాట్రిస్ట్ డాక్టర్ శారదా మీనన్ కన్నుమూత". andhrajyothy. Retrieved 2022-03-05.